త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Charan Koushik Yadav | కేటీఆర్ ఎన్ని కుట్ర‌లు చేసినా పెట్టుబ‌డుల ప్ర‌వాహం ఆగ‌దు

Charan Koushik Yadav | కేటీఆర్ ఎన్ని, ఎలాంటి కుట్ర‌లు చేసినా హైదరాబాద్ నగర అభివృద్ధిని, పెట్టుబడుల ప్రవాహాన్నీ ఆపడం ఎవరి తరం కాదని టీజీఎల్‌డీఏ చైర్మన్ డా. సింగం చరణ్ కౌశిక్ యాదవ్ హెచ్చరించారు. నిన్న ఫ్యూచర్ సిటీ రైతుల వద్దకు వెళ్లి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పెట్టుబడులు రద్దు చేస్తామ‌ని కేటీఆర్‌ వ్యాఖ్యానించడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు.

S

Telangana | Published On Sep 11, 2026, 1.12 pm IST

Charan Koushik Yadav | కేటీఆర్ ఎన్ని కుట్ర‌లు చేసినా పెట్టుబ‌డుల ప్ర‌వాహం ఆగ‌దు
Advertisement
  • ఫ్యూచ‌ర్ సిటీపై ఆయ‌న‌ దిగ‌జారి మాట్లాడుతున్నారు
  • టీజీఎల్‌డీఏ చైర్మ‌న్ డా.సింగం చరణ్ కౌశిక్ యాదవ్ విమ‌ర్శ‌లు

Charan Koushik Yadav | త్రినేత్ర‌.న్యూస్‌: కేటీఆర్ ఎన్ని, ఎలాంటి కుట్ర‌లు చేసినా హైదరాబాద్ నగర అభివృద్ధిని, పెట్టుబడుల ప్రవాహాన్నీ ఆపడం ఎవరి తరం కాదని టీజీఎల్‌డీఏ చైర్మన్ డా. సింగం చరణ్ కౌశిక్ యాదవ్ హెచ్చరించారు. నిన్న ఫ్యూచర్ సిటీ రైతుల వద్దకు వెళ్లి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పెట్టుబడులు రద్దు చేస్తామ‌ని కేటీఆర్‌ వ్యాఖ్యానించడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. ఢిల్లీ, బెంగళూరుల తరహా కాలుష్య దుస్థితి, మద్రాస్ తరహా వరదల పరిస్థితి హైదరాబాద్‌కి రాకూడదనే సీఎం రేవంత్ రెడ్డి ముందస్తు దూరదృష్టితో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నార‌ని చెప్పారు. నిన్న కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై శుక్ర‌వారం ఆయ‌న ఘాటుగా స్పందించారు.

భారత్ ఫ్యూచర్ సిటీ ద్వారా నగరానికి పర్యావరణహితమైన భారీ పెట్టుబడులు వస్తాయని, హైదరాబాద్ కాలుష్య కోరల్లో చిక్కుకోకుండా రేవంత్ రెడ్డి గారు దూరదృష్టితో వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఓర్వలేనితనంతో కేటీఆర్‌ ప్రజలను రెచ్చగొడుతూ, పెట్టుబడిదారులను బెదిరించే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన బెదిరింపులకు ఎవరూ భయపడరని స్పష్టం చేశారు. రైతుల‌ను రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నాల‌ను మానుకోవాల‌న్నారు. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ అభివృద్ధికి చేసిందేమీ లేదని, రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

Advertisement
Advertisement