Bhagwant Mann | అత్యాచార కేసుల సెటిల్‌మెంట్‌కు సిండికేట్ దందా.. సీఎం భార్యపై బీజేపీ సంచలన ఆరోపణలు
Bhagwant Mann | పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Bhagwant Mann) భార్య గుర్‌ప్రీత్ కౌర్ ( Gurpreet Kaur)పై బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. అత్యాచార కేసుల సెటిల్‌మెంట్‌కు సిండికేట్ దందా నడుపుతున్నారని, ఒక్కో కేసు పరిష్కారం కోసం రూ. 5 కోట్లు వసూలు చేస్తున్నట్లు ఆరోపించింది.
Bhagwant Mann | త్రినేత్ర.న్యూస్ : పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Bhagwant Mann) భార్య గుర్‌ప్రీత్ కౌర్ ( Gurpreet Kaur) పై బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. అత్యాచారం కేసులను పరిష్కరించేందుకు సీఎం భార్య మధ్యవర్తుల ద్వారా సిండికేట్ దందాను నడుపుతున్నారని తెలిపింది. అత్యాచార కేసులను రూ. 5 కోట్లకు పరిష్కరిస్తున్నారని ఆరోపించింది.
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ (Pradeep Bhandari) విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం భార్య అత్యాచార, క్రిమినల్ కేసులను పరిష్కరించడానికి తన రాజకీయ పలుకుబడిన ఉపయోగిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. తనకు ముఖ్యనేతలతో సంబంధాల ఉన్నాయని, అత్యాచార కేసును పరిష్కరిస్తానంటూ ఓ మధ్యవర్తి మాట్లాడిన ఆడియో క్లిప్‌లను కూడా ప్రదీప్ విడుదల చేశారు. "సీఎం భగవంత్ మాన్, ఆయన భార్య మధ్యవర్తుల ద్వారా ఒక దోపిడీ, అవినీతి దందాను నడుపుతున్నారు. అత్యాచార, క్రిమినల్ కేసులను రూ. 5 కోట్లకు పరిష్కరిస్తున్నారు.
ఇలాంటి కేసులను పరిష్కరించడానికి ముఖ్యమంత్రినే వ్యక్తిగతంగా జోక్యం చేసుకుంటున్నారా..? అనే ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి నివాసం ఒప్పందాలు కుదిరే ప్రదేశంగా మారిపోయింది. ఈ సెటిల్‌మెంట్‌ల ద్వారా వచ్చిన సొమ్మును కొంత పంజాబ్ సూపర్ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు చేరుతోందా..?" అని భండారీ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. సీఎం, పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే లక్ష్యంతోనే విపక్షాలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాయని మండిపడింది. భండారీ చెప్పిందంతా పూర్తిగా కల్పిత కథ అని పేర్కొంది.
అత్యాచారం కేసును తొక్కిపెట్టేందుకు రూ.5 కోట్లు డిమాండ్
ఇదిలా ఉండగా.. అత్యాచారం కేసులో నిందితుడికి అనుకూలంగా వ్యవహరించేందుకు సీఎం భార్య రూ.5 కోట్లు డిమాండ్ చేసినట్లు ఆరోపిస్తూ పంజాబ్-హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజిత్ సింగ్ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు (NHRC) ఇటీవలే ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ.. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)ను ఆదేశించింది. ఆరోపణలపై పూర్తి వివరాలు సేకరించి.. తీసుకున్న చర్యలపై నివేదికను రెండు వారాల్లోగా కమిషన్‌కు సమర్పించాలని స్పష్టం చేసింది. అంతేకాదు, ఈ అంశాన్ని కేంద్ర హోం శాఖలోని మహిళా భద్రతా విభాగం దృష్టికి కూడా తీసుకెళ్లింది. నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని కమిషన్ స్పష్టం చేసింది. ఈ పరిణామాల వేళ బీజేపీ ఆరోపణలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read..
చోరీ భయం.. కారును ఇంటిపైకప్పుపై పార్క్ చేసిన యజమాని
రేవంత్‌లో టీడీపీ రక్తం.. బ్లాక్ మెయిల్ చేసి బర్తరఫ్ చేశారు : కొండా సురేఖ
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Palla Rajeshwar reddy | ఆ 29 ఎకరాల భూమి నాది అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా
- ●Harish Rao | 22ఏ నిషేధిత భూములపై పొంగులేటి అబద్దాల ప్రవాహాన్ని పారించారు
- ●TGPSC | టీజీపీఎస్సీ కీలక ప్రకటన.. 544 అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రరీయన్ పోస్టుల నోటిఫికేషన్ రద్దు
- ●TGSRTC | గణేశ్ ఉత్సవాలు.. ఖైరతాబాద్, బాలాపూర్‌కు ప్రత్యేక బస్సులు
- ●Telugu OTT | తెలుగులో ఓటీటీలో రిలీజైన రెండు మలయాళం సినిమాలు ఒకటి మర్డర్ మిస్టరీ - మరోటి యాక్షన్ థ్రిల్లర్
- ●Ashu Reddy | బోల్డ్ లుక్‌లో అషురెడ్డి - చీరలో అందాలు చూడతరమా!

Palla Rajeshwar reddy | ఆ 29 ఎకరాల భూమి నాది అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా

Harish Rao | 22ఏ నిషేధిత భూములపై పొంగులేటి అబద్దాల ప్రవాహాన్ని పారించారు

TGPSC | టీజీపీఎస్సీ కీలక ప్రకటన.. 544 అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రరీయన్ పోస్టుల నోటిఫికేషన్ రద్దు

TGSRTC | గణేశ్ ఉత్సవాలు.. ఖైరతాబాద్, బాలాపూర్‌కు ప్రత్యేక బస్సులు






