MLC Kavitha | 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం.. తేల్చిచెప్పిన ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha | తాను ఏదో ఒక రోజు ముఖ్యమంత్రిని అవుతానని తన మనసులోని మాటను బయటపెట్టిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత.. తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. 2029 ఎన్నికల్లో కచ్చితంగా పోటీలో ఉంటామని ఆమె తేల్చిచెప్పారు. సామాజిక తెలంగాణ తన లక్ష్యమని కవిత మరోసారి స్పష్టం చేశారు.
యువత, మహిళలకు రాజకీయ అవకాశాలు రావాలి
కాంగ్రెస్ సర్కార్ అన్ని రంగాల్లో అట్టర్ ప్లాప్
రేవంత్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తి
ఎక్స్‌లో నెటిజన్లతో ఇంటరాక్షన్
ఆస్క్ కవిత కార్యక్రమంలో నెటిజన్ల ప్రశ్నలకు కవిత సమాధానాలు
MLC Kavitha | హైదరాబాద్ : తాను ఏదో ఒక రోజు ముఖ్యమంత్రిని అవుతానని తన మనసులోని మాటను బయటపెట్టిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత.. తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. 2029 ఎన్నికల్లో కచ్చితంగా పోటీలో ఉంటామని ఆమె తేల్చిచెప్పారు. సామాజిక తెలంగాణ తన లక్ష్యమని కవిత మరోసారి స్పష్టం చేశారు.
సోమవారం ఆస్క్ కవిత హ్యాష్ ట్యాగ్‌పై ఎక్స్‌లో పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె వివరంగా సమాధానాలు ఇచ్చారు. తెలంగాణ విషయంలో కవిత విజన్, జాగృతి భవిష్యత్ కార్యాచరణ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు సహా పలు ప్రశ్నలను నెటిజన్లు సంధించారు. ఆ ప్రశ్నలన్నింటికీ కవిత సమాధానాలు ఇచ్చారు.
ప్రజలు సూచించిన పేరే.. మా పార్టీకి పెడుతాం..
యువత, మహిళలు వారికి నచ్చిన రంగాల్లో అవకాశాలు పొందాలని.. అందుకు వారిని ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. యువత, మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించేందుకు జాగృతి కృషి చేస్తుందన్నారు. కొత్త పార్టీకి సంబంధించి అడిగిన ప్రశ్నకు క్లారిటీ ఇచ్చారు. 2029 ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు సూచించిన పేరునే పార్టీకి పెడుతామన్నారు. తెలంగాణ సాధికారిత సాధించాలంటే మెరుగైన, నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం ప్రజలకు అందాలని అన్నారు. తెలంగాణలో తల్లితండ్రులు పిల్లల చదువుకోసం ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టకుండా ఉండే పరిస్థితి రావాలన్నారు. ఉద్యోగాలు, స్కిల్, భద్రత మూడింటిలో దేనికి ప్రాధాన్యం ఇస్తారని ప్రశ్నించగా... యువతకు ఉద్యోగాలు కల్పించటమే తన ప్రథమ ప్రాధాన్యమని చెప్పారు. ఉద్యోగాలతో పాటు వారికి భద్రత కూడా కల్పించాలన్నారు. సామాజిక న్యాయం కోసం జాగృతి పోరాటం కొనసాగుతుందన్నారు. క్రమంగా జాగృతిని చాలా బలంగా తయారు చేస్తామని చెప్పారు. త్వరలోనే జాగృతి మెంబర్ షిప్ డ్రైవ్ కూడా ప్రారంభిస్తామన్నారు. అదే విధంగా మేము వేసిన కమిటీల్లో ఇప్పటికే అన్ని వర్గాలకు అవకాశం ఇచ్చామని చెప్పారు.
కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి
రేవంత్ రెడ్డి పరిపాలన గురించి పలువురు నెటిజన్లు కవితను ప్రశ్నించారు. రేవంత్ పాలన ఎలా ఉందన్న ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ అట్టర్ ప్లాప్ అయ్యిందన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోవటంతో లక్షలాది మంది విద్యార్థులు చదువులకు దూరం కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం ఆడపిల్లల చదువుకు మరణశాసనంగా మారిందన్నారు. ఇక రైతుల ఆత్మహత్యలు చాలా బాధకరమని చెప్పారు. కాంగ్రెస్ వచ్చాక వరుసగా రైతుల ఆత్మహత్యలు కొనసాగటం బాధకరమన్నారు. ప్రభుత్వం చేతగాని, నిర్లక్ష్య వైఖరిని ఇది నిదర్శనమని చెప్పారు. ఇక ఫార్మా సిటీ కోసం తీసుకున్న భూముల్లో ఫ్యూచర్ సిటీ అంటూ హడావుడి చేయటంపై మండిపడ్డారు. తర్వలోనే అక్కడి రైతులకు మద్దతుగా పోరాటం చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ వచ్చాక సింగరేణి సంస్థను తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఎంఎస్‌తో కలిసి సింగరేణి కోసం ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. హైదరాబాద్‌లో ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవటంపై కవిత మండిపడ్డారు. వెస్ట్ సిటీపై పెట్టిన శ్రద్ధ, ఈస్ట్ సిటీని సిటీ అభివృద్ది చేయటంలో పెట్టలేదన్నారు.
చిరంజీవి అభిమానిని..
కవిత వ్యక్తిగత అభిరుచులకు సంబంధించి పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. రామ్ చరణ్ గురించి ఒక్క మాటలో చెప్పాలని అడగగా.. చాలా హంబుల్‌గా ఉండే వ్యక్తి. మంచి డ్యాన్సర్ అన్నారు. అయితే తాను చిరంజీవి అభిమానిని. చిరంజీవి తర్వాతే రామ్ చరణ్ అన్నారు. చిన్నప్పుడు ఎర్రమంజిల్‌లో గడిపిన క్షణాలు తనకు చాలా సంతోషాన్నిచ్చాయని అన్నారు. అయితే రాజకీయాలు కాకుండా ఏదైనా బిజినెస్‌పై దృష్టి పెట్టాలంటూ ఓ నెటిజన్ సూచించగా... అందుకు కవిత కూల్‌గా జవాబిచ్చారు. సోషల్ మీడియాలో ఇలాంటి చాలా నెగిటివీటి ఉంటుందని దాన్ని పట్టించుకోకుండా మంచిగా ఆలోచించాలని కవిత సూచించారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



