Ecuador vs Curaçao | ఎలోయ్ రూమ్ వీరోచిత పోరాటం.. ఫిఫాలో ఖాతా తెరిచిన కురకావో
Ecuador vs Curaçao | గోల్‌కీపర్ ఎలోయ్ రూమ్ అసాధారణ ప్రదర్శనతో కురకావో జట్టు ఫిఫా వరల్డ్‌కప్ 2026లో తొలి పాయింట్‌ను ఖాతాలో వేసుకుంది. గ్రూప్–ఈలో భాగంగా ఈక్వెడార్‌తో జరిగిన మ్యాచ్‌లో కురకావో 0-0తో డ్రా చేసుకుంది. టోర్నీలో అతి చిన్న దేశంగా బరిలోకి దిగిన కురకావో.. ఈ ఫలితంతో నాకౌట్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. జర్మనీ చేతిలో ఐవరీ కోస్ట్ ఓడిపోవడంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకూ కీలకంగా మారింది.
- తొలి పాయింట్ సాధించిన జట్టు
- ఈక్వెడార్‌ను అడ్డుకున్న కురకావో
- 0-0 తేడాతో డ్రాగా ముగిసిన మ్యాచ్
- ఒక్కో పాయింట్‌తో రెండు జట్లు
- నాకౌట్ ఆశలు సజీవం
Ecuador vs Curaçao | గోల్‌కీపర్ ఎలోయ్ రూమ్ అసాధారణ ప్రదర్శనతో కురకావో జట్టు ఫిఫా వరల్డ్‌కప్ 2026లో తొలి పాయింట్‌ను ఖాతాలో వేసుకుంది. గ్రూప్–ఈలో భాగంగా ఈక్వెడార్‌తో జరిగిన మ్యాచ్‌లో కురకావో 0-0తో డ్రా చేసుకుంది. టోర్నీలో అతి చిన్న దేశంగా బరిలోకి దిగిన కురకావో.. ఈ ఫలితంతో నాకౌట్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. జర్మనీ చేతిలో ఐవరీ కోస్ట్ ఓడిపోవడంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకూ కీలకంగా మారింది. ఈక్వెడార్ 75 శాతం బంతి ఆధిపత్యం ప్రదర్శించింది. 15 షాట్స్ గోల్‌పోస్ట్‌పై సంబంధించగా.. రూమ్ విజయవంతంగా అడ్డుకున్నాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే కురకావో ఆటగాళ్లు మైదానంలోకి పరుగెత్తి రూమ్‌ను అభినందిస్తూ సంబరాలు జరుపుకున్నారు. వరల్డ్‌కప్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో అత్యధిక సేవ్‌లు చేసిన గోల్‌కీపర్‌ల రికార్డును రూమ్ సమం చేశాడు.
గోడలా నిలిచిన రూమ్
కురకావో ఫుట్‌బాల్ చరిత్రలో ఎలోయ్ రూమ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. నెదర్లాండ్స్ నుంచి కురకావో తరఫున ఆడేందుకు ముందుకొచ్చిన తొలి ఆటగాళ్లలో అతడు ఒకరు. ఈ మ్యాచ్‌లో అతడు చూపిన ప్రతిభ కురకావో ఫుట్‌బాల్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది. మ్యాచ్ ఆరంభంలోనే ఈక్వెడార్‌కు గోల్డెన్ ఛాన్స్ లభించింది. కైసెడో ఇచ్చిన పొడవాటి పాస్‌ను అందుకున్న స్టార్ స్ట్రైకర్ ఎన్నెర్ వాలెన్సియా గోల్‌వైపు దూసుకెళ్లాడు. గోల్ ఖాయమని అనిపించిన వేళ రూమ్ అద్భుత రీతిలో అడ్డుకొని జట్టును కాపాడాడు. 37 ఏళ్ల రూమ్ గోల్‌పోస్ట్ ముందు అజేయ గోడలా నిలిచాడు. అమెరికాలో రెండో డివిజన్ లీగ్‌లో ఆడుతున్న ఈ సీనియర్ ప్రపంచకప్ వేదికపై తన స్తతా చాటాడు. వాలెన్సియా, ప్లాటా తదితర ఈక్వెడార్ ఆటగాళ్ల ప్రయత్నాలను తిప్పికొట్టాడు.

డిఫెన్స్‌లోనే కాదు..
డిఫెన్స్‌లోనే కాదు అటాకింగ్‌లోనూ కురకావో పలు సందర్భాల్లో మెరుపులు మెరిపించింది. తహిత్ చోంగ్, ఫ్లోరియానస్ నేతృత్వంలో కొన్ని అవకాశాలు తుది దశలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయింది. అయినప్పటికీ ఈక్వెడార్ డిఫెన్స్ అప్రమత్తత పాటించింది. రెండో అర్ధభాగంలోనూ కురకావో అదే పట్టుదలను కొనసాగించింది. 59వ నిమిషంలో రూమ్ సేవ్‌తో ప్రారంభమైన కౌంటర్ అటాక్‌లో వరుసగా మూడు ప్రమాదకర అవకాశాలు వచ్చాయి. లియాండ్రో బకునా, కొమనెన్సియా, లోకాడియా చేసిన ప్రయత్నాలను ఈక్వెడార్ గోల్‌కీపర్ గలిండెజ్ అద్భుతంగా అడ్డుకున్నాడు. మరోవైపు వాలెన్సియా–రూమ్ మధ్య పోటీ మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 65వ నిమిషంలో వాలెన్సియా చేసిన మరో ప్రయత్నాన్ని రూమ్ అడ్డుకోవడంతో సేవ్స్ సంఖ్య పది దాటింది. అనంతరం కూడా ఈక్వెడార్ వరుస దాడి చేసినా ఫలితం లేకపోయింది. 84వ నిమిషంలో వాలెన్సియాకు మ్యాచ్ విజేతగా నిలిచే అవకాశం వచ్చినా షాట్ గురి తప్పింది. చివరి క్షణాల్లో పెనాల్టీ కోసం ఈక్వెడార్ ఆటగాళ్లు అప్పీల్ చేసినా, వీఏఆర్ తిరస్కరించారు.
గ్రూప్–ఈ ఉత్కంఠ
ఈ ఫలితంతో గ్రూప్–ఈలో నాకౌట్ దశకు అర్హత పోరు మరింత ఆసక్తికరంగా మారింది. జర్మనీ ఇప్పటికే నాకౌట్‌కు అర్హత సాధించింది. మిగిలిన ఒక స్థానం కోసం ఈక్వెడార్, ఐవరీ కోస్ట్, కురకావో జట్లు పోటీపడుతున్నాయి. కురకావో నాకౌట్‌కు చేరాలంటే చివరి మ్యాచ్‌లో ఐవరీ కోస్ట్‌పై తప్పనిసరిగా గెలవాలి. అదే సమయంలో జర్మనీ, ఈక్వెడార్‌ను ఓడించాలి. అయితే, తొలి మ్యాచ్‌లో జర్మనీ చేతిలో 7-1 తేడాతో ఓడిపోవడం వల్ల కురకావో గోల్ తేడా ప్రతికూలంగా మారింది. ఈక్వెడార్ పరిస్థితి కూడా క్లిష్టంగానే ఉంది. చివరి మ్యాచ్‌లో జర్మనీపై విజయం సాధించడంతో పాటు కురకావో ఐవరీ కోస్ట్‌ను ఓడించాలని కోరుకోవాల్సిందే. గ్రూప్‌లోని చివరి రెండు మ్యాచులు ఈ నెల 26న జరగనున్నాయి.

ట్యాగ్స్:
తాజావార్తలు
- ●PM Modi | యోగా ట్రైనర్‌గా మారిన ప్రధాని మోదీ.. వీడియో
- ●FIFA 2026 | ఇరాన్ ఫుట్‌బాల్ టీమ్ ట్రావెల్‌పై ఆంక్షలు.. నిరసనలున్నా వెనక్కి తగ్గని అమెరికా
- ●Traffic Restrictions | రాత్రి 8 వరకు.. కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రయల్ వన్‌వే ట్రాఫిక్
- ●KTR | జయశంకర్ సార్ భౌతికంగా లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిదని: కేటీఆర్
- ●Bus Accident | ఎలక్ట్రిక్ బస్సులో మంటలు.. ఆర్టీసీ బస్సు ఢీకొని యువతి మృతి
- ●Germany Vs Ivory coast | డెనిజ్ డబుల్.. నాకౌట్‌కు జర్మనీ

PM Modi | యోగా ట్రైనర్‌గా మారిన ప్రధాని మోదీ.. వీడియో

FIFA 2026 | ఇరాన్ ఫుట్‌బాల్ టీమ్ ట్రావెల్‌పై ఆంక్షలు.. నిరసనలున్నా వెనక్కి తగ్గని అమెరికా

Traffic Restrictions | రాత్రి 8 వరకు.. కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రయల్ వన్‌వే ట్రాఫిక్

KTR | జయశంకర్ సార్ భౌతికంగా లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిదని: కేటీఆర్





