Nethakani | గెజిట్‌లో ‘నేతకాని’ కుల పేరు సవరణకు చర్యలు తీసుకోండి.. మంత్రి వివేక్‌కు రిక్వెస్ట్
Nethakani | ప్రభుత్వ గెజిట్‌తో పాటు అధికారిక రికార్డుల్లో ‘నేతకాని’ కుల పేరును సరిచేయాలని నేతకాని (మహర్) సేవా సంఘం ప్రతినిధులు రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి డాక్టర్ జీ వివేక్ వెంకటస్వామిని కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కొన్ని అధికారిక పత్రాలు, నమోదు ప్రక్రియల్లో ‘నేతకాని’కు బదులుగా ‘మలసాలె-నెట్కాని’గా నమోదు అవుతోందని సంఘం ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ తప్పు నమోదు కారణంగా సమాజానికి చెందిన ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం స్వామి, దుర్గం సిద్ధార్థ రామ్మూర్తి సమర్పించిన వినతిపత్రంలో నేతకాని కులానికి చెందిన ప్రజలు ఖమ్మం, మంచిర్యాల, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్నారని వివరించారు. అధికారిక రికార్డులు, గెజిట్ ప్రకటనలు, కుల ధ్రువీకరణ పత్రాల్లో ‘నేతకాని’ పేరునే ఏకరీతిగా నమోదు అయ్యేలా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని వారు మంత్రిని కోరారు. అధికారులతో ఈ విషయంపై చర్చించి అవసరమైన సవరణలు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వారికి హామీ ఇచ్చారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం
- ●Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు

Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం

Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ

VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి





