త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NHRC | కాంగ్రెస్ స‌ర్కార్‌పై ఎన్‌హెచ్ఆర్సీకి ఫిర్యాదు

NHRC | అసెంబ్లీ వద్ద పోలీసులు చేసిన దాడిపై ఢిల్లీలోని మానవ హక్కుల కమిషన్‌కు, మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు మహిళా ఎమ్మెల్యేలతో కలిసి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి వెళ్లారు.

S

Telangana | Published On Sep 10, 2026, 10.07 pm IST

NHRC | కాంగ్రెస్ స‌ర్కార్‌పై ఎన్‌హెచ్ఆర్సీకి ఫిర్యాదు
Advertisement

NHRC | త్రినేత్ర‌.న్యూస్ : అసెంబ్లీ వద్ద పోలీసులు చేసిన దాడిపై ఢిల్లీలోని మానవ హక్కుల కమిషన్‌కు, మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు మహిళా ఎమ్మెల్యేలతో కలిసి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి వెళ్లారు.

ఈ సంద‌ర్భంగా జ‌గ‌దీశ్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రభుత్వమే గుండాగిరికి పాల్పడుతోంది. అసెంబ్లీకి వెళ్తున్న మమ్మల్ని రాష్ట్ర పోలీసులే అడ్డగించి దాడి చేసి, మా మహిళా ఎమ్మెల్యేల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. కేసీఆర్ ఇంటి మీదకు దాడి చేయడానికి రేవంత్ రెడ్డే పోలీస్ ఎస్కార్ట్‌ను ఇచ్చి వేలాది మంది గూండాలను పంపించాడు. ఏఐ జనరేటెడ్ ఫోటోలను చేసి మా నాయకుల మీద నాలుగు కేసులు పెట్టారు. మా మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేసి తిరిగి వారి మీదనే కేసులు పెట్టారు. వీటన్నిటికీ సంబంధించి మానవ హక్కుల కమిషన్‌కు, మహిళా కమిష‌న్‌కు ఫిర్యాదు చేయడానికి ఢిల్లీకి వచ్చామ‌ని జ‌గ‌దీశ్ రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement