త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NEET UG | నేడు నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌.. మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ వ‌ర‌కే అనుమ‌తి

NEET UG | నీట్ యూజీ (NEET UG)-2026 రీ ఎగ్జామ్ (NEET UG Re Exam) ఆదివారం జరగనుంది. ప‌రీక్ష‌కు సంబంధించి నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇప్ప‌టికే ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశంలోని 5440 కేంద్రాల‌తోపాటు విదేశాల్లోని 14 నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది.

G

Telangana | Published On Jun 21, 2026, 7.51 am IST

NEET UG | నేడు నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌.. మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ వ‌ర‌కే అనుమ‌తి
Advertisement

NEET UG | త్రినేత్ర‌.న్యూస్‌: నీట్ యూజీ (NEET UG)-2026 రీ ఎగ్జామ్ (NEET UG Re Exam) ఆదివారం జరగనుంది. ప‌రీక్ష‌కు సంబంధించి నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇప్ప‌టికే ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశంలోని 5440 కేంద్రాల‌తోపాటు విదేశాల్లోని 14 నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. మొత్తం 22 లక్షల 79 వేల మందికి పైగా విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. రాష్ట్రంలో సుమారు 73 వేల మంది అభ్య‌ర్థులు ప‌రీక్ష రాయ‌నున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు ప‌రీక్ష జ‌రుగ‌నుంది. దివ్యాంగులకు సాయంత్రం 6.20 గంటల వరకు పరీక్ష రాసే అవకాశం కల్పించింది. ఉద‌యం 11 నుంచి మ‌ధ్యాహ్నం 1.30 గంట వ‌ర‌కే విద్యార్థుల‌ను ప‌రీక్షా కేంద్రంలోకి అనుమ‌తించ‌నుంది.

మే 3న నిర్వ‌హించిన ప‌రీక్ష పేప‌ర్ లీక్‌, అక్ర‌మాల ఆరోప‌ణ‌ల‌తో ర‌ద్ద‌యిన విష‌యం తెలిసిందే. దీంతో దాదాపు 23 ల‌క్ష‌ల మంది విద్యార్థులు మ‌రోసారి ప‌రీక్ష రాయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

రీ ఎగ్జామ్ కోసం ఎన్‌టీఏ ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేసింది. ప‌రీక్ష గ‌దుల్లో 1,38,560 సీసీటీవీ కెమెరాల‌ను అమ‌ర్చింది. ఎల‌క్ట్రానిక్ అక్ర‌మాల‌ను అరిక‌ట్టేందుకు దేశ‌వ్యాప్తంగా 51,311 జామ‌ర్ల‌ను ఏర్పాటు చేసింది. అభ్య‌ర్థుల త‌నిఖీకి 38,795 మంది సిబ్బందిని, బ‌యోమెట్రిక్ వెరిఫికేష‌న్‌కు 48,448 మందిని రంగంలోకి దించారు. ప‌రీక్షా కేంద్రాల్లో సుమారు 6700 మంది అబ్జ‌ర్వ‌ర్లు ఉండ‌గా, 100 మందికిపైగా వ‌ర్చువ‌ల్ అబ్జ‌ర్వ‌ర్లు కేంద్ర కార్యాల‌యం నుంచి నిరంత‌రం లైవ్ సీసీటీవీ ఫుటేజీని ప‌ర్య‌వేక్షిస్తారు. మ‌రోవైపు పునఃప‌రీక్ష‌కు ముందు దేశ వ్యాప్తంగా శ‌నివారం మాక్‌డ్రిల్ నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే.

 

Advertisement
Advertisement