త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Muhurat Trading | దీపావ‌ళి నాడు ప్ర‌త్యేక స్టాక్ మార్కెట్ సెష‌న్‌.. ముహూర‌త్ ట్రేడింగ్‌లో స్టాక్స్‌ను కొనాలా..?

Muhurat Trading | దీపావ‌ళి పండుగ సంద‌ర్బంగా ఆదివారం భార‌త స్టాక్ మార్కెట్లు నిర్ణీత స‌మ‌యంపాటు ప‌నిచేయ‌నున్నాయి. దీన్నే ముహూర‌త్ ట్రేడింగ్ అని కూడా పిలుస్తారు. ఇప్ప‌టికే 11 సార్లు ముహూర‌త్ ట్రేడింగ్‌ను నిర్వ‌హించ‌గా, 9 సార్లు స్టాక్ మార్కెట్లు లాభాల‌ను న‌మోదు చేశాయి.

S

Business | Published On Nov 7, 2026, 4.11 pm IST

Muhurat Trading | దీపావ‌ళి నాడు ప్ర‌త్యేక స్టాక్ మార్కెట్ సెష‌న్‌.. ముహూర‌త్ ట్రేడింగ్‌లో స్టాక్స్‌ను కొనాలా..?
Advertisement

Muhurat Trading | దీపావ‌ళి పండుగ సంద‌ర్బంగా ఆదివారం భార‌త స్టాక్ మార్కెట్లు నిర్ణీత స‌మ‌యంపాటు ప‌నిచేయ‌నున్నాయి. దీన్నే ముహూర‌త్ ట్రేడింగ్ అని కూడా పిలుస్తారు. ఇప్ప‌టికే 11 సార్లు ముహూర‌త్ ట్రేడింగ్‌ను నిర్వ‌హించ‌గా, 9 సార్లు స్టాక్ మార్కెట్లు లాభాల‌ను న‌మోదు చేశాయి. దీపావ‌ళి నేప‌థ్యంలో ల‌క్ష్మీపూజ చేసేవారు పెట్టుబ‌డులు పెట్ట‌డం కోసం స్టాక్ మార్కెట్లు ప్ర‌త్యేక ట్రేడింగ్ సెష‌న్ల‌ను నిర్వ‌హిస్తున్నాయి. అందులో భాగంగానే ఈసారి దీపావ‌ళి పండుగ ఆదివారం రావ‌డంతో ఆ రోజు సెల‌వు కనుక ప్ర‌త్యేక సెష‌న్‌ను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. దీపావ‌ళి రోజు త‌ల‌పెట్టే ప్ర‌తి ప‌నిలో విజ‌యం సాధిస్తామని చాలా మంది విశ్వ‌సిస్తారు. ల‌క్ష్మీ పూజ చేస్తారు క‌నుక చేయ‌బోయే వ్యాపారంలో లాభాలు వ‌స్తాయ‌ని ఆశిస్తారు. అందుక‌నే చాలా మంది స్టాక్ మార్కెట్ల‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.

సెష‌న్ స‌మ‌యం ఎప్పుడు..?

ఈసారి దీపావ‌ళి పండుగ ఆదివారం వచ్చింది. ఆ రోజు స‌హ‌జంగానే స్టాక్ మార్కెట్ల‌కు సెల‌వు. అంత‌ర్జాతీయ‌, దేశీయ మార్కెట్లు ప‌నిచేయ‌వు. కానీ పండుగ క‌నుక ముహూర‌త్ ట్రేడింగ్‌ను నిర్వ‌హిస్తున్నారు. కాగా గ‌తేడాది ఇదే స‌మ‌యంలో నిఫ్టీలో పెట్టుబ‌డులు పెట్టి వారికి ఏడాది కాలంలో లాభాలు రాలేదు స‌రిక‌దా 3 శాతం మేర న‌ష్టాలు వ‌చ్చాయి. దీంతో ఈసారి ముహూర‌త్ ట్రేడింగ్ సెష‌న్ ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది. ఈసారి మార్కెట్లు లాభాలను అందిస్తాయా, లేదా అని పెట్టుబ‌డిదారులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అందులో భాగంగానే త‌మ‌కు కావ‌ల్సిన షేర్ల‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు చాలా మంది వేచి చూస్తున్నారు. ఇక ముహూర‌త్ ట్రేడింగ్ సెష‌న్‌ను ఎన్ఎస్ఈ, బీఎస్ఈ నిర్వ‌హించ‌నుండ‌గా, క‌మోడిటీ, ఫారెక్స్ త‌ప్ప మిగిలిన సెజ్‌మెంట్ల‌లో పెట్టుబ‌డిదారులు కొనుగోళ్లు చేయ‌వ‌చ్చు. ఆదివారం ముహూర‌త్ ట్రేడింగ్ సెష‌న్ మ‌ధ్యాహ్నం 2:20 నుంచి 3:30 గంట‌ల వ‌ర‌కు జ‌ర‌గ‌నుండగా, అంత‌కు ముందు 2:05 గంట‌ల నుంచి 2:20 గంట‌ల వ‌ర‌కు ప్రీ ఓపెన్ సెష‌న్ నిర్వ‌హిస్తారు. అయితే ఇది పేరుకే ముహూర‌త్ సెషన్‌. కానీ వాస్త‌వ ట్రేడ్స్ జ‌రుగుతాయి. క‌నుక పెట్టుబ‌డిదారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

స్టాక్స్ కొనాలా..?

ముహూర‌త్ ట్రేడింగ్ అంటే చాలా మంది స్టాక్స్‌, మ్యుచువ‌ల్ ఫండ్స్‌, ఈటీఎఫ్‌లు వంటి వాటిల్లో కొనుగోళ్లు చేయ‌డ‌మే అని భావిస్తారు. కానీ కేవ‌లం ముహూర‌త్ పేరిట కొనుగోళ్ల‌ను చేయకూడ‌ద‌ని, తెలియ‌కుండా పెట్టుబ‌డులు పెడితే న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఉంటుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. సొంత ప‌రిజ్ఞానంతో విశ్లేష‌ణ చేయాల‌ని, అవ‌స‌రం అయితే నిపుణుల స‌ల‌హా తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. లేదంటే భారీ ఎత్తున న‌ష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంద‌ని చెబుతున్నారు. చాలా మంది స‌రైన అవ‌గాహ‌న లేక స్టాక్ మార్కెట్ల‌లో పెట్టుబ‌డులు పెడుతుంటారు. దీంతో న‌ష్టాలు వ‌చ్చి స‌త‌మ‌తం అవుతుంటారు. అందువ‌ల్ల అలా జ‌ర‌గ‌కుండా ఉండాలంటే ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంద‌ని సూచిస్తున్నారు. అవ‌గాహ‌న లేక‌పోతే ఆర్థిక నిపుణుల స‌ల‌హా తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి అని చెబుతున్నారు.

Advertisement
Advertisement