Singireddy Niranjan Reddy | నెహ్రూ కాలం నుంచే తెలంగాణకు అన్యాయం.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆగ్రహం
Singireddy Niranjan Reddy | నెహ్రూ హయాం నుంచి తెలంగాణకు అన్యాయం చేయడం మొదలైందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు 90శాతం పూర్తయ్యాయని.. ఆ పనులు ఆపడమేంటని ప్రశ్నించారు.
Singireddy Niranjan Reddy | నెహ్రూ హయాం నుంచి తెలంగాణకు అన్యాయం చేయడం మొదలైందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు 90శాతం పూర్తయ్యాయని.. ఆ పనులు ఆపడమేంటని ప్రశ్నించారు. జూరాల ప్రాజెక్టును మాజీ మంత్రులు నింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌లతో కూడిన బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం మంగళవారం సందర్శించింది. నార్లపూర్ పంప్‌హౌస్, రిజర్వాయర్, వట్టెం పంప్‌హౌస్, కరివెన రిజర్వాయర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ జూరాల నుంచి పాలమూరుకు నీళ్లంటేనే పెద్ద కుట్ర అంటూ ధ్వజమెత్తారు. మంత్రి ఉత్తమ్ పీపీటీ అంతా తప్పుల తడకని, హరీశ్‌రావు పవర్ ఫుల్ ప్రజంటేషన్‌తో ఉత్తమ్‌కు సమాధానం ఇచ్చారన్నారు.
తెలుగు గంగ పేరుతో నీటి తరలింపు..
అన్ని అంశాలపై ప్రజలకు అవగాహన ఉందని, కృష్టా నీళ్లు తెలంగాణకు దక్కకుండా చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. నిజాం కాలంలోనే కృష్ణా నీటి కోసం అనేక ప్రాజెక్టులను రూపకల్పన చేశారని, తుంగభద్రలో నీటి పంపకాలపై 65 టీఎంసీల కోసం 1944లో ఒప్పందాలు జరిగాయన్నారు. మొదట భీమా ప్రాజెక్టును ప్రతిపాదించారని.. ఆలమట్టిని సైతం నిజాం కాలంలోనే ప్రతిపాదించారన్నారు. పాలమూరుకు 174 టీఎంసీల నీళ్లు ఇవ్వాలని నిజాం ప్రాజెక్టులను నిర్మించారని నిరంజన్‌రెడ్డి తెలిపారు. నిజాం ప్రతిపాదనలను నెహ్రూ ప్రభుత్వం రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన.. ఆ సమయం నుంచే తెలంగాణకు అన్యాయం చేయడం మొదలైందన్నారు. సిద్దేశ్వరం వద్ద నిర్మించాల్సిన శ్రీశైలం ప్రాజెక్ట్‌ని 86 కిలోమీటర్ల దిగువన కట్టారని, సిద్దేశ్వరం వద్దే నిర్మిస్తే గ్రావిటి ద్వారా పాలమూరుకు నీరు వచ్చేవని గుర్తు చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి తెలుగుగంగ పేరిట నీటిని తరలించారని.. కడప, నెల్లూరు జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు నీళ్లు అందించారని ఆరోపించారు. కృష్ణా నదిని మొత్తం మలుపుకు పోయేలా పోతిరెడ్డిపాడును చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలం దరిదాపుల్లోకి రాకుండా చేసే కుట్ర అప్పుడు జరిగిందని, ఇప్పుడు అదే జరుగుతుందన్నారు.
10శాతం పనులు పూర్తి చేస్తే నీటిని వాడుకోవచ్చు..
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను ప్రస్తుత ప్రభుత్వం పదిశాతం పనులు పూర్తి చేస్తే.. నీటిని వాడుకోవచ్చని చెప్పారు. కొత్త ప్రాజెక్టు కడితే ఎప్పటికి మొదలవుతుందని నిలదీశారు. రూ.32వేల కోట్ల పనులను బీఆర్ఎస్ పూర్తి చేసుకోవచ్చని, రూ.27వేల కోట్ల బిల్లులు చెల్లించామని చెప్పారు. కేసీఆర్ వచ్చాక తెలంగాణ నీటి లభ్యత గురించి తెలిపారని, ముందే అప్రమత్తమైతే తెలంగాణ నీటి వాటాను కోల్పోయేది కాదన్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



