Vemula Prashanth Reddy | ఆర్భాటాలకు వందల కోట్లు.. భీమ్‌గల్ అభివృద్ధికి రూ.20 కోట్లు లేవా?
Vemula Prashanth Reddy | ఖజానాలో డబ్బులు లేవనే సాకుతో బడ్జెట్‌లో అధికారికంగా మంజూరైన పనులను నిలిపివేయడం ప్రజాద్రోహమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులకు నిధులు లేవంటున్న ప్రభుత్వం.. ప్రచార ఆర్భాటాలకు మాత్రం వందల కోట్లు ఖర్చు చేస్తోందని విమర్శించారు.
- సర్కారుపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఫైర్
Vemula Prashanth Reddy | ఖజానాలో డబ్బులు లేవనే సాకుతో బడ్జెట్‌లో అధికారికంగా మంజూరైన పనులను నిలిపివేయడం ప్రజాద్రోహమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులకు నిధులు లేవంటున్న ప్రభుత్వం.. ప్రచార ఆర్భాటాలకు మాత్రం వందల కోట్లు ఖర్చు చేస్తోందని విమర్శించారు. ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఒక హెలికాప్టర్ ఉండగా.. నెలకు రూ.5 కోట్లకుపైగా అద్దె చెల్లిస్తూ మరో హెలికాప్టర్‌ను ఏకంగా రూ.111 కోట్లతో అద్దెకు తీసుకోవడం ఏ రకమైన పొదుపు అని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్లపాటు ఒకే హెలికాప్టర్‌తో పాలన సాగించిన విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకోవాలని సూచించారు.
మనుమడి కోసం రూ.10 కోట్లతో ఫుట్‌బాల్ కోర్టులు, మెస్సీ పర్యటనల పేరిట ప్రచార కార్యక్రమాలకు వందల కోట్లు, అందాల పోటీల నిర్వహణకు రూ.100 కోట్లు ఖర్చు చేయడానికి ప్రభుత్వానికి నిధులు ఉంటాయని ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. శంషాబాద్‌కు ఇప్పటికే కనెక్టివిటీ ఉన్నప్పటికీ.. సొంత భూముల ధరలు పెంచుకునేందుకే కొడంగల్ నుంచి శంషాబాద్ వరకు రూ.3,500 కోట్లతో ఆరు వరుసల రహదారి నిర్మాణం చేపట్టేందుకు వేల కోట్లు ఉన్నాయని ఆరోపించారు. భీమ్‌గల్‌లో ప్రజలకు అత్యవసరమైన 100 పడకల ఆసుపత్రి, మార్కెట్ యార్డు, రహదారుల వంటి అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు అవసరమైన రూ.15-20 కోట్లు ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందని అన్నారు. ప్రచార ఆర్భాటాలకు వందల కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వానికి భీమ్‌గల్ అభివృద్ధికి నిధులు లేవా అని ప్రశ్నించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Tamannaah Bhatia | ‘నో కిస్సింగ్ పాలసీ’కి గుడ్‌బై.. తమన్నా ఎందుకిలా?
- ●Vijay | వర్షంతో షూటింగ్ క్యాన్సిల్.. తల్లిదండ్రుల చెంత సేదతీరిన విజయ్ దేవరకొండ
- ●Mudumalai Tiger Reserve | అడవిలో విషాదం: 10 రోజుల్లో 3 ఏనుగుల మృతి.. తీవ్ర కరవే కారణమా?
- ●Jakkani Anitha | పరకాలను నీకెవరన్నా రాసిచ్చిర్రా? మళ్ల మాట్లాడ్తే మూతి పగుల్తది
- ●Job Mela | ఫార్మసిస్ట్, అసిస్టెంట్ పోస్టులకు ఆగస్టు 25న జాబ్‌మేళా
- ●Peddapalli | రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు : మంత్రి కోమటిరెడ్డి

Tamannaah Bhatia | ‘నో కిస్సింగ్ పాలసీ’కి గుడ్‌బై.. తమన్నా ఎందుకిలా?

Vijay | వర్షంతో షూటింగ్ క్యాన్సిల్.. తల్లిదండ్రుల చెంత సేదతీరిన విజయ్ దేవరకొండ

Mudumalai Tiger Reserve | అడవిలో విషాదం: 10 రోజుల్లో 3 ఏనుగుల మృతి.. తీవ్ర కరవే కారణమా?

Jakkani Anitha | పరకాలను నీకెవరన్నా రాసిచ్చిర్రా? మళ్ల మాట్లాడ్తే మూతి పగుల్తది



