Tencent Employee Fired | రూ.4.5 కోట్ల ప్యాకేజీ.. ఆన్‌లైన్‌లో లీకైన శాలరీ డీటెయిల్స్: ఉద్యోగిని ఫైర్ చేసిన కంపెనీ
తన రూ. 4.5 కోట్ల ప్యాకేజీ వివరాలు లీక్ అవ్వడంతో ఓ ఉద్యోగి జాబ్ కోల్పోయాడు. టెన్సెంట్ కంపెనీ తీసుకున్న ఈ షాకింగ్ నిర్ణయం వెనుక అసలేం జరిగిందంటే?
Viral news | Published On Jul 26, 2026, 11.55 pm IST
- ప్రముఖ చైనీస్ టెక్ దిగ్గజం 'టెన్సెంట్' (Tencent) తమ ఉద్యోగిని విధుల నుంచి తొలగించింది
- సదరు ఉద్యోగి వార్షిక వేతనం సుమారు రూ. 4.5 కోట్లు అన్న విషయం ఆన్‌లైన్‌లో లీక్ కావడమే ఇందుకు కారణం
- అత్యంత గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని లీక్ చేసినందుకే ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు కంపెనీ వెల్లడి
- భవిష్యత్తులో అతను తమ సంస్థలో పనిచేయకుండా శాశ్వత నిషేధం (Permanent ban) విధించిన యాజమాన్యం
Tencent Employee Fired | త్రినేత్ర.న్యూస్ : సాధారణంగా ఏ కంపెనీలోనైనా ఉద్యోగుల జీతభత్యాల (Salaries) వివరాలు చాలా సీక్రెట్‌గా ఉంచుతారు. తోటి ఉద్యోగుల మధ్య ఎలాంటి విభేదాలు రాకుండా, ఇతర కంపెనీలు తమ టాలెంట్‌ను లాగేసుకోకుండా జాగ్రత్త పడుతుంటారు. కానీ, చైనాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం 'టెన్సెంట్'లో (Tencent) పనిచేసే ఓ ఉద్యోగికి సంబంధించిన ఏకంగా రూ. 4.5 కోట్ల భారీ ప్యాకేజీ వివరాలు సోషల్ మీడియాలో (Social media) లీక్ అయ్యాయి. దీంతో కంపెనీ ఆ ఉద్యోగిని ఏకంగా జాబ్ నుంచి పీకేసింది.
వైరల్‌గా మారిన శాలరీ డీటెయిల్స్
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ రిపోర్ట్ ప్రకారం.. 1.3 బిలియన్లకు పైగా యూజర్లు ఉన్న విచాట్ (WeChat) యాప్‌ను రన్ చేసే టెన్సెంట్ కంపెనీకి చెందిన 'వీక్సిన్ గ్రూప్'లో (Weixin Group) 'యె' (Ye) అనే వ్యక్తి ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఇంటర్నల్ కంపెనీ ప్లాట్‌ఫామ్ నుంచి తీసినట్లుగా భావిస్తున్న ఓ స్క్రీన్‌షాట్ (Screenshot) ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.
అందులో అతని వార్షిక వేతనం సుమారు 3.17 మిలియన్ యువాన్లు (మన కరెన్సీలో సుమారు రూ. 4.5 కోట్లు) అని ఉంది. ఈ ప్యాకేజీలో సుమారు రూ. 1.17 కోట్ల క్యాష్ బోనస్, రూ. 3.35 కోట్ల విలువైన స్టాక్ ఇన్సెంటివ్‌లు (Stock incentives) ఉన్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఈ ఫిగర్స్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోవడంతో పాటు, ఈ ఇంటర్నల్ సమాచారం పబ్లిక్ డొమైన్‌లోకి ఎలా వచ్చిందన్న దానిపై పెద్ద చర్చే నడిచింది.
కంపెనీ సీక్రెట్స్ లీక్ చేసినందుకే ఫైర్
ఈ భారీ ప్యాకేజీ వివరాలు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారడంతో టెన్సెంట్ యాజమాన్యం సీరియస్ అయింది. ఇంటర్నల్ రూల్స్ ప్రకారం.. అత్యంత గోప్యంగా (Confidential) ఉంచాల్సిన సమాచారాన్ని బయటి వ్యక్తులతో షేర్ చేసినందుకు 'యె'ను విధుల నుంచి తొలగించినట్లు స్పష్టం చేసింది. ఈ లీక్ వల్ల కంపెనీ లోపల, బయట తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందని ఉద్యోగులకు పంపిన ఇంటర్నల్ నోటీసులో పేర్కొంది. భవిష్యత్తులో అతను తమ కంపెనీలో ఎప్పటికీ పనిచేయకుండా పర్మనెంట్ బ్యాన్ (Permanent ban) కూడా విధించింది. త్వరలోనే దీనిపై అధికారికంగా క్రమశిక్షణా చర్యల నోటీసు జారీ చేయనుంది.
రూల్స్ విషయంలో స్ట్రిక్ట్‌గా టెన్సెంట్
ఇటీవల కాలంలో టెన్సెంట్ తమ ఇంటర్నల్ కంప్లయన్స్ (Compliance) రూల్స్‌ను మరింత కఠినతరం చేసింది. జనవరిలో విడుదల చేసిన వార్షిక కార్పొరేట్ నివేదిక ప్రకారం.. 2025లో ఏకంగా 70కి పైగా ఉల్లంఘనలను యాంటీ-కరప్షన్ టీమ్ గుర్తించింది. ఈ ఇన్వెస్టిగేషన్స్ ఫలితంగా 90 మందికి పైగా ఉద్యోగులను ఫైర్ చేయగా, మరో 20 కేసులను క్రిమినల్ ప్రాసిక్యూషన్ కోసం పోలీసులకు అప్పగించింది. ట్రేడ్ సీక్రెట్స్, ఇంటర్నల్ మెసేజ్‌లు, ఎంప్లాయ్ రికార్డ్స్ లాంటివి బయటకు లీక్ చేయడాన్ని ఆ కంపెనీ అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణిస్తోంది.
తాజావార్తలు
- ●Rice Business Success | టీసీఎస్ జాబ్ రిజెక్ట్ చేసి.. బియ్యం అమ్మి ఏటా రూ.25 లక్షలు సంపాదిస్తున్నాడు!
- ●Mumbai Cop Vinod Kalukhe | సీజేపీ ఆందోళనల్లో స్పెషల్ అట్రాక్షన్: ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ముంబై 'పూకీ' కాప్.. ఇతని స్టోరీ ఇదే!
- ●Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల
- ●Serial Actress | మోడ్రన్ లుక్‌లో గుండె నిండా గుడి గంటలు మీనా
- ●PM Modi Exam Reforms | ఎగ్జామ్ పేపర్ లీక్స్‌కు చెక్: రంగంలోకి నందన్ నిలేకని.. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ!
- ●Vaibhav Suryavanshi | మళ్లీ చితక్కొట్టిన వైభవ్.. టీ20ల్లో అరుదైన చరిత్ర సృష్టించిన సూర్యవంశీ

Rice Business Success | టీసీఎస్ జాబ్ రిజెక్ట్ చేసి.. బియ్యం అమ్మి ఏటా రూ.25 లక్షలు సంపాదిస్తున్నాడు!

Mumbai Cop Vinod Kalukhe | సీజేపీ ఆందోళనల్లో స్పెషల్ అట్రాక్షన్: ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ముంబై 'పూకీ' కాప్.. ఇతని స్టోరీ ఇదే!

Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల

Serial Actress | మోడ్రన్ లుక్‌లో గుండె నిండా గుడి గంటలు మీనా



