Rice Business Success | టీసీఎస్ జాబ్ రిజెక్ట్ చేసి.. బియ్యం అమ్మి ఏటా రూ.25 లక్షలు సంపాదిస్తున్నాడు!
టీసీఎస్ (TCS) క్యాంపస్ ప్లేస్‌మెంట్‌ను వదులుకుని బియ్యం వ్యాపారం మొదలుపెట్టిన ఓ యువకుడు ఏటా రూ. 25 లక్షలు సంపాదిస్తున్నాడు. ఈ సక్సెస్ స్టోరీ మీకోసం.
Viral news | Published On Jul 26, 2026, 11.00 pm IST
- టీసీఎస్ (TCS) జాబ్ ఆఫర్‌ను రిజెక్ట్ చేసి రైస్ బిజినెస్ (Rice Business) స్టార్ట్ చేసిన యువకుడి స్టోరీ వైరల్
- రైతుల నుంచి నేరుగా బియ్యం కొనుగోలు చేసి, సొంత బ్రాండ్‌తో నెలకు 20,000 కిలోల సప్లై
- కిలోకు రూ. 10 లాభంతో ఏడాదికి సుమారు రూ. 25 లక్షల ఆదాయం
- కార్పొరేట్ ఉద్యోగం కంటే సొంత వ్యాపారం బెస్ట్ అంటూ నెట్టింట ఆసక్తికర చర్చ
Rice Business Success | త్రినేత్ర.న్యూస్ : క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో టీసీఎస్ (TCS) లాంటి దిగ్గజ ఐటీ కంపెనీలో జాబ్ వస్తే ఎవరైనా ఏం చేస్తారు? వెంటనే వెళ్లి జాయిన్ అయిపోతారు. కానీ, ఓ యువకుడు మాత్రం ఆ జాబ్ ఆఫర్‌ను రిజెక్ట్ చేసి.. సొంతంగా బియ్యం వ్యాపారం (Rice business) స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఏటా రూ.25 లక్షల ఆదాయంతో సక్సెస్‌ఫుల్ ఎంట్రప్రెన్యూర్‌గా ఎదిగాడు. అంకిత్ పాండే అనే నెటిజన్ ఎక్స్ (X) వేదికగా పంచుకున్న ఈ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది.
అందరూ విమర్శించినా వెనక్కి తగ్గలేదు..
అంకిత్ పాండే పోస్ట్ ప్రకారం.. అతని స్నేహితుడికి టీసీఎస్‌లో జాబ్ వచ్చింది. కానీ అతను దాన్ని వదులుకున్నాడు. ఆ సమయంలో అందరూ అతన్ని విమర్శించారు. లైఫ్‌లో అతిపెద్ద తప్పు చేస్తున్నావని, కార్పొరేట్ కెరీర్ ఇచ్చే సెక్యూరిటీని కాదనుకోవడం కరెక్ట్ కాదన్నారు. కానీ, ఆ యువకుడు మాత్రం వెనక్కి తగ్గకుండా రైస్ డిస్ట్రిబ్యూషన్ (Rice distribution) బిజినెస్‌లోకి అడుగుపెట్టాడు.
వ్యాపారం ఎలా నడుస్తోందంటే?
వివిధ రాష్ట్రాలు, గ్రామాల్లోని రైతుల నుంచి నేరుగా బియ్యం కొనుగోలు చేయడం స్టార్ట్ చేశాడు. ఆ బియ్యాన్ని శుభ్రం చేసి.. తన సొంత బ్రాండ్ పేరుతో ప్యాక్ చేసి సుమారు 200 ఫిక్స్‌డ్ రిటైల్ షాపులకు సప్లై చేస్తున్నాడు.
బిజినెస్ మోడల్ లెక్కలు ఇవే
కొనుగోలు ధర: కిలోకు రూ. 35
ప్యాకేజింగ్ ఖర్చు: కిలోకు రూ. 3
ట్రాన్స్‌పోర్ట్ ఖర్చు: కిలోకు రూ. 2
మొత్తం ఖర్చు: కిలోకు రూ. 40
రిటైలర్లకు అమ్మే ధర: కిలోకు రూ. 50
రిటైలర్లు కస్టమర్లకు అమ్మేది: కిలోకు రూ. 55-57
లాభం (Profit): కిలోకు రూ. 10
ఈ లెక్కన అతను నెలకు దాదాపు 200 క్వింటాళ్ల (20,000 కిలోలు) బియ్యాన్ని సప్లై చేస్తున్నాడు. అంటే అతని వార్షిక ఆదాయం సుమారు రూ. 25 లక్షలు ఉంటుందని అంకిత్ పాండే తన పోస్ట్‌లో వివరించాడు.
నెట్టింట ఆసక్తికర చర్చ
ఈ పోస్ట్ నెట్టింట వైరల్ (Viral) కావడంతో ఎంట్రప్రెన్యూర్‌షిప్ (Entrepreneurship), ఫైనాన్షియల్ రిస్క్ గురించి పెద్ద చర్చే నడుస్తోంది. కార్పొరేట్ ఉద్యోగం ఒక్కటే సక్సెస్‌కు మార్గం కాదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. "లైఫ్‌లో సింపుల్ రూల్ బ్రో.. ఎంత రిస్క్ తీసుకుంటే అంత ప్రాఫిట్ ఉంటుంది" అని ఒకరు కామెంట్ చేయగా, "సొంతంగా సప్లై చైన్ (Supply chain) బిల్డ్ చేసుకుంటే స్టాండర్డ్ కార్పొరేట్ జీతం కంటే ఎక్కువే సంపాదించొచ్చు" అని మరొకరు రాసుకొచ్చారు.
అయితే కొందరు మాత్రం వాస్తవ పరిస్థితులను గుర్తుచేస్తున్నారు. "చూడటానికి ఇది చాలా సింపుల్‌గా అనిపిస్తుంది. కానీ బిజినెస్‌లో లాభాలు తీసుకురావడం టీసీఎస్‌లో జీతం తీసుకోవడం కంటే కష్టమైన పనే. బిజినెస్‌లో చాలా బాధ్యత ఉంటుంది" అని కామెంట్ చేస్తున్నారు.
My friend got a placement at TCS.
He rejected it.
Everyone said he was making the biggest mistake of his life.
Today, he earns around ₹25 lakh a year selling rice.
He buys rice directly from farmers across multiple villages and states, cleans it, packs it under his own… pic.twitter.com/93Ih45YckG
— Ankit Pandey (@iamankitpande) July 24, 2026
తాజావార్తలు
- ●Mumbai Cop Vinod Kalukhe | సీజేపీ ఆందోళనల్లో స్పెషల్ అట్రాక్షన్: ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ముంబై 'పూకీ' కాప్.. ఇతని స్టోరీ ఇదే!
- ●Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల
- ●Serial Actress | మోడ్రన్ లుక్‌లో గుండె నిండా గుడి గంటలు మీనా
- ●PM Modi Exam Reforms | ఎగ్జామ్ పేపర్ లీక్స్‌కు చెక్: రంగంలోకి నందన్ నిలేకని.. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ!
- ●Vaibhav Suryavanshi | మళ్లీ చితక్కొట్టిన వైభవ్.. టీ20ల్లో అరుదైన చరిత్ర సృష్టించిన సూర్యవంశీ
- ●Rasha Thadani | అమ్మ స్టార్ హీరోయిన్ - నాన్న పెద్ద ప్రొడ్యూసర్ - శ్రీనివాస మంగాపురం హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే!

Mumbai Cop Vinod Kalukhe | సీజేపీ ఆందోళనల్లో స్పెషల్ అట్రాక్షన్: ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ముంబై 'పూకీ' కాప్.. ఇతని స్టోరీ ఇదే!

Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల

Serial Actress | మోడ్రన్ లుక్‌లో గుండె నిండా గుడి గంటలు మీనా

PM Modi Exam Reforms | ఎగ్జామ్ పేపర్ లీక్స్‌కు చెక్: రంగంలోకి నందన్ నిలేకని.. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ!



