త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NHRC | మంత్రి పొంగులేటికి ఎన్‌హెచ్ఆర్సీ షాక్‌.. మాన‌స హిల్స్ అక్ర‌మ మైనింగ్‌పై చ‌ర్య‌లకు ఆదేశం

NHRC | రాష్ట్ర‌ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి (Ponguleti Srinivas Reddy) జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ (NHRC) షాకిచ్చింది. రాజేంద్రనగర్ మానస హిల్స్‌లో (Manasa Hills) ఎలాంటి అనుమతులు లేకుండా భారీ తవ్వకాలు జరుపుతున్నారన్న ఆరోపణలపై మంత్రి పొంగులేటి కుటుంబానికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ (Raghava Constructions) సంస్థపై ఎన్‌హెచ్ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

G

Telangana | Published On Sep 12, 2026, 7.38 am IST

NHRC | మంత్రి పొంగులేటికి ఎన్‌హెచ్ఆర్సీ షాక్‌.. మాన‌స హిల్స్ అక్ర‌మ మైనింగ్‌పై చ‌ర్య‌లకు ఆదేశం
Advertisement

NHRC | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్ర‌ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి (Ponguleti Srinivas Reddy) జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ (NHRC) షాకిచ్చింది. రాజేంద్రనగర్ మానస హిల్స్‌లో (Manasa Hills) ఎలాంటి అనుమతులు లేకుండా భారీ తవ్వకాలు జరుపుతున్నారన్న ఆరోపణలపై మంత్రి పొంగులేటి కుటుంబానికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ (Raghava Constructions) సంస్థపై ఎన్‌హెచ్ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్ర‌మ మైనింగ్‌పై కేంద్ర స్థాయిలో విచార‌ణ జ‌ర‌పాల‌ని ఆదేశాలు జారీచేసింది. ఆ సంస్థ‌పై రెండు నెల‌ల్లో చ‌ర్య‌లు తీసుకోవాలంటూ కేంద్ర గ‌నుల శాఖ కార్య‌ద‌ర్శికి స్ప‌ష్టం చేసింది. అక్ర‌మ మైనింగ్ వ్య‌వ‌హారంపై కేసు దాఖ‌లు చేసిన తెలంగాణ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మనేనికి స‌మాచారం ఇవ్వాల‌ని తెలిపింది.

ఈ నేప‌థ్యంలో ఎన్‌హెచ్ఆర్‌సీ ఆదేశాల మేర‌కు చ‌ర్య‌లు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని కేంద్ర గ‌నుల శాఖ కోరింది. దీనికి సంబంధించి లాయ‌ర్ రామారావుకు కూడా కేంద్ర గ‌నుల శాఖ అధికారికంగా స‌మాచారం అందించింది.

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని మానస హిల్స్ ప్రాంతంలో పర్యావరణ, గనులు, హెచ్‌ఎండీఏ (HMDA), కాలుష్య నియంత్రణ మండలి (TSPCB) అనుమతులు లేకుండానే రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ రాత్రింబవళ్లు మైనింగ్ కార్యకలాపాలు కొన‌సాగిస్తున్న‌ద‌ని లాయ‌ర్ రామారావు 2026 మార్చిలో ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశారు. దీంతో అక్రమ మైనింగ్ ఆరోపణలపై తగినచర్యలు తీసుకోవాలని కేంద్ర గనుల శాఖను ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది. ఎలాంటి స్టాట్యూటరీ అనుమతులు లేకపోయినా రెవెన్యూ, గనుల శాఖలు, హెచ్‌ఎండీఏ మరియు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మౌనం వహించడంపై కమిషన్ ప్రశ్నించింది. రాజేంద్రనగర్ స్థానిక నివాసితులను కూడా ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేసి, ఎనిమిది వారాలలోగా పూర్తి వివరాలతో కూడిన నివేదికను (Action Taken Report) సమర్పించాలని స్పష్టం చేసింది.

Advertisement
Advertisement