HDFC Bank | హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో లోన్ తీసుకున్న వారికి గుడ్ న్యూస్.. తగ్గిన వడ్డీ రేట్లు..
HDFC Bank | దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ నిర్దిష్ట కాలపరిమితులకు రుణ వడ్డీ రేట్లను సవరించింది. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ మార్పులు మే 7 నుంచి అమల్లోకి వచ్చాయి. తాజా సవరణతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎంసీఎల్‌ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్) రేట్లు రుణ కాలపరిమితిని బట్టి 8.05 శాతం నుంచి 8.60 శాతం మధ్య ఉంటాయి.
HDFC Bank | దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ నిర్దిష్ట కాలపరిమితులకు రుణ వడ్డీ రేట్లను సవరించింది. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ మార్పులు మే 7 నుంచి అమల్లోకి వచ్చాయి. తాజా సవరణతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎంసీఎల్‌ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్) రేట్లు రుణ కాలపరిమితిని బట్టి 8.05 శాతం నుంచి 8.60 శాతం మధ్య ఉంటాయి. సవరణకు ముందు ఈ రేట్లు 8.10 శాతం నుంచి 8.55 శాతం మధ్య ఉన్నాయి. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్‌ఆర్) అనేది బ్యాంకులు రుణాలపై విధించాల్సిన కనీస వడ్డీ రేటు. దీనిని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) 2016లో ప్రవేశపెట్టింది.
తక్కువ కాలపరిమితికి ఎక్కువ ప్రయోజనం..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఓవర్‌నైట్, ఒక నెల, మూడు నెలలు, ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్ రేట్లను తగ్గించింది. ప్రస్తుతం ఓవర్‌నైట్ ఎంసీఎల్‌ఆర్ 8.10 శాతం నుంచి 8.05 శాతానికి తగ్గింది. ఒక నెల ఎంసీఎల్‌ఆర్ కూడా 8.10 శాతం నుంచి 8.05 శాతానికి తగ్గగా, మూడు నెలల ఎంసీఎల్‌ఆర్ 8.20 శాతం నుంచి 8.15 శాతానికి వచ్చింది. అలాగే ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్ ప్రస్తుతం 8.30 శాతంగా ఉంది. ఒక సంవత్సరం ఎంసీఎల్‌ఆర్ 8.35 శాతంగా కొనసాగుతుండగా, రెండేళ్ల ఎంసీఎల్‌ఆర్ 8.45 శాతంగా ఉంది. మూడు సంవత్సరాల ఎంసీఎల్‌ఆర్ మాత్రం 8.55 శాతం నుంచి 8.60 శాతానికి పెరిగింది.
వడ్డీ రేట్లు ఇలా..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బేస్ రేట్ ప్రస్తుతం 8.80 శాతంగా ఉంది. ఇది 2025 డిసెంబర్ 26 నుంచి అమల్లో ఉంది. బ్యాంక్ బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ (పీఎల్‌ఆర్)ను 2025 డిసెంబర్ 26 నుంచి 17.30 శాతంగా సవరించింది. రూ.3 కోట్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రస్తుతం అందిస్తున్న వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. ఒక సంవత్సరం నుంచి 15 నెలల లోపు కాలపరిమితికి 6.25 శాతం, 18 నెలల నుంచి మూడు సంవత్సరాల లోపు కాలపరిమితికి 6.45 శాతం, మూడు సంవత్సరాల ఒక రోజు నుంచి ఐదు సంవత్సరాల లోపు కాలపరిమితికి 6.40 శాతం వడ్డీ ఇస్తోంది. సీనియర్ సిటిజన్లు అన్ని కాలపరిమితులపైనా సాధారణ కస్టమర్లతో పోలిస్తే కొద్దిగా ఎక్కువ వడ్డీ రేట్లను పొందవచ్చు.
రుణం తీసుకున్న వారికి మేలు..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సవరించిన ఎంసీఎల్‌ఆర్ రేట్ల కారణంగా తక్కువ కాల పరిమితితో రుణం తీసుకున్న వారికి మేలు జరగనుంది. వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. అయితే ఫ్లోటింగ్ రేట్ విధానంలో తీసుకున్న లోన్లకే వడ్డీ రేట్లు తగ్గుతాయి. ఎక్కువగా ఇంటి రుణాలను ఈ తరహాలో తీసుకుంటారు. అందువల్ల ఇంటి రుణ గ్రస్తులకు వడ్డీ రేట్లు తగ్గుతాయి. నెలవారి లేదా త్రైమాసిక సైకిల్‌లో ఈ రేట్లను ఆటోమేటిగ్గా అమలు చేస్తారు. దీని వల్ల వినియోగదారులు తమ తదుపరి చెల్లింపు వచ్చే వరకు వడ్డీ రేట్లు తగ్గేందుకు వేచి చూడాల్సి ఉంటుంది.
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



