CM Revanth Reddy | మెట్రో ఫేజ్-II విస్తరణకు అనుమతులు మంజూరు చేయండి.. కేంద్రానికి సీఎం రేవంత్ లేఖ
CM Revanth Reddy | హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-II విస్తరణకు అనుమతులు మంజూరు చేయడంతో పాటు, మెట్రో ఫేజ్-Iను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, కిషన్ రెడ్డికి లేఖలు రాశారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-II విస్తరణకు అనుమతులు మంజూరు చేయడంతో పాటు, మెట్రో ఫేజ్-Iను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, కిషన్ రెడ్డికి లేఖలు రాశారు. ఈ మేరకు విడివిడిగా లేఖలు పంపారు.
లేఖల్లోని సారాంశం ఇదే..
ఇటీవల 2026 జూన్ 23, 24 తేదీలలో కేంద్ర మంత్రులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశాల్లో తీసుకున్న కీలక నిర్ణయాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఆ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం మెట్రో ఫేజ్-I ఆస్తుల విలువను నిర్ధారించడం, అధిక వడ్డీ రుణాల పునర్వ్యవస్థీకరణ బాధ్యతలతో పాటు, ఫేజ్-II విస్తరణకు అవసరమైన దీర్ఘకాలిక ఆర్థిక వనరుల సమీకరణపై సమగ్ర అధ్యయనం నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ అయిన ఎస్‌బీఐ క్యాప్స్ ను నియమించాలని ఉమ్మడిగా అంగీకరించిన విషయాన్ని ప్రస్తావించారు.
అయితే, ఈ విషయంలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (ToR)ను ఖరారు చేయకపోవడం, ఎస్‌బీఐ క్యాప్స్‌కు అధికారికంగా బాధ్యతలు అప్పగించడంలో జాప్యం జరగడంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ జాప్యం వల్ల హైదరాబాద్ మెట్రో ఫేజ్-I నిర్వహణలో రోజువారీ ఇబ్బందులు, అనిశ్చితి ఎదురవుతున్నాయని, అలాగే ఫేజ్-II డీపీఆర్‌ల ఆమోదం, నిధుల సమీకరణ ప్రక్రియలు ఆలస్యమవుతున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఫలితంగా ప్రాజెక్టు అమలు మరింత వాయిదా పడటంతో పాటు వ్యయం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.
హైదరాబాద్ భవిష్యత్ ప్రజా రవాణా అవసరాలకు అత్యంత కీలకమైన మెట్రో ఫేజ్-II విస్తరణ పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం కాకూడదని పేర్కొన్న ముఖ్యమంత్రి, ఈ విషయంలో ఇద్దరు కేంద్ర మంత్రులు వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని ఎస్‌బీఐ క్యాప్స్ నియామక ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని కోరారు. తద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తీసుకున్న నిర్ణయాలు వేగంగా అమలై, మెట్రో ఫేజ్-I స్వాధీనం ప్రక్రియ పూర్తికావడంతో పాటు ఫేజ్-II మెట్రో విస్తరణ పనులు ఎలాంటి జాప్యం లేకుండా ముందుకు సాగేందుకు వీలు కలుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
- ●Pragya Jaiswal | ప్రగ్యా జైస్వాల్‌ను ఆటాడుకుంటున్న అక్కినేని ఫ్యాన్స్ - బర్త్‌డే పోస్ట్ వివాదం
- ●CM Revanth Reddy Letter to ECI | 73.39 లక్షల మంది ఓటర్లను తప్పుల జాబితాలో పెట్టడం ఏంటి? సీఈసీకి రేవంత్ లేఖ
- ●Pakistan drone | సరిహద్దు వద్ద పాక్ డ్రోన్ కలకలం.. సైన్యం అలర్ట్
- ●Kadiyam Srihari | మాజీ విద్యాశాఖ మంత్రిగా కోరుతున్నా.. జీవో 97ను రద్దు చేయండి
- ●GST Council | సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ 57వ సమావేశం
- ●NCLT Subhash Chandra | అప్పు రూ.22 వేల కోట్లు.. చెల్లించేది రూ.6 కోట్లే: NCLT పై రాహుల్ ఫైర్, అసలు జీ గ్రూప్ వివాదం ఏంటి?

Pragya Jaiswal | ప్రగ్యా జైస్వాల్‌ను ఆటాడుకుంటున్న అక్కినేని ఫ్యాన్స్ - బర్త్‌డే పోస్ట్ వివాదం

CM Revanth Reddy Letter to ECI | 73.39 లక్షల మంది ఓటర్లను తప్పుల జాబితాలో పెట్టడం ఏంటి? సీఈసీకి రేవంత్ లేఖ

Pakistan drone | సరిహద్దు వద్ద పాక్ డ్రోన్ కలకలం.. సైన్యం అలర్ట్

Kadiyam Srihari | మాజీ విద్యాశాఖ మంత్రిగా కోరుతున్నా.. జీవో 97ను రద్దు చేయండి






