త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLC Dasoju Sravan | రేవంత్‌! గురుకుల‌ బెడ్‌షీట్స్‌ను కోటు కుట్టించుకో.. తెలుస్త‌ది

MLC Dasoju Sravan | స్పీకర్ వేసుకునే కోట్‌లా గురుకుల బెడ్ షీట్స్ (Gurukula bed sheets) ఉంటాయిని రేవంత్ రెడ్డి అన్నార‌ని.. తీరా చూస్తే పాత గుడ్డ‌ల‌ను రీసైక్లింగ్ చేసే మ‌ఫ‌త్‌లాల్ కంపెనీకి గురుకుల టెండ‌రిచ్చార‌ని ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ (MLC Dasoju Sravan) మండిప‌డ్డారు.

S

Telangana | Published On Nov 7, 2026, 3.45 pm IST

MLC Dasoju Sravan | రేవంత్‌! గురుకుల‌ బెడ్‌షీట్స్‌ను కోటు కుట్టించుకో.. తెలుస్త‌ది
Advertisement
  • పాత గుడ్డలను రీసైక్లింగ్ చేసే మఫత్ లాల్ కంపెనీకి గురుకుల టెండరిచ్చిన‌వ్‌
  • స్పీక‌ర్ ఏసుకొనే కోటులెక్క ఉంట‌య‌న్న‌వ్.. కుక్క పేగుల్లెక్క‌ త‌యారు చేసిండ్రు
  • బాల‌రాజుయాద‌వ్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించిన‌వ్‌
  • ప్ర‌జ‌ల సొమ్ముతో జీతాలు తీసుకునే పోలీసులు అక్ర‌మ కేసులు బంజేయాలే
  • ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ ఫైర్‌

MLC Dasoju Sravan | త్రినేత్ర న్యూస్‌: స్పీకర్ వేసుకునే కోట్‌లా గురుకుల బెడ్ షీట్స్ (Gurukula bed sheets) ఉంటాయిని రేవంత్ రెడ్డి అన్నార‌ని.. తీరా చూస్తే పాత గుడ్డ‌ల‌ను రీసైక్లింగ్ చేసే మ‌ఫ‌త్‌లాల్ కంపెనీకి గురుకుల టెండ‌రిచ్చార‌ని ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ (MLC Dasoju Sravan) మండిప‌డ్డారు. గురుకుల బెడ్‌షీట్స్‌ను ఆయ‌న కోట్ కుట్టించుకుంటే తెలుస్తుంద‌న్నారు. పేదింటి బిడ్డ అయిన దూదిమెట్ల బాల‌రాజుయాద‌వ్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌జ‌ల సొమ్ముతో జీతాలు తీసుకునే పోలీసులు అక్ర‌మ కేసులు మానుకోవాల‌ని సూచించారు. శ‌నివారం తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ రేవంత్ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు.

రాష్ట్రంలో పోలీస్ రాజ్యమనే రీతిలో పాలన కొనసాగుతుంది. పేదింటి బిడ్డ అయిన దూదిమెట్ల బాలరాజు యాదవ్‌పై ఎస్సీ, ఎస్టీ (SC ST) కేసు పెట్టారు. బీఆర్ఎస్ లీగల్ టీం దీనిపై వాదనలు వినిపించి బెయిల్ తెప్పించారు. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకునే పోలీసులు అక్రమ కేసులు మానుకోవాలి. ఎన్ని కేసులు పెట్టిన ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు బయటపెడుతూనే ఉంటాం. ప్రభుత్వం నిర్లక్ష్యంగా, నిస్సిగ్గుగా దోపిడి వ్యవస్థను నడుపుతుంది.

100 కోట్ల కుంభకోణం జ‌రిగింది

పాత గుడ్డలను రీసైక్లింగ్ చేసే మఫత్ లాల్ కంపెనీకి గురుకుల టెండర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి అనేక రకాలుగా దోపిడి చేస్తున్నాడు. ఆఖరికి విద్యా వ్యస్థను సైతం దోపిడీ చేస్తున్నాడు. గురుకుల కుంభకోణాన్ని బీఆర్ఎస్ నేతలు బయటపెట్టారు. సెంట్రలైజ్డ్ టెండర్ తో గురుకుల కుంభకోణం చేశారు. పేద బిడ్డలకు ఇచ్చే బెడ్ షీట్స్‌లో 100 కోట్ల కుంభకోణం జ‌రిగింది. గుజరాత్ కంపెనీకి గురుకుల టెండర్ ఇచ్చి కుంభకోణానికి పాల్పడ్డారు. ఇదే విషయాన్ని దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి బయటపెట్టారు.

ఐఏఎస్‌ అధికారి సవ్యసాశి ఘోష్ రేవంత్ రెడ్డి చెప్పుచేతుల్లో పనిచేస్తున్నారు. టేస్కో ద్వారా చేనేత కార్మికులకు మూడున్నర లక్షల టెండర్ వేశారు. ఇంకో మూడున్నర లక్షల టెండర్ ను గుజరాత్ కంపెనీకి కేటాయించారు. గుజరాత్ కంపెనీ పాత గుడ్డలతో కుక్క పేగులా బెడ్ షీట్స్ తయారు చేశారు. చేనేత కార్మికులు పిల్లలకు హెచ్చగా ఉండే బెడ్ షీట్స్ తయారు చేశారు. పాత గుడ్డలతో తయారు చేసిన బెడ్ షీట్స్ రేవంత్ రెడ్డి మనవడు కప్పుకుంటాడా? రేవంత్ రెడ్డికేమో ఇంద్ర భవనాలు. పేదింటి పిల్లలకు కనీసం కాటన్ బెడ్ షీట్స్ లేవు. పిల్లలకు ఇచ్చే బెడ్ షీట్స్ కుంభకోణాన్ని దేవుడు కూడా క్షమించడు. గురుకుల టెండర్స్ ను టెస్కో ద్వారానే ఇవ్వాలి.

బెడ్ షీట్స్‌ను రేవంత్ రెడ్డి కోటు కుట్టించుకుంటాడా? లిట్ క్యాప్ 6 ఎకరాల భూమిని అపర్ణకు కేటాయించారు. 200 కోట్ల విలువైన ఏక్తా మాల్ ను అపర్ణకే కేటాయించారు. గుజరాత్ కంపెనీ బెడ్ షీట్స్‌తో పిల్లలకు చలి పెడుతుందా లేదా ఫీడ్ బ్యాక్ అవసరమా? పేద వర్గాల పిల్లల పట్ల రేవంత్ రెడ్డికి చులకన భావం అని దాసోజు తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

ఈ మీడియా స‌మావేశంలో జడ్పీ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ, బీఆర్ఎస్ నేత రవి నాయక్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement