త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Municipal Elections | ప్రజాస్వామ్య పండుగా? అధికార పార్టీ కుట్రా..? : ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్

Municipal Elections | మున్సిప‌ల్ ఎన్నిక‌లు ప్రజాస్వామ్య పండుగా? అధికార పార్టీ కుట్రా? అంటూ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నేత దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ ధ్వ‌జ‌మెత్తారు. ఎన్నిక‌ల షెడ్యూల్‌, నోటిఫికేష‌న్‌పై ఆయ‌న బుధ‌వారం బ‌హిరంగ లేఖ విడుద‌ల చేశారు.

P

Telangana | Published On Jan 28, 2026, 5.14 pm IST

Municipal Elections | ప్రజాస్వామ్య పండుగా? అధికార పార్టీ కుట్రా..? : ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్
Advertisement

Municipal Elections | మున్సిప‌ల్ ఎన్నిక‌లు ప్రజాస్వామ్య పండుగా? అధికార పార్టీ కుట్రా? అంటూ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నేత దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ ధ్వ‌జ‌మెత్తారు. ఎన్నిక‌ల షెడ్యూల్‌, నోటిఫికేష‌న్‌పై ఆయ‌న బుధ‌వారం బ‌హిరంగ లేఖ విడుద‌ల చేశారు. మేడారం స‌మ్మ‌క్క సార‌క్క జాత‌ర‌ను రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం అవ‌మాన ప‌రిచింద‌ని ఆరోపించారు. షెడ్యూల్‌ను చూస్తుంటే అసలు ఇది ఎన్నికలా? లేక ప్రతిపక్షాలను దెబ్బకొట్టడానికి వేసిన రాజ‌కీయ ఉచ్చా? అని ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయ‌న్నారు. ఓట‌ర్ల జాబితా స‌రి చూసుకునేందుకు కేవ‌లం ఒక రోజు, నామినేష‌న్లు వేసేందుకు రెండురోజులు, ప్ర‌చారం కోసం క‌నీసం వారం రోజులు స‌మ‌యం ఇవ్వ‌క‌పోవ‌డం అంటే ప్రజాస్వామ్యాన్ని అప‌హాస్యం చేయ‌డ‌మేన‌న్నారు. షెడ్యూల్ ప్ర‌క‌ట‌న తేదీకి, నోటిఫికేష‌న్ జారీ చేసిన తేదీకి ఒక రోజు వ్య‌వ‌ధి ఇవ్వ‌క‌పోవ‌డం దేశ చ‌రిత్ర‌లోనే ఇదే తొలిసార‌న్నారు. ఈ స‌మ‌యంలో ప్ర‌పంచంలోనే అతిపెద్ద గిరిజ‌న జాత‌ర జ‌రుగుతోంద‌ని, దాదాపు ప్ర‌తి ఇంటి నుంచి రాష్ట్ర‌వ్యాప్తంగా జాత‌ర‌కు వెళ్తార‌న్నార‌న్నారు.

ప్ర‌భుత్వం చేతిలో కీలుబొమ్మ‌గా..

జాత‌ర‌లోనే ఒక‌టి రెండు రోజులుండి అమ్మ‌వార్ల‌కు మొక్కులు చెల్లించుకుంటార‌ని తెలిపారు. కావాల‌నే ప్ర‌జ‌ల మ‌నోభావాలు ప‌ట్టించుకోకుండా ఈసీ ప్ర‌భుత్వం చేతిలో తోలుబొమ్మ‌లా మారి నియంతృత్వంగా ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు పాల్ప‌డ‌డం ప్ర‌జ‌ల విశ్వాసాలు, ఆత్మ‌గౌర‌వాన్ని దెబ్బ‌తీయ‌డ‌మేన‌ని ఆరోపించారు. ఎన్నికలంటే ఈసీ ఆఫీసులో క్లర్కుల త‌ర‌హాలో ఫైల్స్ క్లియ‌ర్ చేసిన‌ట్లు కాద‌ని.. మన ప్రజాస్వామ్యానికి పునాదులన్న విష‌యాన్ని ఈసీ మ‌రువ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి లేద‌ని.. పాల‌న ఆగిపోలేద‌ని.. ఇంత ఊపిరాడ‌నికి హ‌డావుడి ఎందుకు అంటూ ఎమ్మెల్సీ నిల‌దీశారు. ఎన్నికల సంఘం ప్రజాస్వామ్య ఎన్నికలంటేనే ఏదో ఒక పెద్ద తలనొప్పి అన్నట్టు, దాన్ని ఎలాగోలా 'సామ దాన భేద దండోపాయాలతో' త్వరగా చుట్టేయాలనే ధోరణితో వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆరోపించారు. అతి తక్కువ గడువు ఉన్న షెడ్యూల్.. ప్రతిపక్షాలను, స్వతంత్ర అభ్యర్థులను, ముఖ్యంగా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే మహిళలను, యువతను కోలుకోలేని విధంగా దెబ్బ‌తీస్తోంద‌న్నారు.

ఎన్నిక‌ల స్ఫూర్తికి విరుద్ధం..

అదే సమయంలో క్షేత్రస్థాయిలో యంత్రాంగంపై పట్టున్న అధికార పార్టీకి ఇది అనైతికమైన ఆధిక్యతను క‌ల్పిస్తుంద‌ని.. ఇది అందరికీ సమాన అవకాశాలు ఇచ్చే పోటీ కాద‌ని ఆరోపించారు. ఇది అడ్డగోలుగా సృష్టించిన 'వ్యవస్థీకృత అసమానత', అడ్డగోలుగా అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఇచ్చే "సిస్టమాటిక్ సెట్టింగ్‌గా క‌నిపిస్తోంది" అన్నారు. ఈ విష‌యంలో గ‌వ‌ర్న‌ర్ జోక్యం చేసుకోవాల‌ని కోరారు. ఈసీ షెడ్యూల్‌ని చూస్తే ఈసీ త‌న రాజ్యాంగ స్వ‌యం ప్ర‌తిప‌త్తిని ప‌క్క‌న పెట్టి రేవంత్‌రెడ్డి ప్ర‌భుత్వంతో కుమ్మ‌క్కైందా? వారి చేతిలో కీలుబొమ్మ‌గా మారిందా? అన్న అనుమానం ప్రజల్లో బలంగా కలుగుతోంద‌న్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను కేవలం ఒక "మేనేజ్డ్" డ్రామాగా మార్చేయడంతో స్వేచ్ఛాయుత ఎన్నికల స్ఫూర్తి దెబ్బతింటుంద‌ని, ఇది రాజ్యాంగ విరుద్ధమ‌న్నారు. ఎన్నికలు ఎంత వేగంగా అయిపోయాయన్నది ముఖ్యం కాద‌ని. ప్రజలు ఎంత నిజాయితీగా, ప్రలోభాలకు గురికాకుండా తమ నాయకుడిని ఎంచుకున్నారన్నదే ముఖ్యమ‌న్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement