ZEE 5 | ఏడు భాషల్లో అతిపెద్ద కంటెంట్ లైనప్‌తో జీ5 సంచలనం.. తెలుగులో క్రేజీ ప్రాజెక్టులు..!
ZEE 5 | స్వదేశీ ఓటీటీ వేదిక జీ5 మరోసారి భారీ కంటెంట్ ప్రకటనతో భారతీయ సినీ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, లైవ్ స్పోర్ట్స్, ఏఐ ఆధారిత స్టోరీలు, యానిమేషన్, చిన్నారుల వినోదంతో కూడిన అతిపెద్ద మల్టీలాంగ్వేజ్ కంటెంట్ లైనప్‌ను ప్రకటించింది.
Entertainment | Published On Jul 29, 2026, 3.50 pm IST
ZEE 5 | స్వదేశీ ఓటీటీ వేదిక జీ5 మరోసారి భారీ కంటెంట్ ప్రకటనతో భారతీయ సినీ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, లైవ్ స్పోర్ట్స్, ఏఐ ఆధారిత స్టోరీలు, యానిమేషన్, చిన్నారుల వినోదంతో కూడిన అతిపెద్ద మల్టీలాంగ్వేజ్ కంటెంట్ లైనప్‌ను ప్రకటించింది. ప్రాంతీయ కథలకు పెద్దపీట వేస్తూనే కొత్త తరహా ఫార్మాట్లతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ లైనప్‌ను రూపొందించింది. 'లాంగ్వేజ్ ఫస్ట్' వ్యూహంతో ప్రతి భాష సంస్కృతి, భావోద్వేగాలకు దగ్గరగా ఉండే కథలను అందించడంపై జీ5 దృష్టి సారించింది. ఇందుకోసం అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర, జియో స్టూడియోస్, మడాక్ ఫిల్మ్స్, పెన్ స్టూడియోస్ తదితర ప్రముఖ నిర్మాణ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
తెలుగులోనూ భారీ లైనప్..
తెలుగు ప్రేక్షకుల కోసం నివేదా థామస్ నటించిన 'శ్రీమతి', శ్రీకాంత్ ప్రధాన పాత్రలో 'అబ్జెక్షన్ మై లార్డ్' ఒరిజినల్స్‌ను తీసుకొస్తోంది. ప్రేక్షకాదరణ పొందిన 'జయమ్ము నిశ్చయమ్మురా' టాక్ షో కొత్త సీజన్ కూడా రానుంది. సినిమాల విభాగంలో ఎన్‌బీకే111, వెంకీ అనీల్ రావిపూడి5, వృషకర్మ వంటి క్రేజీ ప్రాజెక్టులు జీ5లో స్ట్రీమింగ్ కానున్నాయి. హిందీలో 'కాంబ్లీ', 'ది స్కామ్ లీక్డ్', 'కాఫీ కింగ్', 'జీనా ఇసీకా నామ్ హై 2.0' వంటి కొత్త సిరీస్‌లతో పాటు 'రంగ్‌బాజ్-4', 'బకైతి-2', 'జవావర్-2' వంటి ఫ్రాంచైజీలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అలాగే వరుణ్ ధావన్, పూజా హెగ్డే నటిస్తున్న 'హై జవానీ తో ఇష్క్ హోనా హై', కంగనా రనౌత్ నటిస్తున్న 'భారత్ భాగ్య విధాత', బాబీ డియోల్ నటిస్తున్న 'బండార్' తదితర చిత్రాలు థియేట్రికల్ రిలీజ్ అనంతరం జీ5లో స్ట్రీమింగ్ కానున్నాయి.
పిల్లల కంటెంట్‌కూ పెద్దపీట..
తమిళంలో 'అనంతకాలం', 'తీ కురల్', 'డీమాంటీ కాలనీ-3', నయనతార నటిస్తున్న 'హై', 'రావాడి' వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. కన్నడలో 'అయ్యనా మానే' కొత్త సీజన్‌తో పాటు 'బిట్‌కాయిన్ స్కామ్', 'ఆపరేషన్ బంగార', 'కరవాలి' రానున్నాయి. మలయాళంలో 'ఏ క్వీన్', 'మలబార్ కప్', 'కేరళ అండర్‌గ్రౌండ్', మరాఠీలో 'హే కే నవీన్', 'అగ అయి, అహో ఆయి', బెంగాలీలో 'శ్వేత్‌కాళి', 'లాల్‌బజార్' కొత్త సీజన్లు ప్రేక్షకులను అలరించనున్నాయి. సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో పాటు లైవ్ స్పోర్ట్స్‌పైనా జీ5 దృష్టి పెట్టింది. ఫిఫా, బుండెస్లిగా, ఐఎల్‌టీ20, తమిళనాడు కబడ్డీ వంటి టోర్నీలను ప్రసారం చేయనుంది. ఏఐ ఆధారిత కథనాలు, యానిమేషన్ ప్రాజెక్టులు, పురాణ కథలతో రూపొందిన సిరీస్‌లు, చిన్నారుల కోసం ప్రత్యేక షోలు కూడా ఈ లైనప్‌లో చోటు దక్కించుకున్నాయి.
జీ5 ఏమంటోంది?
జీ5 ఇండియా బిజినెస్ హెడ్ తేజ్‌కరణ్ సింగ్ బజాజ్ మాట్లాడుతూ.. ట్రెండ్‌ను అనుసరించడం కాదని, కొత్త ట్రెండ్‌ను సృష్టించడమే తమ లక్ష్యమన్నారు. భారతీయ ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా ఏడు భాషల్లో అత్యుత్తమ కథలను అందించడంతో పాటు సాంకేతికంగా మరింత ఆధునికమైన వినోద వేదికగా జీ5ను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. జీ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ రాఘవేంద్ర హున్సూర్ మాట్లాడుతూ.. ప్రేక్షకులతో బలమైన అనుబంధాన్ని ఏర్పరచే కథలనే ఈ లైనప్‌లో ఎంపిక చేశామని, భాషలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్‌ను అందించడమే తమ లక్ష్యమని చెప్పారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

LIC Dividend | మోదీ ప్రభుత్వానికి ఎల్ఐసీ బోనాంజా.. రూ.12,207 కోట్ల డివిడెండ్
జులై 29, 2026

Kavya Thapar | కావ్య థాపర్‌కు మరో ఛాన్స్.. ‘నేను రెడీ’తోనైనా అదృష్టం కలిసొచ్చేనా?
జులై 29, 2026

Manushi Chhillar | కామన్వెల్త్ గేమ్స్ వేదికపై మానుషి సందడి.. స్పెషల్ ప్రదర్శన ఇవ్వనున్న మాజీ మిస్‌వరల్డ్..!
జులై 29, 2026
తాజావార్తలు
- ●MLA Sudheer Reddy | రియల్ ఎస్టేట్ కుదేలుకు హైడ్రానే కారణం
- ●Instagram Scam | ఇన్స్టాగ్రామ్ ఐపీవో పేరుతో భారీ మోసం.. రూ.12 లక్షలు కోల్పోయిన వ్యక్తి..
- ●Srinivas Goud | ఓబీసీలకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిందే : శ్రీనివాస్ గౌడ్
- ●Anti Paper Leak Bill | పరీక్షల్లో అక్రమాలకు ఇక చెక్.. పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
- ●Kavya Thapar | కావ్య థాపర్‌కు మరో ఛాన్స్.. ‘నేను రెడీ’తోనైనా అదృష్టం కలిసొచ్చేనా?
- ●Guru Purnima | షిర్డీలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు.. రూ.1.03కోట్ల బంగారు కిరీటాన్ని బహూకరించిన ఏపీ భక్తుడు

MLA Sudheer Reddy | రియల్ ఎస్టేట్ కుదేలుకు హైడ్రానే కారణం

Instagram Scam | ఇన్స్టాగ్రామ్ ఐపీవో పేరుతో భారీ మోసం.. రూ.12 లక్షలు కోల్పోయిన వ్యక్తి..

Srinivas Goud | ఓబీసీలకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిందే : శ్రీనివాస్ గౌడ్

Anti Paper Leak Bill | పరీక్షల్లో అక్రమాలకు ఇక చెక్.. పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం



