త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nizams Jewels | ఆర్‌బీఐ వద్ద నిజాం నగలు.. వాటి విలువ ఎంత ఉంటుందో తెలుసా?

Nizams Jewels | ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఆరో స్థానంలో ఉన్న నిజాంకు భారీగా ఆస్తులున్నాయి. వీటి విలువ ఏకంగా రూ.11,80,000 కోట్లుగా అంచనా. ఏడో నిజాం ఉస్మాన్‌ అలీఖాన్ (Nizam Osman Ali Khan) 1967లో 80 ఏండ్ల‌ వయసులో కన్నుమూశారు. అప్పటివరకు భారతీయుల్లోనే అత్యంత సంపన్నుల్లో ఆయన ఒకరు.

G

Telangana | Published On Jan 30, 2026, 11.36 am IST

Nizams Jewels | ఆర్‌బీఐ వద్ద నిజాం నగలు.. వాటి విలువ ఎంత ఉంటుందో తెలుసా?
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: నిజాం న‌వాబు (Nizam Nawab).. ఈ పేరు విన‌గానే హైద‌రాబాద్ సంస్థానంలో ఖాసీ ర‌జ్వీ నేతృత్వంలోని రజాకారుల అకృత్యాలు గుర్తుకు వ‌స్తాయి. ఈ పేరు విన‌గానే అసెంబ్లీ, సిటీ కాలేజీ, ఆర్ట్స్ కాలేజీ, సిటీ సెంట్ర‌ల్ లైబ్ర‌రీ వంటి ఎన్నో సుంద‌ర క‌ట్ట‌డాలు, ఆడంబ‌ర జీవనం, కోహినూర్ డైమండ్‌, అంద‌మైన న‌గ‌లు (Nizams Jewels) మ‌న‌ క‌ళ్ల‌ముందు మెదులుతాయి. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఆరో స్థానంలో ఉన్న నిజాంకు భారీగా ఆస్తులున్నాయి. వీటి విలువ ఏకంగా రూ.11,80,000 కోట్లుగా అంచనా. ఏడో నిజాం ఉస్మాన్‌ అలీఖాన్ (Nizam Osman Ali Khan) 1967లో 80 ఏండ్ల‌ వయసులో కన్నుమూశారు. అప్పటివరకు భారతీయుల్లోనే అత్యంత సంపన్నుల్లో ఆయన ఒకరు. నిజాం పాల‌కులు, వారి కుటుంబ స‌భ్యుల వ‌ద్ద విలువైన ఆభ‌ర‌ణాలు, న‌గ‌లు ఉన్నాయి.

వాటిని 1970లోనే నిజాం నగలను విదేశీయులకు రూ. 14కోట్లకు విక్రయించేందుకు నిజాం ట్రస్టీలు ప్రయత్నించారు. అయితే నిజాం మనవరాలు (మీర్‌ ఉస్మాన్‌ అలీ కుమారుడు మోజం జాహ్‌, ఆయన కూతురు ఫాతిమా ఫౌజియా) అడ్డుకున్నారు. ఈ విష‌యం కాస్తా సుప్రీంకోర్టుకు వ‌ర‌కు వెళ్ల‌డంతో 1995లో ఆ నగలను 995లో కేంద్రం వీటిని రూ.218 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో అవి ఢిల్లీకి చేరాయి. ప్ర‌స్తుతం అవి రిజర్వ్‌బ్యాంక్ (RBI) వద్ద ఉన్నాయి.

బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా నిజాం పాలకులకు చెందిన 173 అద్భుతమైన ఆభరణాలు (Nizams Jewels) 1995 నుంచి ఆర్‌బీఐ వాల్ట్స్‌లోనే భద్రంగా ఉన్నాయని ప్రభుత్వానికి తెలుసా..? అని కొందరు సభ్యులు మంత్రిని ప్రశ్నించారు. దీనికి ప్ర‌తిగా ఆభరణాల చారిత్రక, సాంస్కృతిక, వారసత్వ ప్రాముఖ్యతను గుర్తించి అధిక భద్రత మధ్య వాటిని ఉంచామని రాజ్యసభలో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాతపూర్వకంగా వెల్లడించారు. వాటిని హైదరాబాద్‌లో ప్రజల సందర్శనకు ఉంచే అంశంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. కాగా, ఇప్ప‌టివ‌ర‌కు ఆ న‌గ‌ల‌ను రెండుసార్లు (2001, 2006లో) మాత్రమే హైదరాబాద్‌లో ప్రదర్శించారు. దిల్లీలోని నేషనల్‌ మ్యూజియంలో భారీ భద్రత నడుమ వీటిని ప్రదర్శిస్తున్నారు.

ఇవి ప్రత్యేకం..

నిజాంల పాల‌కుల‌కు చెందిన అత్యంత ఖ‌రీదైన 173 రకాల వజ్రాభరణాలు, వెండి వస్తువులు వీటిలో ఉన్నాయి. తలపాగా ఆభరణాలు, నెక్లెస్‌లు, చెవిపోగులు, ఆర్మ్‌బ్యాండ్‌లు, కంకణాలు, గంటలు, బటన్‌లు, కఫ్‌లింక్‌లు, చీలమండలు, వాచ్‌చైన్, ఉంగరాలు, ముత్యాలు, వైఢూర్యాలు, పగడాలు తదితర నగలున్నాయి. ఏడుతీగల బస్రా ముత్యాలహారాన్ని సత్లాడ అని పిలుస్తారు. ఇందులో 465 ముత్యాలను పొందుపరిచారు. 184.7 క్యారెట్ల బరువున్న ప్రపంచంలోనే అయిదో పెద్దదైన జాకబ్‌ డైమండ్‌ విలువైన వస్తువుల్లో ఒకటి.

Advertisement

తాజావార్తలు

Advertisement