KTR | వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిగా చేస్తే ఎలా ఉంటుందో.. భూ దందాలు చేసే రేవంత్ రెడ్డి సీఎం అయితే అలానే ఉంది: కేటీఆర్
KTR | అడవిని నరికే వీరప్పన్‌ను అటవీ శాఖ మంత్రిగా చేస్తే ఎలా ఉంటుందో.. భూ దందాలు చేసే బ్లాక్‌మెయిలర్ రేవంత్ రెడ్డిని (Revanth Reddy) ముఖ్యమంత్రిని చేస్తే అట్లనే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు.
KTR | త్రినేత్ర.న్యూస్: అడవిని నరికే వీరప్పన్‌ను అటవీ శాఖ మంత్రిగా చేస్తే ఎలా ఉంటుందో.. భూ దందాలు చేసే బ్లాక్‌మెయిలర్ రేవంత్ రెడ్డిని (Revanth Reddy) ముఖ్యమంత్రిని చేస్తే అట్లనే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న భూములను హారతి కర్పూరంలా కాజేస్తున్నాడని ఆరోపించారు. `తమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు` అన్నట్లు రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy)వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కొండల్, తొండల్, అనకొండల్ అన్నట్లు.. కొండల్ రెడ్డి, తొండల్ రెడ్డి రాష్ట్రం మీద విరుచుకుపడి దోచేస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో 22ఏ నిషేధిత భూములపై ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తెచ్చే ప్రతీ స్కీమ్ వెనుక పక్కా ఒక స్కామ్ ఉంటుందన్నారు.
ముఖ్యమంత్రి కాకముందు ఆర్‌టీఐని అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసి బతికేవాడు.. ఇప్పుడు గద్దెనెక్కినా అదే బ్లాక్‌మెయిల్ భూదందాలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. తన అనుయాయులు, అన్నదమ్ములకు భూములన్నీ కట్టబెట్టి రూ. లక్షల కోట్ల దోపిడీకి రేవంత్ తెరలేడాని చెప్పారు. శాసనసభలో ప్రజ సమస్యలపై మాట్లాడనివ్వకుండా తమ పార్టీ ఎమ్మెల్యేలను మెడ పట్టి గెంటేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం బాగోతాలు బయటపడతాయనే భయంతోనే తమను శాసనసభ నుంచి సస్పెండ్ చేశారరన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ల్యాండ్ చోరీ విపరీతంగా జరుగుతోందని, ఇందిరమ్మ రాజ్యంలో భూములను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.
సమాంతర రెవెన్యూ వ్యవస్థ..
రాష్ట్రంలో ప్రస్తుతం చీకట్లో ఒక సమాంతర రెవెన్యూ వ్యవస్థ నడుస్తున్నదని కేటీఆర్ ఆరోపించారు. దళితుల, గిరిజనుల అసైన్డ్ భూములు మాయమవుతున్నాయని తెలిపారు. లగచర్లలో వాళ్ల అల్లుడి కోసం గిరిజన భూములు గుంజుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ (BRS) హయాంలో 22A కింద కేవలం 16 లక్షల ఎకరాలు మాత్రమే నిషేధిత జాబితాలో ఉండగా.. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిని కోటి 16 లక్షల ఎకరాలకు పెంచారని విమర్శించారు. తద్వారా రైతులను ఇబ్బంది పెడుతున్న విషయాన్ని రాహుల్ గాంధీ (Rahul Gandhi) దృష్టికి తీసుకువెళ్తామన్నారు.
అత్తసొమ్ము అల్లుడికి దానం చేసినట్లుగా నగరం నడిబొడ్డున ఉన్న పారిశ్రామిక భూములను, మూసీ సుందరీకరణ (Musi Beautification) పేరుతో వేల ఎకరాలను అనుచరులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. ఫ్యూచర్ సిటీలో (Future City) రూ.200 కోట్ల విలువ చేసే భూములను కేవలం రూ.7 కోట్లకే కట్టబెట్టారని చెప్పారు. రాబోయే రెండేండ్లలో కేసీఆర్ సీఎంగా రావడం ఖాయమన్నారు. 22ఏతో నిషేధిత జాబితాలో పెట్టిన భూములన్నింటినీ కాపాడుకుంటామని స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Hyderabad | మైలార్‌దేవ్‌పల్లిలో విషాదం.. వేడి నీళ్ల బకెట్లో పడి నాలుగేండ్ల చిన్నారి మృతి
- ●Gold And Silver Prices Today | యుద్దం ఎఫెక్ట్.. ఒక్క రోజులోనే రూ.26వేలకు పైగా తగ్గిన పసిడి ధర..
- ●PM Modi | మంచివాళ్లతోనే స్నేహం చేయాలి.. బ్రిక్స్ వేళ ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్
- ●Apple Health App | యాపిల్ హెల్త్ యాప్‌లో అదిరిపోయే ఫీచర్లు.. ఇక ఆరోగ్యంపై మరింత నిఘా..
- ●Palvai Harish Babu | రూ.1.50 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నా.. కనీసం 15 వేల ఉద్యోగాలు కూడా లేవు: ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్
- ●పచ్చ.. ఎర్ర? క్యాండిల్ రంగుల వెనుక అసలు కథ ఇదే.. ఎన్ని రకాల క్యాండిల్స్ ఉన్నాయో తెలుసా?

Hyderabad | మైలార్‌దేవ్‌పల్లిలో విషాదం.. వేడి నీళ్ల బకెట్లో పడి నాలుగేండ్ల చిన్నారి మృతి

Gold And Silver Prices Today | యుద్దం ఎఫెక్ట్.. ఒక్క రోజులోనే రూ.26వేలకు పైగా తగ్గిన పసిడి ధర..

PM Modi | మంచివాళ్లతోనే స్నేహం చేయాలి.. బ్రిక్స్ వేళ ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్

Apple Health App | యాపిల్ హెల్త్ యాప్‌లో అదిరిపోయే ఫీచర్లు.. ఇక ఆరోగ్యంపై మరింత నిఘా..






