మూటలు మోసుడు తప్ప.. ముఖ్యమంత్రికి ఏం తెల్వది..!
KTR | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మూటలు మోసుడు తప్ప ఏం తెల్వదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. జనగామ పట్టణంలోని భ్రమరాంబ కన్వెన్షన్ హాల్‌లో కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల అభినందన కార్యక్రమానికి కేటీఆర్ హాజరయ్యారు.
- నీళ్ల గురించి తెలియని రేవంత్‌రెడ్డి కేసీఆర్‌కు పాఠాలు చెప్తుండు
- రాహుల్ మాటలు విని నిరుద్యోగులు ఓట్లు వేయించారు
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- జనగామలో సర్పంచ్, ఉప సర్పంచుల అభినందన సభకు హాజరు
KTR | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మూటలు మోసుడు తప్ప ఏం తెల్వదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. జనగామ పట్టణంలోని భ్రమరాంబ కన్వెన్షన్ హాల్‌లో కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల అభినందన కార్యక్రమానికి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీళ్ల గురించి, గోదావరి ఎక్కడుందో తెలియని రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌కు పాఠాలు చెప్తున్నాడన్నారు. భాక్రా నంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉందని చెబుతున్నాడని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అయిపోయిందని.. ఎలా ప్రజలను మోసం చేశారో ఆలోచించాలని పిలుపునిచ్చారు. రైతుల పరిస్థితి ఎలా తయారైందో ఆలోచించాలని, యూరియా కోసం చలిలో ఎదురు చూస్తున్నారన్నారు.
రాబందు కాలం తెచ్చిండు..
రేవంత్‌రెడ్డి ఎనకటి రోజులు తెస్తామని చెప్పి.. అదే రాబందు కాలం రేవంత్ రెడ్డి తెచ్చాడని విమర్శించారు. గ్రామాల్లో రేవంత్ రెడ్డిని నోటికొచ్చినట్లు తిడుతున్నారని, తెలంగాణను 60 సంవత్సరాల పాటు రాచిరంపాలు పెట్టిన కాంగ్రెస్ పార్టీ అనే విషయం మర్చిపోయి రేవంత్ మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. 60 సంవత్సరాల కాంగ్రెస్ దుర్మార్గాన్ని, తెలంగాణకు చేసిన ద్రోహాన్ని తన దీక్షతో ప్రాణాలకు తెగించి కొట్లాడి తెలంగాణ సాధించిన కేసీఆర్‌పై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, నదులపై, తెలంగాణపై కనీస అవగాహన లేని వ్యక్తి రేవంత్‌రెడ్డి అంటూ మండిపడ్డారు.

తెలంగాణ ప్రజలను మోసం చేసిండు..
ఇంటింటికీ నీళ్లు ఇచ్చినందుకు, అమ్మలక్కలకు ఆసరా పెన్షన్లు ఇచ్చినందుకు, ముసలి వారికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పెన్షన్‌ను 10 రెట్లు పెంచినందుకు, రైతన్నలకు రైతుబంధు ఇచ్చినందుకు, రైతుబీమా ఇచ్చినందుకు, సాగునీటి ప్రాజెక్టులు కట్టి దేశంలోనే పంటల ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిపినందుకు, తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినందుకు కేసీఆర్‌ని అలా అంటున్నాడా? అని ప్రశ్నించిన కేటీఆర్.. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో అడ్డగోలుగా హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను రాహుల్ గాంధీ మోసం చేశాడని ఆరోపించారు. ఎకరానికి రైతుబంధు రూ.15వేలు ఇస్తానని.. రైతులతో పాటు కౌలుదారులకు రైతుబంధు ఇస్తానని, ప్రతి పంటకు రూ.500 అదనపు బోనస్ చెల్లిస్తా అని చెప్పి కాంగ్రెస్ నేతలు మోసం చేశారని మండిపడ్డారు.
రాహుల్ గాంధీని ఏం చేయాలి..
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మొదటి సంవత్సరమే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన రాహుల్ గాంధీ మాటలు విని ప్రతి ఒక్క నిరుద్యోగి విద్యార్థి ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించారన్నారు. చదువుకున్న విద్యార్థులను, నిరుద్యోగులను మోసగారి మాటలతో రెచ్చగొట్టిన రాహుల్ గాంధీని ఏం చేయాలని ఆయన ప్రశ్నించారు. ఆడబిడ్డలకు బతుకమ్మ చీర పెట్టే ముఖం లేని రేవంత్ రెడ్డి, ఆడబిడ్డలకు నెలకు రూ.2500 ఇవ్వలేని సీఎం కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తా అంటున్నాడని విమర్శలు గుప్పించారు. కనీసం తులం బంగారం అయినా ఆడబిడ్డలకు ఇచ్చారా? అంటూ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పాలనలో ఆడబిడ్డలు పుస్తెలతాడు తాకట్టు పెట్టి బతికే పరిస్థితి దాపురించిందని, రేవంత్ రెడ్డి ఎందుకు అంత పిచ్చిగా మాట్లాడుతున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు.

సెక్యూరిటీ సిబ్బందినే కొడుతున్నడు
రేవంత్ రెడ్డి తన సొంత సెక్యూరిటీ సిబ్బందిని కూడా ప్రజల ముందే కొడుతున్నాడని, త్వరలో కరుస్తాడు కాబట్టి కట్టివేయమని రేవంత్ రెడ్డి భార్య గీతకు చెప్పినమన్నారు. సీఎం అయ్యాక కూడా రేవంత్ రెడ్డికి ఇంకా ఏడుపు ఎందుకు? అంటూ నిలదీశారు. రేవంత్ రెడ్డి నా చదువు మీద ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కాలేదని, రేవంత్ రెడ్డిని తల్లిదండ్రులు చదువుకోమని పంపిస్తే లంగా పనులు చేసుకుంటూ.. పెయింటింగులు వేసుకుంటూ చదువుకోలేదని.. దానికి నేనేం చేయాలి ? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తెచ్చిన మొనగాడు కేసీఆర్, అందుకే ఆయన నా తండ్రి అని గర్వంగా చెప్పుకుంటానన్నారు. అలాంటి మొనగాడిపై సవాలు చేస్తున్న రేవంత్ రెడ్డి అనేటోడు కేసీఆర్ చెప్పు ధూళికి సరిపోడని, కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్‌కే రేవంత్ రెడ్డి ఆగమాగం అవుతున్నాడని, అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే అసెంబ్లీలోనే గుండె ఆగి చస్తాడన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిద్దాం..
రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధిద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. కారు గుర్తు కనిపిస్తే కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచనతోనే ఓటు వేసి గెలిపించుకుందామన్నారు. గెలిచిన ప్రతి ఒక్క సర్పంచి మున్సిపల్ ఎన్నికల్లోనూ పనిచేయాలని, ఈ రోజు వరంగల్‌లో సర్పంచులు పెద్ద సంఖ్యలో గెలిచారని.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని బెదిరింపులు చేసినా, ఒత్తిడులకు గురిచేసినా పార్టీ కోసం నిలబడిన ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకుడికి ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. జనగామ ర్యాలీ చూస్తే కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు అనిపించిందని.. ప్రజలు గులాబీ జెండాను చూసి చప్పట్లు కొడుతుంటే సంతోషం అనిపించిందన్న కాళోజీ మాటలు గుర్తొచ్చాయన్నారు. కేసీఆర్ ఎప్పుడు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కసితో ఎదురుచూస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఏ పాత్ర లేకున్నా అన్ని పదవులు ఇచ్చిన పార్టీని వదిలి కడియం.. రేవంత్ రెడ్డితో కలిశాడని.. నిబద్ధత కలిగిన కార్యకర్తలు తమకు ఉన్నారని, కార్యకర్తలు 150 మంది సర్పంచులను గెలిపించారని, ఇది చాకలి ఐలమ్మ, షేక్ బందగీ, దొడ్డి కొమురయ్య, రాణి రుద్రమదేవి పుట్టిన గడ్డ అని తెలిపారు.
సంబంధిత వార్తలు

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



