త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

No Helmet-No Petrol | రేప‌ట్నుంచి ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ నిబంధ‌న అమ‌లు

No Helmet-No Petrol | రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ‌కు పోలీసులు ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. జాతీయ రోడ్డు భ‌ద్ర‌త మాసోత్స‌వాల్లో భాగంగా న‌ల్ల‌గొండ జిల్లా ఎస్పీ శ‌ర‌త్ చంద్ర ప‌వార్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

S

Telangana | Published On Jan 6, 2026, 2.47 pm IST

No Helmet-No Petrol | రేప‌ట్నుంచి ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ నిబంధ‌న అమ‌లు
Advertisement

No Helmet-No Petrol | త్రినేత్ర‌.న్యూస్ : రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ‌కు పోలీసులు ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. జాతీయ రోడ్డు భ‌ద్ర‌త మాసోత్స‌వాల్లో భాగంగా న‌ల్ల‌గొండ జిల్లా ఎస్పీ శ‌ర‌త్ చంద్ర ప‌వార్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. రేప‌ట్నుంచి న‌ల్ల‌గొండ జిల్లా వ్యాప్తంగా నో హెల్మెట్ - నో పెట్రోల్ నిబంధ‌న‌ను అమ‌లు చేయాల‌ని ఆదేశించారు.

ఎస్పీ తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు జిల్లా పరిధిలోని అన్ని పెట్రోల్ బంకుల్లో హెల్మెట్ ధరించకుండా వచ్చిన ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ సరఫరా చేయరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంక్ నిర్వాహకులు, సిబ్బందికి ఈ నిబంధన అమలుపై స్పష్టమైన సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే, ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తూ కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహించామని ఆయన పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదాలలో ద్విచక్ర వాహనదారులే అధికంగా ప్రాణాలు కోల్పోతున్నారని, ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడం వల్ల తల గాయాలు తీవ్రంగా మారి ప్రాణనష్టం సంభవిస్తున్న ఘటనలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రజల ప్రాణాలను కాపాడడం ప్రధాన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్పీ స్పష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement