త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ED Raids | కోల్‌క‌తాలో బొగ్గు కుంభ‌కోణం.. హైద‌రాబాద్‌లో ఈడీ సోదాలు

ED Raids | కోల్‌క‌తా బొగ్గు కుంభ‌కోణానికి (Kolkata Coal Scam) సంబంధించి దేశ‌వ్యాప్తంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌ర్ (ED) అధికారులు సోదాలు (ED Raids) నిర్వ‌హిస్తున్నారు.

G

Hyderabad | Published On Sep 11, 2026, 12.44 pm IST

ED Raids | కోల్‌క‌తాలో బొగ్గు కుంభ‌కోణం.. హైద‌రాబాద్‌లో ఈడీ సోదాలు
Advertisement

ED Raids | త్రినేత్ర‌.న్యూస్‌: కోల్‌క‌తా బొగ్గు కుంభ‌కోణానికి (Kolkata Coal Scam) సంబంధించి దేశ‌వ్యాప్తంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌ర్ (ED) అధికారులు సోదాలు (ED Raids) నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగా హైద‌రాబాద్‌లోనూ (Hyderabad) దాడులు నిర్వ‌హించారు. న‌గ‌రంలోని ఏఎంఆర్ (AMR) సంస్థ కార్యాల‌యంతోపాటు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖ నిర్మాత మ‌హేశ్ రెడ్డి ఇంట్లోనూ అధికారులు సోదాలు చేస్తున్నారు. కోల్‌క‌తా, హైద‌రాబాద్‌, జార్ఖండ్‌లోని ప్ర‌ముఖ రాజ‌కీయ నేత‌ల‌కు ఆయ‌న బినామీగా ఉన్న‌ట్లు అధికారులు అనుమానిస్తున్నారు. బొగ్గు సిండికేట్, అక్రమ లావాదేవీలు, నిధుల మళ్లింపు (Money Laundering) కోణంలో ఈ తనిఖీలు సాగుతున్నట్లుగా సమాచారం.

జార్ఖండ్ నుంచి పశ్చిమ బెంగాల్‌కు అక్రమంగా కోలరీ బొగ్గును తరలించడంతో పాటు, చెల్లుబాటు అయ్యే డెలివరీ ఆర్డర్ హోల్డర్లు, ట్రాన్స్‌పోర్టర్ల నుంచి గుండా ట్యాక్స్, జీటీ, రంగదారి ట్యాక్స్ పేరిట సిండికేట్ భారీగా వసూళ్లకు పాల్పడిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. త‌ ద్వారా గత ఐదేండ్ల‌లో రూ.650 కోట్లకు పైగా ఆదాయం సమకూరినట్లు ఈడీ గుర్తించింది. ఇక బొగ్గు అక్రమ రవాణా ఆటకం లేకుండా రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు అధికారులకు, రాజకీయ ప్రముఖులకు లంచాలు ముట్టినట్లు దర్యాప్తులో తేలింది.

Advertisement
Advertisement