త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | దారిమ‌ళ్లిన సీఎం రేవంత్ విమానం.. ఎందుకంటే?

Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్ర‌యాణిస్తున్న విమానాన్ని దారిమ‌ళ్లించారు (Flight Diverted). హైద‌రాబాద్‌లో (Hyderabad) ప్ర‌తికూల వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు ఉండ‌ట‌మే దీనికి కార‌ణం.

G

Telangana | Published On Jun 13, 2026, 5.37 am IST

Revanth Reddy | దారిమ‌ళ్లిన సీఎం రేవంత్ విమానం.. ఎందుకంటే?
Advertisement

Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్ర‌యాణిస్తున్న విమానాన్ని దారిమ‌ళ్లించారు (Flight Diverted). హైద‌రాబాద్‌లో (Hyderabad) ప్ర‌తికూల వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు ఉండ‌ట‌మే దీనికి కార‌ణం. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ను ముగించుకున్న ముఖ్య‌మంత్రి ఇండిగో విమానం 6E717 హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ క్ర‌మంలో శంషాబాదులో ఉరుములు, మెరుపుల‌తో వ‌ర్షం బీభ‌త్సం సృష్టించింది. పెద్ద ఎత్తున ఈదురు గాలులు వీయ‌డంతో అధికారులు విమానాల ల్యాండింగ్‌కు అనుమ‌తించ‌లేదు. దీంతో భద్రతా కారణాల వ‌ల్ల‌ మార్గం మార్చాల్సి వచ్చింది. పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ అధికారులు పరిస్థితిని పరిశీలించి విమానాన్ని బెంగళూరుకు (Bengaluru) మ‌ళ్లించారు. అక్కడ విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ప్రయాణికుల భద్రతే ప్రధాన కారణమని ఎయిర్‌లైన్ వర్గాలు పేర్కొన్నాయి.

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సీఎం రేవంత్ ప్ర‌ధాని మోదీ ఆధ్య‌ర్వంలో జ‌రిగిన నీతి ఆయోగ్ స‌మావేశంలో పాల్గొన్నారు. అనంత‌రం ప్ర‌ధానితో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు. రాష్ట్రానికి అవ‌స‌ర‌మైన ప్రాజెక్టుల‌ను ఏక‌రువుపెట్టారు. నిధులు, అనుమ‌తులు ఇవ్వాలంటూ ప్ర‌ధానిని కోరారు. ఆ త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ సీడ‌బ్ల్యూసీ స‌మావేశానికి హాజ‌రయ్యారు.

 

Advertisement
Advertisement