Bhuvanagiri | భువనగిరిలో దారుణం.. పిల్లలపై కత్తితో దాడిచేసిన తల్లి
huvanagiri | యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి (Bhuvanagiri) మండలం తొక్కాపురంలో దారుణం చోటుచేసుకున్నది. మతిస్థిమితం లేని ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలపై కత్తితో దాడి చేసింది.
Bhuvanagiri | త్రినేత్ర.న్యూస్: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి (Bhuvanagiri) మండలం తొక్కాపురంలో దారుణం చోటుచేసుకున్నది. మతిస్థిమితం లేని ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలపై కత్తితో దాడి చేసింది. అనంతరం తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో కూతురు మృతిచెందగా, కొడుకు ప్రాణాలతో బయటపడ్డాడు.
బీబీనగర్ మండలం జైనపల్లి గ్రామానికి చెందిన బెజ్జంకి నరేందర్ రెడ్డితో నీలిమ (40)కు 15 ఏండ్ల క్రితం వివాహమైంది. వారికి కూతురు కృతిక రెడ్డి (14), కుమారుడు అక్షిత్ రెడ్డి (11) ఉన్నారు. కొంతకాలంగా నీలిమ మానసిక స్థితి (మతిస్థిమితం) సరిగ్గా లేదని తెలుస్తున్నది. కాగా, శనివారం సాయంత్రం పిల్లలతో కలిసి తల్లిదండ్రుల ఇంటికి వచ్చిన నీలిమ.. రాత్రి పిల్లలిద్దరూ నిద్రిస్తున్న సమయంలో వారిపై కత్తితో వారిపై దాడిచేసింది. దీంతో తీవ్రంగా గాయపడిన కృతిక అక్కడికక్కడే మృతిచెందింది. గదిలో నుంచి బయటకు పరిగెత్తడంతో అక్షిత్ దాడినుంచి బయటపడ్డాడు. అనంతరం నీలిమ ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది.
గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆమెను రక్షించి, చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉంటంతో ఉప్పల్‌లోని ఓ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాడికి కుటుంబ కలహాలే కారణమని తెలుస్తున్నది.
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం






