త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | హ‌రీశ్‌రావు ప‌రువు న‌ష్టం కేసు.. మ‌హేశ్ కుమార్ గౌడ్, అద్దంకి ద‌యాక‌ర్‌కు కోర్టు స‌మ‌న్లు

Harish Rao | బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు( Harish Rao ) పరువు నష్టం దావా కేసులో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్( Mahesh Kumar Goud ), ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌( MLC Addanki Dayakar )కు నాంప‌ల్లి ప్ర‌జాప్ర‌తినిధుల కోర్టు( Nampally Court ) స‌మ‌న్లు జారీ చేసింది.

S

Telangana | Published On Oct 9, 2026, 3.06 pm IST

Harish Rao | హ‌రీశ్‌రావు ప‌రువు న‌ష్టం కేసు.. మ‌హేశ్ కుమార్ గౌడ్, అద్దంకి ద‌యాక‌ర్‌కు కోర్టు స‌మ‌న్లు
Advertisement

Harish Rao | త్రినేత్ర న్యూస్ : బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు( Harish Rao ) పరువు నష్టం దావా కేసులో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్( Mahesh Kumar Goud ), ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌( MLC Addanki Dayakar )కు నాంప‌ల్లి ప్ర‌జాప్ర‌తినిధుల కోర్టు( Nampally Court ) స‌మ‌న్లు జారీ చేసింది.అక్టోబర్ 29న విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. తనపై నిరాధారమైన, తప్పుడు ఆరోపణలు చేశారంటూ గతంలో ప్రజాప్రతినిధుల కోర్టులో హ‌రీశ్‌రావు పరువు నష్టం దావా వేసిన సంగ‌తి తెలిసిందే. హరీశ్ రావు పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన నాంప‌ల్లి కోర్టు కాంగ్రెస్ నేతలకు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 29న న్యాయస్థానం ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌లకు ఆదేశాలు జారీ చేసింది.

Advertisement
Advertisement