త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Niranjan Reddy | కాంగ్రెస్ జేబు సంస్థలా సిట్ : నిరంజన్ రెడ్డి

Niranjan Reddy | కాంగ్రెస్ జేబు సంస్థలా సిట్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమ‌ర్శించారు. విచారణ పేరుతో బీఆర్ఎస్ నేతలకు వేధింపుల‌కు గురి చేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ సంతోశ్ కుమార్‌ను విచారణకు పిలవడాన్ని ఒక ప్ర‌క‌ట‌న‌లో ఖండించారు.

P

Telangana | Published On Jan 27, 2026, 11.24 pm IST

Niranjan Reddy | కాంగ్రెస్ జేబు సంస్థలా సిట్ : నిరంజన్ రెడ్డి
Advertisement

Niranjan Reddy | కాంగ్రెస్ జేబు సంస్థలా సిట్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమ‌ర్శించారు. విచారణ పేరుతో బీఆర్ఎస్ నేతలకు వేధింపుల‌కు గురి చేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ సంతోశ్ కుమార్‌ను విచారణకు పిలవడాన్ని ఒక ప్ర‌క‌ట‌న‌లో ఖండించారు. కాంగ్రెస్ ప్రైవేట్ సైన్యంలా పోలీసు వ్యవస్థ తయారైంద‌ని, ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు దొరికాయో సిట్ బయట పెట్టాల‌ని డిమాండ్ చేశారు.

ఆధారాల్లేని వార్తలతో కొన్ని మీడియా సంస్థలు బీఆర్ఎస్ నేతల మీద బురద జల్లుతున్నాయ‌ని, పత్రికా స్వేచ్ఛ పేరుతో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నార‌ని మండిప‌డ్డారు. కాంగ్రెస్ చేతిలో కీలుబొమ్మలుగా మారి పోలీసులు తమ గౌరవాన్ని కోల్పోవద్ద‌ని, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ను విచారణకు పిలవడం వేధించడమేన‌న్నారు. వివరాలు తెలుసుకునేందుకు అంటూనే దోషులుగా చిత్రీకరిస్తున్నార‌ని, సిట్ విచారణతో సంబంధం లేకుండా వస్తున్న వార్తలకు ఏ ఆధారాలు ఉన్నాయో సంబంధిత కథనాలు రాసిన మీడియా సంస్థలను ప్రశ్నించాల‌ని డిమాండ్ చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement