Deshapathi Srinivas | ఆంధ్రా నేతల విమర్శలు విడ్డూరం : ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
Deshapathi Srinivas | రాష్ట్రాల మధ్య సంబంధాలు సామరస్యంగా ఉండాలని అందరూ కోరుకుంటారు, కానీ ఆ సామరస్యం తెలంగాణ నీటి ప్రయోజనాలను పణంగా పెట్టి జరగకూడదని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు.
Deshapathi Srinivas | రాష్ట్రాల మధ్య సంబంధాలు సామరస్యంగా ఉండాలని అందరూ కోరుకుంటారు, కానీ ఆ సామరస్యం తెలంగాణ నీటి ప్రయోజనాలను పణంగా పెట్టి జరగకూడదని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రులు సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని చూస్తుంటే, మాజీలు చిచ్చు పెడుతున్నారని ఆంధ్రా నాయకులు విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. గమనించాల్సిన అసలు విషయం ఒకటి ఉందని.. ఒకవైపు నల్లమల సాగర్ ప్రాజెక్టును కట్టి తీరుతామని ఏకపక్ష ప్రకటనలు చేస్తూ, మరోవైపు తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చేపట్టిన ప్రాజెక్టులకు అడ్డుతగులుతూ కేంద్రానికి లేఖలు రాయడం ఏ రకమైన సామరస్యం? అంటూ ఆయన ప్రశ్నించారు. ముసుగులో గుద్దులాట సాగిస్తూ 'సామరస్య మంత్రం' పఠిస్తే అది నిజమైన స్నేహం అనిపించుకోదని వ్యాఖ్యానించారు. కేవలం కాలయాపన, కంటితుడుపు చర్య మాత్రమే అవుతుందన్నారు. నిజమైన సామరస్యం ఏర్పడాలంటే మూడు అంశాలు ప్రాతిపదిక కావాలన్నారు.
చట్టాలకు గౌరవం: విభజన చట్టంలోని హామీలను, అంతర్రాష్ట్ర నీటి ఒప్పందాలను అక్షరాలా పాటించాలి.
న్యాయమైన వాటా: అప్పర్ రిపేరియన్, లోయర్ రిపేరియన్ హక్కుల ప్రకారం తెలంగాణకు దక్కాల్సిన ప్రతి చుక్క నీటిపై మాకు స్పష్టమైన హామీ ఉండాలి.
ద్వంద్వ వైఖరి వీడాలి: చర్చల పేరుతో కాలం గడుపుతూ, క్షేత్రస్థాయిలో తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కుట్రలు చేయడం ఆపాలి.
తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ఇరు రాష్ట్రాలు ఒకరి హక్కులను ఒకరు గౌరవించుకుంటూ, చట్టబద్ధమైన నీటి వాటాలను పారదర్శకంగా పంచుకున్నప్పుడే సామరస్యం దానికదే నెలకొంటుంది. ఒకరి పొలాలను ఎండగట్టి మరొకరు పండించుకోవాలనుకోవడం సామరస్యం కాదని, అన్యాయని ఆయన ఆరోపించారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



