త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Vivek | హైద‌రాబాద్ – మియోషి సిస్ట‌ర్ సిటీ స్నేహ బంధానికి 20 ఏళ్లు

Minister Vivek | హైదరాబాద్ - మియోషి సిస్టర్‌ సిటీ స్నేహ బంధానికి 20 ఏళ్లు పూర్తి కావడం ఎంతో ఆనందంగా ఉంది అని రాష్ట్ర మంత్రి వివేక్ వెంక‌ట‌స్వామి అన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన జపాన్‌ ఫెస్టివల్‌–2026లో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌తో కలిసి మంత్రి వివేక్ పాల్గొన్నారు.

S

Telangana | Published On Oct 11, 2026, 5.16 pm IST

Minister Vivek | హైద‌రాబాద్ – మియోషి సిస్ట‌ర్ సిటీ స్నేహ బంధానికి 20 ఏళ్లు
Advertisement

Minister Vivek | త్రినేత్ర న్యూస్ : హైదరాబాద్ - మియోషి సిస్టర్‌ సిటీ స్నేహ బంధానికి 20 ఏళ్లు పూర్తి కావడం ఎంతో ఆనందంగా ఉంది అని రాష్ట్ర మంత్రి వివేక్ వెంక‌ట‌స్వామి అన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన జపాన్‌ ఫెస్టివల్‌–2026లో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌తో కలిసి మంత్రి వివేక్ పాల్గొన్నారు.

భారత్ జపాన్‌ మధ్య ఉన్న పరస్పర విశ్వాసం, గౌరవం, సాంకేతిక సహకారం మన సంబంధాలకు బలమైన పునాది అని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ - మియోషి మధ్య ఏర్పడిన ఈ రెండు దశాబ్దాల అనుబంధాన్ని ఇప్పుడు విద్య, నైపుణ్యాభివృద్ధి, పరిశోధన, సాంకేతికత, పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి రంగాల్లో మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది అని ఆయ‌న అన్నారు.

తెలంగాణ యువతకు ప్రపంచస్థాయి నైపుణ్యాలు అందించి, జపాన్‌తో సహా అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే మా లక్ష్యం అని వివేక్ ఉద్ఘాటించారు. జపాన్‌ విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు, సాంకేతిక సంస్థలతో దీర్ఘకాలిక భాగస్వామ్యాలు ఏర్పరచి, విద్యార్థులు, యువ నిపుణులకు కొత్త అవకాశాలు సృష్టించేందుకు కృషి చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

గత 20 ఏళ్లలో స్నేహబంధాన్ని నిర్మించుకున్నాం.. రాబోయే 20 ఏళ్లలో కలిసి కొత్త అవకాశాలను సృష్టించుకుందాం అని పిలుపునిచ్చారు. జపాన్‌ ఫెస్టివల్‌–2026 కేవలం మన స్నేహానికి ప్రతీకగా మాత్రమే కాకుండా.. సహకారం, ఆవిష్కరణలు, ఉపాధి, ఉమ్మడి అభివృద్ధికి కొత్త అధ్యాయానికి నాంది కావాలని ఆకాంక్షిస్తున్నాను అని మంత్రి వివేక్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement