Municipal Elections | మున్సిపల్ ఎన్నికలు.. కొనసాగుతున్న పోలింగ్
Municipal Elections | మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) పోలింగ్ కొనసాగుతున్నది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఉదయం నుంచే ఓట్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
Municipal Elections | త్రినేత్ర.న్యూస్: మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) పోలింగ్ కొనసాగుతున్నది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఉదయం నుంచే ఓట్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. తమ వంతు కోసం క్యూలైన్లలో నిల్చున్నారు. కాగా, మహబూబ్‌నగర్‌లోని 45వ డివిజన్ ఐదో బూత్‌లో ఉద్రిక్తత నెలకొంది. గుర్తులు తారుమారవడంతో పోలింగ్ నిలిచిపోయింది. దీంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు.
హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 7 కార్పొరేషన్లలోని 412 డివిజన్లకు, 116 మున్సిపాలిటీల్లో ఉన్న 2,569 వార్డుల్లో పోలింగ్ కొనసాగుతున్నది. మక్తల్ బీజేపీ అభ్యర్థి మరణించడంతో ఎన్నిక నిలిచిపోయింది. మరో 2 డివిజన్లు, 12 వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు.
మొత్తం 12,944 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కార్పొరేషన్లలోని 412 డివిజన్లలో 2,225 మంది పోటీ చేస్తుండగా, మున్సిపాలిటీల్లోని మొత్తం 2,569 వార్డులలో 10,719 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కార్పొరేషన్లలో అత్యధికంగా కరీంనగర్‌లో 66 డివిజన్లకు 398 మంది పోటీ పడుతుండగా, పురపాలికల్లో ఆదిలాబాద్‌లో అత్యధికంగా 49 వార్డులకు 314 మంది బరిలో ఉన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపి మొత్తం 52,17,413 ఓటర్లు వారి ఓటును వినియోగించుకోనున్నారు. వీరిలో 25,49,750 మంది పురుషులు, 26,67,025 మంది మహిళలు, 638 మంది ఇతరులు ఉన్నారు.
ఎన్నికల కోసం 8,203 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, 16,382 బ్యాలెట్ బాక్స్‌లను ఉపయోగిస్తున్నారు. 1,379 మంది రిటర్నింగ్ అధికారులు, 41,773 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. పోలీసులతోపాటు ఎక్సైజ్, అటవీ శాఖ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు.
ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే ఈ నెల 12న నిర్వహిస్తారు. అన్ని పోలింగ్ కేంద్రాల లోపల, బయట వెబ్‌కాస్టింగ్ చేయనున్నారు. ఓట్లను శుక్రవారం (ఫిబ్రవరి 13న) లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. 16న కార్పొరేషన్ల మేయర్లు, ఉపమేయర్లు, మున్సిపాలిటీల చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్లను ఎన్నుకోనున్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



