త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Uterus | ఆ యువ‌కుడికి వృషణాలు లేవు.. ప‌రీక్ష‌లో బ‌య‌ట‌ప‌డ్డ గ‌ర్భాశ‌యం

Uterus | గ‌ర్భాశ‌యం.. సాధార‌ణంగా ఆడ‌వారిలో ఉంటుంది. పిల్ల‌లు పుట్టేందుకు గ‌ర్భ‌సంచి( Uterus ) కీల‌క‌పాత్ర పోషిస్తుంది. ప్ర‌త్యుత్ప‌త్తి వ్య‌వ‌స్థ‌లో ఎంతో కీల‌క‌మైన గ‌ర్భసంచి.. మ‌గ‌వారిలో ఉంటుంది అని ఎవ‌రైనా ఊహించారా..? అంటే ఊహించి ఉండ‌క‌పోవ‌చ్చు. కానీ ఓ 26 ఏళ్ల యువ‌కుడిలో ఢిల్లీ వైద్యులు గ‌ర్భ‌సంచిని గుర్తించారు.

S

National | Published On Sep 11, 2026, 11.54 pm IST

Uterus | ఆ యువ‌కుడికి వృషణాలు లేవు.. ప‌రీక్ష‌లో బ‌య‌ట‌ప‌డ్డ గ‌ర్భాశ‌యం
Advertisement

Uterus | త్రినేత్ర‌.న్యూస్ : గ‌ర్భాశ‌యం.. సాధార‌ణంగా ఆడ‌వారిలో ఉంటుంది. పిల్ల‌లు పుట్టేందుకు గ‌ర్భ‌సంచి( Uterus ) కీల‌క‌పాత్ర పోషిస్తుంది. ప్ర‌త్యుత్ప‌త్తి వ్య‌వ‌స్థ‌లో ఎంతో కీల‌క‌మైన గ‌ర్భసంచి.. మ‌గ‌వారిలో ఉంటుంది అని ఎవ‌రైనా ఊహించారా..? అంటే ఊహించి ఉండ‌క‌పోవ‌చ్చు. కానీ ఓ 26 ఏళ్ల యువ‌కుడిలో ఢిల్లీ వైద్యులు గ‌ర్భ‌సంచిని గుర్తించారు. ఇది వైద్య చ‌రిత్ర‌లోనే ఒక అరుదైన ఘ‌ట‌న అని వైద్యులు పేర్కొన్నారు.

దేశ రాజ‌ధాని ఢిల్లీకి చెందిన ఓ 26 ఏళ్ల యువ‌కుడు సంతాన‌లేమి స‌మ‌స్య‌( Infertility Problem )తో బాధ‌ప‌డుతున్నాడు. అత‌డికి మ‌గ‌వారి లాగే అన్ని అవ‌య‌వాలు ఉన్నాయి. అయినా కూడా అత‌న్ని సంతాన స‌మ‌స్య‌లు వెంటాడుతున్నాయి. చివ‌ర‌కు త‌న స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకునేందుకు వైద్యులను సంప్ర‌దించాడు.

శుక్ర‌క‌ణాల ఉత్ప‌త్తి జీరో.. క్రోమోజోమ్‌లు ఓకే

బాధిత యువ‌కుడికి వైద్యులు ప‌రీక్ష‌లు నిర్వ‌హించి కొన్ని లోపాలు గుర్తించారు. అత‌డిలో రెండు వృష‌ణాలు లేవ‌ని నిర్ధారించారు. వీర్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, శుక్ర క‌ణాల ఉత్ప‌త్తి జీరో అని తేలింది. క్రోమోజోమ్ ప‌రీక్ష‌లు సైతం నిర్వ‌హించారు. మగ‌వారికి ఉండే ఎక్స్‌వై క్రోమోజోమ్‌లే ఉన్న‌ట్లు నిర్ధార‌ణ జ‌రిగింది. క్రోమోజోమ్‌ల విష‌యంలో ఎలాంటి లోపం లేదు.

స్కానింగ్‌లు నిర్వ‌హించ‌గా షాకింగ్

చివ‌ర‌కు అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ స్కానింగ్‌లు నిర్వ‌హించగా, షాకింగ్ విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ఆ షాక్ ఏంటంటే.. బాధితుడి క‌డుపులో గ‌ర్భ‌సంచి ఉండ‌డం. డాక్ట‌ర్లు కూడా షాక‌య్యారు. ఇది నిజ‌మేనా అని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. ఒక సాధార‌ణ మ‌హిళ క‌డుపులో ఉండే గ‌ర్భాశ‌యం మాదిరే.. అత‌డిలో గ‌ర్భాశ‌యం ఉన్న‌ట్లు వైద్యులు నిర్ధారించారు.

గ‌ర్భ‌సంచిలో వృష‌ణాలు

ఉండాల్సిన చోట వృషణాలు లేవ‌ని ముందే నిర్ధారించారు. తీరా చూస్తే ఆ వృష‌ణాలు గ‌ర్భ‌సంచిలో ఉన్నాయ‌ని వైద్యులు తెలిపారు. అవి మ‌హిళ‌ల్లో ఉండే అండాల మాద‌రి ఉన్న‌ట్లు క‌నుగొన్నారు. ఇలా మ‌గ‌వారిలో గ‌ర్బ‌సంచి, అండాలు ఉండ‌టాన్ని వైద్య ప‌రిభాష‌లో పెర్సిస్టెంట్ ముల్లేరియ‌న్ డ‌క్ట్ సిండ్రోమ్ (పీఎండీఎస్) అంటార‌ని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఇక‌, వీర్యంలో శుక్ర‌క‌ణాలు లేకపోవ‌డాన్ని అజూస్పెర్మియా అంటార‌ని కూడా వైద్యులు తెలిపారు. వీరికి పిల్ల‌లు పుట్టే అవ‌కాశాలు త‌క్కువే ఉంటాయ‌న్నారు.

గ‌ర్భ‌సంచి, వృషణాలు తొల‌గింపు

ఈ అరుదైన ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ్డ బాధితుడి క‌డుపులో నుంచి గ‌ర్భ‌సంచిని, వృష‌ణాల్ని తొల‌గించామ‌ని వైద్యులు తెలిపారు. ఇవి ఇలాగే ఉండిపోతే.. అవి క్యాన్స‌ర్‌కు దారి తీసే అవ‌కాశం ఉంద‌ని, అందుకే వాటిని అత‌డి శ‌రీరం నుంచి తొల‌గించిన‌ట్లు వైద్యులు స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం బాధిత వ్య‌క్తి కోలుకుంటున్నాడ‌ని, అత‌డి గ‌ర్భ‌సంచి, వృష‌ణాల్ని ప‌రీక్ష‌ల కోసం పంపించామ‌న్నారు డాక్ట‌ర్లు.

Advertisement
Advertisement