Srinivas Goud | ఓబీసీలకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిందే : శ్రీనివాస్ గౌడ్
Srinivas Goud | కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక బీసీ మంత్రిత్వశాఖను కేటాయించాలి.. అదేవిధంగా ఓబీసీలకు ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. క్రిమిలేయర్‌ను కూడా ఎత్తేయాలన్నారు.
Srinivas Goud | త్రినేత్ర.న్యూస్ : కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక బీసీ మంత్రిత్వశాఖను కేటాయించాలి.. అదేవిధంగా ఓబీసీలకు ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. క్రిమిలేయర్‌ను కూడా ఎత్తేయాలన్నారు. కాచిగూడలోని అభినందన్ గ్రాండ్ హోటల్‌లో బెంగళూరులో ఆగస్టు 7న నిర్వహించనున్న అఖిల భారత జాతీయ ఓబీసీ 11వ మహాసభ పోస్టర్‌ను మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, శ్రీనివాస్ గౌడ్, చిన్న శ్రీశైలం యాద్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే వీరవల్లి అనిల్ కుమార్ కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీలకు విద్యా, ఉద్యోగాలు, చట్ట సభలలో, కాంట్రాక్ట్‌లలో జనాభా ప్రాతిపదికన చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. జనగణనలో కులగణన చేయాలన్నారు. సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, ఉన్న రిజర్వేషన్లను 17 శాతానికి తగ్గించిందని గుర్తు చేశారు.
రాష్ట్రంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించి, నూతన విద్యార్థులకు పాత పద్ధతిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం కుల వృత్తులను ఇచ్చిన హామీలను అమలు చేయాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బిసి సంఘం నాయకులు గుజ్జ కృష్ణ, గణేష్ చారీ, శేఖర్ సాగర్, విక్రమ్ గౌడ్, శ్యామ్ కురుమ, తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●Google | ఆటోమేటిక్ ఏఐ ఏజెంట్‌ను లాంచ్ చేసిన గూగుల్.. యూజర్ల పనులన్నీ వేగంగా పూర్తి చేస్తుంది..
- ●AK47 | 'ఆదర్శ కుటుంబం'లో వెంకటేశ్ కూతురిగా యువినా పార్థవి.. నవ్వులు పంచుతున్న గ్లింప్స్..!
- ●Vande Mataram Bill | వందేమాతరం బిల్లుకు రాజ్యసభ ఆమోదం.. విపక్ష సభ్యుల వాకౌట్
- ●Cyberabad | వాటర్ లాగింగ్‌ను నివారించండి.. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూడండి
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. సెన్సెక్స్ 888, నిఫ్టీ 264 పాయింట్లు పైకి..
- ●NEET Student | మరో నీట్ విద్యార్థిని ఆత్మహత్య

Google | ఆటోమేటిక్ ఏఐ ఏజెంట్‌ను లాంచ్ చేసిన గూగుల్.. యూజర్ల పనులన్నీ వేగంగా పూర్తి చేస్తుంది..

AK47 | 'ఆదర్శ కుటుంబం'లో వెంకటేశ్ కూతురిగా యువినా పార్థవి.. నవ్వులు పంచుతున్న గ్లింప్స్..!

Vande Mataram Bill | వందేమాతరం బిల్లుకు రాజ్యసభ ఆమోదం.. విపక్ష సభ్యుల వాకౌట్

Cyberabad | వాటర్ లాగింగ్‌ను నివారించండి.. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూడండి






