Tollywood | శేఖర్ మాస్టర్ వర్సెస్ జానీ మాస్టర్ – డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్‌లో గొడవలు
టాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్‌లో విభేదాలు రచ్చకెక్కాయి. బై ఎలక్షన్స్ విషయంలో జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ టీమ్ మెంబర్స్ ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకున్నట్లు సమాచారం. జానీ మాస్టర్ భార్య, ప్రస్తుత అధ్యక్షురాలు సుమలత ఏకపక్ష నిర్ణయాలతో అసంతృప్తిలో ఉన్న పది మంది సభ్యులు రాజీనామా చేసినట్లు సమాచారం.
Entertainment | Published On Jul 12, 2026, 4.25 pm IST
Tollywood |టాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్‌లో మరోసారి వివాదం రాజుకుంది. అసోసియేషన్ బై ఎలక్షన్స్ విషయంలో శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ గ్రూప్‌లు ఒకరిపై మరొకరు పరస్పర విమర్శలు, ఆరోపణలు చేసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో అసోసియేషన్ కార్యాలయం వద్ద ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. గొడవలు జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను శాంతింపజేసినట్లు సమాచారం.
అసంతృప్తి...
డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్‌లో అంతర్గత నిర్ణయాలకు సంబంధించి ఓ వర్గం ఆధిపత్య ధోరణి తీరుపై ప్రత్యర్థి వర్గం వారు చాలా కాలంగా అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. నిధుల కేటాయింపు, సభ్యుల సంక్షేమం విషయంలో అభిప్రాయభేదాలు నెలకొన్నట్లు తెలిసింది. అసోసియేషన్ వ్యవహారాల విషయంలో జానీ మాస్టర్ భార్య, ప్రస్తుతం అధ్యక్షురాలు సుమలత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ పది మంది సభ్యులు రాజీనామా చేశారు. ఫెడరేషన్ అనుమతి లేకుండా సుమలత బై ఎలక్షన్స్ నిర్వహించడానికి సిద్ధం కావడంతో వివాదం తీవ్రమైంది. ఆదివారం హైదరాబాద్‌లో అసోసియేషన్ కార్యాలయం వద్ద జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ టీమ్ మెంబర్స్ ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. రెండు వర్గాల వాదోపవాదనలు గొడవల వరకు చేరుకోవడంతో పోలీసులు ఇరు వర్గాల వారికి సర్ధిచెప్పినట్లు సమాచారం.
ఎన్నికల్లో...
గత ఏడాది జరిగిన డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్ ఎన్నికల్లో జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ అయేషా ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో సుమతలకు ప్రత్యర్థిగా జోసెఫ్ ప్రకాష్ బరిలో నిలిచారు. అతడికి శేఖర్ మాస్టర్, రఘు మాస్టర్‌తో పాటు మరికొందరు సపోర్ట్ చేశారు. ఈ ఎన్నికల నుంచే శేఖర్, జానీ మాస్టర్ మధ్య విభేదాలు మొదలైనట్లు సమాచారం.
తాజావార్తలు
- ●Parliament All Party Meeting | పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పీఎం, సీఎంల పదవులు ఊడే కొత్త బిల్లు
- ●DMK vs TVK | కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది.. సీఎం విజయ్‌తో రాజీ లేదు: భగ్గుమన్న డీఎంకే
- ●MLA Jagadish Reddy | భద్రాచలం మునిగిపోతుందా..? చర్చకు సిద్ధమా ఉత్తమ్ కుమార్ రెడ్డి..? : ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
- ●Sai Pallavi | 25 కోట్ల బడ్జెట్ - ఐదు కోట్ల కలెక్షన్స్ - ఓటీటీలోకి సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ మూవీ
- ●Argentina vs Switzerland | ఎక్స్ట్రా టైమ్‌లో విశ్వరూపం: స్విట్జర్లాండ్‌ను చిత్తు చేసి సెమీస్‌కు దూసుకెళ్లిన అర్జెంటీనా!
- ●Trekking in Ananthagiri | అనంతగిరి ట్రెక్కింగ్‌లో విషాదం.. హైదరాబాద్‌కు చెందిన టీచర్ మృతి

Parliament All Party Meeting | పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పీఎం, సీఎంల పదవులు ఊడే కొత్త బిల్లు

DMK vs TVK | కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది.. సీఎం విజయ్‌తో రాజీ లేదు: భగ్గుమన్న డీఎంకే

MLA Jagadish Reddy | భద్రాచలం మునిగిపోతుందా..? చర్చకు సిద్ధమా ఉత్తమ్ కుమార్ రెడ్డి..? : ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి

Sai Pallavi | 25 కోట్ల బడ్జెట్ - ఐదు కోట్ల కలెక్షన్స్ - ఓటీటీలోకి సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ మూవీ



