త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Medaram | మేడారంలో బైక్‌పై ప‌ర్య‌టించిన మంత్రులు పొంగులేటి, ఆడ్లూరి

Medaram | మేడారం మ‌హా జాత‌ర నిన్న అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన సంగతి తెలిసిందే. మంత్రి సీత‌క్క అక్క‌డే ఉండి జాత‌ర ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

S

Telangana | Published On Jan 29, 2026, 11.10 am IST

Medaram | మేడారంలో బైక్‌పై ప‌ర్య‌టించిన మంత్రులు పొంగులేటి, ఆడ్లూరి
Advertisement

Medaram | త్రినేత్ర‌.న్యూస్ : మేడారం మ‌హా జాత‌ర నిన్న అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన సంగతి తెలిసిందే. మంత్రి సీత‌క్క అక్క‌డే ఉండి జాత‌ర ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఇక మ‌రో ఇద్ద‌రు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కూడా ఇవాళ ఉదయం మేడారం జాత‌ర మొత్తం క‌లియ‌తిరిగారు. ఇద్ద‌రు కూడా బైక్‌ల‌పై ప‌ర్య‌టిస్తూ, భ‌క్తుల‌ను ప‌లుక‌రిస్తూ.. జాత‌ర ఏర్పాట్ల‌పై ఆరా తీశారు.

గ‌త రాత్రి గ‌ద్దె చేరిన పెద్ద‌మ్మ‌ల‌ను స‌తీసమేతంగా ద‌ర్శ‌నం చేసుకున్న పొంగులేటి తెల్లారేస‌రిక‌ల్లా ఓ సేవా కార్య‌క‌ర్త‌లా క‌ద‌న‌రంగంలోకి దూకారు. జిల్లా కలెక్టర్ టి.ఎస్‌.దివాక‌ర్‌ను తన వెనుక కూర్చోబెట్టుకుని, స్వయంగా బైక్ నడుపుతూ జాత‌ర‌ను చుట్టేశారు. ప్రోటోకాల్ గోడలు బద్ధలు కొట్టి, సామాన్యుడిలా భక్తుల చెంతకు చేరారు. జంపన్న వాగు వద్ద భక్తులకు అందుతున్న సౌకర్యాలను క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో స‌హ‌చ‌ర మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌కుమార్ కూడా పాల్గొన్నారు.

భ‌క్తుల‌తో ముచ్చ‌ట‌..

జాత‌ర ప‌ర్య‌ట‌న‌లో భాగంంగా.. ఓ టీ షాపు వ‌ద్ద మంత్రి పొంగులేటి ఆగారు. చాయ్ తాగుతున్న భ‌క్తుల‌తో జాత‌ర ఏర్పాట్లు ఎలా ఉన్నాయ‌ని ప్ర‌శ్నిస్తూ.. వారితో స‌ర‌దాగా ముచ్చ‌టించారు. అంతేగాక ఏ ఒక్క భక్తుడికి అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో అధికారులకు అక్కడికక్కడే దిశానిర్దేశం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement