త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Singareni | నైనీ బొగ్గు గ‌ని టెండ‌ర్ల ర‌ద్దు

Singareni | గ‌త నాలుగు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన నైనీ బొగ్గు గ‌ని (Naini Coal Mine) టెండ‌ర్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు సింగ‌రేణి కాల‌రీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ప్ర‌క‌టించింది. ఆ టెండ‌ర్లు ద‌క్కించుకునేందుకు విధించిన ఫీల్డ్ విజిట్ (Field Visit) నిబంధ‌న‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు వెల్లువెత్తడంతో వాటిని ర‌ద్దు చేశారు.

A

Telangana | Published On Jan 22, 2026, 3.46 pm IST

Singareni | నైనీ బొగ్గు గ‌ని టెండ‌ర్ల ర‌ద్దు
Advertisement

Singareni | త్రినేత్ర‌.న్యూస్‌ : గ‌త నాలుగు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన నైనీ బొగ్గు గ‌ని (Naini Coal Mine) టెండ‌ర్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు సింగ‌రేణి కాల‌రీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ప్ర‌క‌టించింది. ఒడిశాలోని బొగ్గు గ‌నుల తవ్వ‌కానికి సంబంధించి, సింగ‌రేణి గ‌తంలో టెండ‌ర్ల‌ను పిలిచింది. ఆ టెండ‌ర్లు ద‌క్కించుకునేందుకు విధించిన ఫీల్డ్ విజిట్ (Field Visit) నిబంధ‌న‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు వెల్లువెత్తడంతో వాటిని ర‌ద్దు చేశారు. వాస్త‌వానికి ఈ రోజు సాయంత్రం అయిదు గంట‌ల నుంచి ఆన్‌లైన్ బిడ్ల ప్ర‌క్రియ ప్రారంభం కావాల్సిన‌ప్ప‌టికీ, దానిని ర‌ద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పాల‌నాప‌ర‌మైన కార‌ణాల వ‌ల్ల‌నే వీటిని ర‌ద్దు చేస్తున్న‌ట్లు వివ‌రించారు.

దుమారంగా మారిన టెండ‌ర్ల ప్ర‌క్రియ‌..

నైనీ గ‌నుల టెండ‌ర్ల వ్య‌వ‌హారంలో గ‌త కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేగుతోంది. నిబంధ‌న‌ల‌ను ఇష్టారీతిన మార్చార‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. ఫీల్డ్ విజిట్ నిబంధ‌న ఆధారంగా త‌మ‌కు న‌చ్చిన వారికి క‌ట్ట‌బెట్టేందుకే టెండ‌ర్లు జారీ చేశార‌ని మండిప‌డుతున్నాయి. ఈ అంశంపై బీఆర్ఎస్‌తో పాటు బీజేపీ నాయ‌కులు సైతం ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. మ‌రోవైపు టెంబ‌ర్ నిబంధ‌న‌ల‌పై సింగ‌రేణి పాల‌క‌మండ‌లిలో ఎందుకు చ‌ర్చించ‌లేద‌ని కేంద్ర బొగ్గు గ‌నుల శాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి సంజ‌య్‌కుమార్ అధికారుల‌ను నిల‌దీశారు.

ఆది నుంచీ వివాద‌మే...

నైనీ బొగ్గు గ‌నుల టెండ‌ర్ల అంశం ఆదినుంచీ వివాదాస్ప‌దంగానే ఉంది. గ‌తంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్ప‌డు 2016లో టెండ‌ర్ల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. కానీ టెండ‌ర్ల‌ను అక్ర‌మంగా కొందరికే క‌ట్ట‌బెట్టాల‌ని చూస్తున్నార‌ని అప్ప‌ట్లో ఎంపీగా ఉన్న కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీకి ఫిర్యాదు చేశారు. దాంతో టెండ‌ర్ల నోటిఫికేష‌న్‌ను ర‌ద్దు చేశారు. ఇటీవ‌ల గ‌త న‌వంబ‌ర్‌లో టెండ‌ర్ ప్ర‌క‌ట‌న జారీ చేసిన‌ప్ప‌టికీ, ప‌లు మీడియా క‌థ‌నాలు, ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ర‌ద్దు చేయాల‌ని ఉప‌ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ఆదేశించారు. మ‌రోసారి పారద‌ర్శ‌క నిబంధ‌న‌ల‌తో టెండ‌ర్ ప్ర‌క‌ట‌న జారీ చేసేందుకు అధికారులు క‌స‌రత్తు చేస్తోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement