NEET UG | నీట్ యూజీ దరఖాస్తులు ప్రారంభం.. మే 3న పరీక్ష
NEET UG | ఎంబీబీఎస్, బీడీఎస్ సహా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష (NEET UG) దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. మార్చి 8వ తేదీ రాత్రి 9 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు (NEET UG registration) చేసుకోవచ్చు.
NEET UG | త్రినేత్ర.న్యూస్: ఎంబీబీఎస్, బీడీఎస్ సహా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష (NEET UG) దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. మార్చి 8వ తేదీ రాత్రి 9 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు (NEET UG registration) చేసుకోవచ్చు. అదే అదే రోజు రాత్రి 11.50 గంటల వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించవచ్చని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తెలిపింది. మార్చి 10 నుంచి 12వ తేదీ వరకు దరఖాస్తుల్లో ఏవైనా తప్పుల ఉంటే సరిచేసుకోవచ్చని వెల్లడించింది. మే 3న నీట్ యూజీ పరీక్షను నిర్వహించనున్నట్లు పేర్కొంది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుంది.
ఇక దరఖాస్తు ఫీజు విషయానికొస్తే.. జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.1,700, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలు రూ.1,600, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, థర్డ్ జెండర్ అభ్యర్థులు రూ.1,000 చెల్లించాలి. ఎన్నారైలు రూ.9,500 చెల్లించాల్సి ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్లు https://nta.ac.in, https://neet.nta.nic.inలో దరఖాస్తు చేసుకోవాలని ఎన్టీఏ వెల్లడించింది. ఏ పట్టణంలో పరీక్ష రాయనున్నారో, అడ్మిట్‌కార్డుల డౌన్‌లోడింగ్, ఫలితాల వెల్లడి వంటి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది.
కాగా, నీట్ దరఖాస్తు విధానంలో ఎన్టీఏ మార్పులు చేసింది. ఇకపై అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించే సమయంలో లైవ్ ఫొటో తీసుకోవడాన్ని తప్పనిసరి చేసింది. ఆన్‌లైన్‌లో అభ్యర్థి కాప్చర్ చేసిన లైవ్‌ఫోటోను ఆధార్‌తో సరిపోల్చుతుంది. ఒకవేళ అది ఆధార్‌తో సరిపోలకపోతే అభ్యర్థి తన గుర్తింపునకు సంబంధించిన ఇతర ధ్రువపత్రాలను అదనంగా అప్‌లోడ్ చేయాల్సివుంటుంది. దీంతోపాటు అభ్యర్థి గుర్తింపు వెరిఫికేషన్ కోసం ఆధార్ ఆధారిత ఈ-కేవైసీని ప్రవేశపెట్టారు. అభ్యర్థులు వారి దరఖాస్తులో పేర్కొన్న ప్రస్తుత, శాశ్వత చిరునామా ఆధారంగా పరీక్ష కేంద్రాన్ని ఆటోమేటిక్‌గా సిస్టమే కేటాయిస్తుంది.
నీట్ పరీక్షను ఆఫ్‌లైన్‌లో పెన్, పేపర్ పద్ధతిలో నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసే విద్యార్థుల సౌలభ్యం కోసం ఎన్టీఏ హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసింది. ఏవైనా సందేహాలు ఉంటే విద్యార్థులు 011–40759000, 011–69227700 లేదా neetus2026@nta. ac.in ఈమెయిల్‌ను సంప్రదించవచ్చు.
మారిన రూల్స్..
ఆధార్ ఈ-కేవైసీ: అభ్యర్థి గుర్తింపు వెరిఫికేషన్ కోసం ఆధార్ ఆధారిత ఈకేవైసీ తప్పనిసరి.
లైవ్‌ఫొటో: ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించే సమయంలో లైవ్ ఫొటో క్యాప్చర్ చేయాలి. అనంతరం సిస్టమ్ మీ లైవ్ ఫొటోని ఆటోమేటిక్‌గా ఆధార్‌తో సరిపోల్చుతుంది.
ఒకవేళ మీ లైవ్ ఫొటో ఆధార్‌తో సరిపోలకపోతే.. అందుకు వీలుగా మీ గుర్తింపును నిర్ధారించేలా తగిన ధ్రువీకరణపత్రాలను అదనంగా అప్‌లోడ్ చేయాలి.
సిటీ సెలక్షన్: అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారంలో అందించిన ప్రస్తుత/శాశ్వత అడ్రస్ ఆధారంగానే పరీక్ష కేంద్రాలను కేటాయిస్తారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






