Revanth Reddy | రూ.9,053 కోట్లతో 13 అభివృద్ధి పనులు.. శంకుస్థాపనలు చేసిన సీఎం
Revanth Reddy | లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్లో సోమవారం ఏర్పాటు చేసిన రైతు బహిరంగ సభ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy) రూ.9,053 కోట్లతో పలు అభివృద్ధి పనుల (Development Works) కు శంకుస్థాపనలు (Foundation Stone Laying Ceremony) చేశారు.
Revanth Reddy | త్రినేత్ర న్యూస్: లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్ (Lagacharla Industrial Corridor) లో సోమవారం ఏర్పాటు చేసిన రైతు బహిరంగ సభ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy) రూ.9,053 కోట్లతో పలు అభివృద్ధి పనుల (Development Works) కు శంకుస్థాపనలు (Foundation Stone Laying Ceremony) చేశారు. 13 అభివృద్ధి పనులు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఎక్కడెక్కడ చేయనున్నారంటే..
- కొత్తవాల్గూడ నుంచి నాచారం వరకు రూ.5,060 కోట్లతో రేడియల్ రోడ్డు-2, ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద రూ.1,410 కోట్లతో 223 కొత్త, అసంపూర్తి బీటీ రహదారుల పనులు, రూ.2,100 కోట్లతో ఎంఎన్కేఎల్ఐఎస్ రెండో దశ పనులు
- రూ.118.80 కోట్లతో 10 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, రూ.123 కోట్లతో కొడంగల్లో వ్యవసాయ కళాశాల నిర్మాణానికి సంబంధించిన పనులు
- రూ.41.83 కోట్లతో కొడంగల్, కోస్గి, మద్దూరులో ఆధునిక బస్ స్టాండ్లు, రూ.20 కోట్లతో మద్దూరులో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, రూ.20 కోట్లతో సమీకృత డివిజనల్ కార్యాలయ సముదాయం, రూ.59.30 కోట్లతో రహదారుల నిర్మాణ పనులు
- తిమ్మారెడ్డిపల్లిలో గురులోక మసంద్ ప్రభు మందిరం అభివృద్ధికి రూ.4.45 కోట్లు, కొడంగల్లో నిరంజన్ మఠం అభివృద్ధికి రూ.5.10 కోట్ల పనులకు శంకుస్థాపన
- హకీంపేట ఇండస్ట్రియల్ కారిడార్లో రూ.10 కోట్లతో పర్యాటక హోటల్ నిర్మాణం, రూ.81 కోట్లతో ఎకోపామ్ పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు
ఈ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి, అజారుద్దీన్, ప్రభుత్వ విప్లు, ఉమ్మడి మహబూబ్నగర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Population Census | జనవరి 25 నుంచి జనాభా లెక్కలు.. నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం
- ●Donation to CMRF | సీఎం జన్మదినం.. సహాయ నిధికి శశిధర్రెడ్డి విరాళం
- ●Mother Monkey Viral Video | పటాకుల మోతకు వణికిపోయిన కోతి పిల్ల.. గుండెలకు హత్తుకున్న తల్లి: కంటతడి పెట్టిస్తున్న వైరల్ వీడియో
- ●Renu Desai | అకీరా, ఆద్య వెనుక ఉన్నది నా సంస్కారమే
- ●Vijay Devarakonda | జపాన్లో విరోష్ జంట దీపావళి సెలబ్రేషన్స్
- ●Alias Rukmini | అలియాస్ రుక్మిణి షూటింగ్ పూర్తి

Population Census | జనవరి 25 నుంచి జనాభా లెక్కలు.. నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం

Donation to CMRF | సీఎం జన్మదినం.. సహాయ నిధికి శశిధర్రెడ్డి విరాళం

Mother Monkey Viral Video | పటాకుల మోతకు వణికిపోయిన కోతి పిల్ల.. గుండెలకు హత్తుకున్న తల్లి: కంటతడి పెట్టిస్తున్న వైరల్ వీడియో

Renu Desai | అకీరా, ఆద్య వెనుక ఉన్నది నా సంస్కారమే




