Rain Alert | నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ..
Rain Alert | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపుల కూడిన వానలు (Rain Alert) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది.
Rain Alert | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపుల కూడిన వానలు (Rain Alert) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. దీంతోపాటు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, కరీంనగర్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..
ఇక సంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, సిరిసిల్ల, సిద్దిపేట, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షం కురుస్తుందని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది.
భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, హైదరాబాద్ జిల్లాలో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదేవిధంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఎండ తీవ్రతతో వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Driving | కారు, బైక్ నడపడం వచ్చా?.. ఇలా చేస్తే మీకు నెలకు రూ.లక్ష జీతం వచ్చినట్టే..
- ●GPI | ప్రపంచ శాంతి సూచీలో మరింత దిగజారిన భారత్ స్థానం..
- ●NEET UG | 21న నీట్ యూజీ రీ-ఎగ్జామ్.. 15 నిమిషాలు పెరిగిన పరీక్షా సమయం..
- ●Revanth Reddy | దారిమళ్లిన సీఎం రేవంత్ విమానం.. ఎందుకంటే?
- ●Horoscope | జూన్ 13 రాశి ఫలాలు.. ఈ రాశివారు అనుకున్న పనులు నెరవేరుతాయి!
- ●Harish Rao | కాంగ్రెస్ సింగరేణిని కుంభకోణాల గనిగా మార్చేసింది : హరీశ్ రావు

Driving | కారు, బైక్ నడపడం వచ్చా?.. ఇలా చేస్తే మీకు నెలకు రూ.లక్ష జీతం వచ్చినట్టే..

GPI | ప్రపంచ శాంతి సూచీలో మరింత దిగజారిన భారత్ స్థానం..

NEET UG | 21న నీట్ యూజీ రీ-ఎగ్జామ్.. 15 నిమిషాలు పెరిగిన పరీక్షా సమయం..

Revanth Reddy | దారిమళ్లిన సీఎం రేవంత్ విమానం.. ఎందుకంటే?






