KCR | తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం తన జీవితాన్ని ధారపోసిన కర్మయోగి.. ప్రొఫెసర్ జయశంకర్ సార్: కేసీఆర్
KCR | తెలంగాణ సిద్ధాంతకర్త, రాష్ట్ర ఏర్పాటు కోసం తన జీవితాన్ని ధారపోసిన కర్మయోగి ప్రొఫెసర్ జయశంకర్ సార్ (Professor Jayashankar) వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఘనంగా నివాళులర్పించారు.
KCR | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ సిద్ధాంతకర్త, రాష్ట్ర ఏర్పాటు కోసం తన జీవితాన్ని ధారపోసిన కర్మయోగి ప్రొఫెసర్ జయశంకర్ సార్ (Professor Jayashankar) వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఘనంగా నివాళులర్పించారు. బాల్యం నుంచే తెలంగాణ అస్తిత్వం కోసం, సామాజిక రాజకీయ చైతన్యంతో ఆలోచన చేస్తూ, అందుకు తగ్గ భావజాల వ్యాప్తిని కొనసాగించిన నిస్వార్థ మేధావి, తెలంగాణ స్వాప్నికుడు ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు.
రాష్ట్ర సాధన కోసం మలిదశ ఉద్యమాన్ని తాను ముందుకు తీసుకుపోయే క్రమంలో తన ఆలోచనలకు దిక్సూచిగా నిలిచిన జయశంకర్ సార్, రాష్ట్ర సాధన పోరాటంలో తనకు సైద్ధాంతిక మార్గదర్శిగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, రాజ్యాంగ బద్ధంగా, పార్లమెంటరీ ప్రజాస్వామ్య పంథా ద్వారా మాత్రమే సాధ్యమనే విశ్వాసంతో నిర్దిష్ట పరిస్థితులకు అనుసరించి సాగిన తన నిర్దిష్ట కార్యాచరణకు, భేషరతు మద్దతునిచ్చిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్ఫూర్తి, ఎంతో ఉన్నతమైనదని, క్రియాశీలమైనదని తెలిపారు.
నాటి పదేండ్ల బీఆర్ఎస్ పాలన, సబ్బండ కులాల సంక్షేమం అభివృద్ధి కోసం కృషిచేసి, వారి జీవితాల్లో వెలుగులు నింపి, ప్రొఫెసర్ జయశంకర్ ఆకాంక్షలకు ఆశయాలకు అనుగుణంగా సాగిందన్నారు. తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష అని పదేపదే నినదించిన సార్ ఆశయాలకు అనుగుణంగా, ఎంతటి త్యాగాలకైనా ఓర్చి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు బిఆర్ఎస్ పార్టీ కంకణబద్ధమై ఉన్నదని పునరుద్ఘాటించారు. గడచిన రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో జయశంకర్ ఆశయాలు గాడి తప్పుతున్నాయని, ప్రమాదంలో పడిన తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టుకునేందుకు స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఉద్యమ స్ఫూర్తిని పుణికి పుచ్చుకొని, ఆస్తిత్వ పరిరక్షణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన తరుణం ఆసన్నమైందని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ గరిమను, సామాజిక రాజకీయ అస్తిత్వాన్ని నిరంతరం కాపాడుకోవడమే, ప్రొఫెసర్ జయశంకర్ సార్‌కి మనం ఇచ్చే ఘన నివాళి అని కేసీఆర్ పునరుద్ఘాటించారు.
తాజావార్తలు
- ●Bus Accident | ఎలక్ట్రిక్ బస్సులో మంటలు.. ఆర్టీసీ బస్సు ఢీకొని యువతి మృతి
- ●Germany Vs Ivory coast | డెనిజ్ డబుల్.. నాకౌట్‌కు జర్మనీ
- ●Gottimukkala Padmarao | ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ ఉద్యమకారుడు గొట్టిముక్కల పద్మారావు కన్నుమూత
- ●PM Modi | ప్రపంచంలోనే అతిపెద్ద వేడుకగా యోగా దినోత్సవం: ప్రధాని మోదీ
- ●NEET UG | నేడు నీట్ యూజీ రీ-ఎగ్జామ్.. మధ్యాహ్నం 1.30 గంట వరకే అనుమతి
- ●International Yoga Day | నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం.. ఈ ఆసనాలతో మీ చేతుల్లోనే ఆరోగ్యం!

Bus Accident | ఎలక్ట్రిక్ బస్సులో మంటలు.. ఆర్టీసీ బస్సు ఢీకొని యువతి మృతి

Germany Vs Ivory coast | డెనిజ్ డబుల్.. నాకౌట్‌కు జర్మనీ

Gottimukkala Padmarao | ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ ఉద్యమకారుడు గొట్టిముక్కల పద్మారావు కన్నుమూత

PM Modi | ప్రపంచంలోనే అతిపెద్ద వేడుకగా యోగా దినోత్సవం: ప్రధాని మోదీ




