Shaikpet-Masabtank Model corridor | షేక్‌పేట్ – మాసాబ్ ట్యాంక్ మార్గంలో మోడల్ కారిడార్: జీహెచ్‌ఎంసీ కమిషనర్
Shaikpet-Masabtank Model Corridor | షేక్‌పేట్ (Shaikpet) ఫ్లైఓవర్ నుంచి మాసాబ్ ట్యాంక్ (Masabtank) వరకు ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు 'మోడల్ కారిడార్'(Model Corridor) గా తీర్చిదిద్దనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ (RV Karnan) తెలిపారు. ప్రతి జోన్‌కు రూ.20 కోట్ల చొప్పున మొత్తం రూ.120 కోట్లు కేటాయిస్తున్నామని వెల్లడించారు.
త్రినేత్ర.న్యూస్: షేక్‌పేట్ (Shaikpet) ఫ్లైఓవర్ నుంచి మాసాబ్ ట్యాంక్ (Masabtank) వరకు ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు 'మోడల్ కారిడార్'(Model Corridor) గా తీర్చిదిద్దనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ (RV Karnan) తెలిపారు. ప్రతి జోన్‌కు రూ.20 కోట్ల చొప్పున మొత్తం రూ.120 కోట్లు కేటాయిస్తున్నామని వెల్లడించారు. కేబీఆర్ పార్క్ చుట్టూ పనులను రెండేళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్, ఉన్నతాధికారులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించారు.

అధికారులందరూ కలిసి ఒకే బస్సులో ప్రయాణించారు. మార్గమధ్యలో ఉన్న బాటిల్ నెక్‌లు (ట్రాఫిక్ అడ్డంకులు), నీరు నిలిచే ప్రాంతాలు, ఆక్రమణలను పరిశీలించి తక్షణ పరిష్కార మార్గాలను సూచించారు. ఎస్.డి.ఐ హాస్పిటల్ వద్ద, బృందావన్ కాలనీ రోడ్ నెం.1 వద్ద కొత్తగా పాదచారుల వంతెనలు నిర్మించాలని నిర్ణయించారు. షేక్‌పేట్ నాలా వద్ద పెలికాన్ సిగ్నల్, జీబ్రా క్రాసింగ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
నానల్ నగర్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు రోటరీ వెడల్పును తగ్గించి, రహదారిని విస్తరించాలని అధికారులను ఆదేశించారు. రేతిబౌలి నుంచి నానల్ నగర్ వరకు ఉన్న సెంట్రల్ మీడియన్‌ను, చెట్లను తొలగించి పనులు చేయాలన్నారు. డెల్ స్టోర్ ప్రాంతాల్లో మాస్టర్ ప్లాన్ ప్రకారం భూసేకరణ చేపట్టాలని సూచించారు. షేక్‌పేట్ నాలా సమీపంలోని సమాధులను తొలగించి వాహనాల రాకపోకలకు మార్గం సుగమం చేయాలని ఆదేశించారు. మాసాబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని చెప్పారు. మెహదీపట్నం వైపు ఉన్న ఎలక్ట్రికల్ ట్రాన్స్‌ఫార్మర్‌ను తరలించి, పోచమ్మ బస్తీ నుంచి రోడ్ నెం.12కు నేరుగా వెళ్లేలా స్లిప్ రోడ్డును అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ సీపీ ట్రాఫిక్ డి.జోయల్ డెవిస్, జోనల్ కమిషనర్ జి ముకుంద రెడ్డి, జోనల్ కమిషనర్ ప్రియాంక ఆలా, ట్రాఫిక్ డీసీపీ కాజల్, చీఫ్ సిటీ ప్లానర్ కె.శ్రీనివాస్, చీఫ్ ఇంజినీర్ ఎస్.రత్నాకర్, అడిషనల్ డీసీపీ వేణుగోపాల్ రెడ్డి, గోల్కొండ ట్రాఫిక్ ఏసీపీ ధనలక్ష్మి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





