Minister Vivek | బాల్క సుమన్ వ్యాఖ్యలకు కేటీఆర్ సమాధానం చెప్పాలి: మంత్రి వివేక్
Minister Vivek | ఈసారి పంట దిగుబడి ఎక్కువగా వచ్చిందని, చివరి గింజ వరకు ధాన్యం కొనుగోళ్లు చేస్తామని మంత్రి వివేక్ (Minister Vivek) అన్నారు. గతేడాది లక్ష పది వేల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు జరిపితే, ఈ ఏడాది లక్ష 70 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తామని చెప్పారు.
Minister Vivek | త్రినేత్ర.న్యూస్: ఈసారి పంట దిగుబడి ఎక్కువగా వచ్చిందని, చివరి గింజ వరకు ధాన్యం కొనుగోళ్లు చేస్తామని మంత్రి వివేక్ (Minister Vivek) అన్నారు. గతేడాది లక్ష పది వేల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు జరిపితే, ఈ ఏడాది లక్ష 70 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తామని చెప్పారు. జూన్ 6 వరకు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం బావురావుపేట ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని మంత్రి వివేక్ సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. పెద్దపల్లిలో మూడు గోదాములు కేటాయించామన్నారు. హమాలీల కొరతతో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొంచెం ఆలస్యమైందని చెప్పారు.
సింగరేణి సంస్థను 40 లారీలు, అదే విధంగా మైనింగ్ శాఖలో 45 లారీలను కేటాయించామని తెలిపారు. మొత్తం 85 లారీలతో త్వరలోనే రైతుల నుండచి చివరి గింజ వరకు కొని మిల్లులకు తరలిస్తామని స్పష్టం చేశారు. కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా జరుగుతుంటే బీఆర్ఎస్ నాయకులు రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. పార్టీలకు అతీతంగా రైతులకు భరోసా కల్పించకుండా ఆందోళనలు చేసేలా పురిగొల్పుతున్నారని విమర్శించారు.
బాల్క సుమన్ ను ప్రజలు ఒడగొట్టారని, ఆ ఫ్రస్ట్రేషన్‌లో విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ నాయకులు ఎక్కడ ధర్నాలు చేస్తున్నా రైతులు రావడం లేదని బాల్క సుమన్ (Balka Suman) చెప్పారని గుర్తుచేశారు. రూ.లక్ష కోట్ల ప్రాజెక్టు అని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కమీషన్లు తీసుకున్నారని, రైతాంగానికి ఒక్క చుక్క నీరు అందలేదన్నారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో నష్టపోయిన రైతులకు తాను నష్ట పరిహారం అందించానన్నారు. గత బీఆర్‌ఎస్ హయాంలో మిల్లుల ముందు వందల లారీలు నిలిచిపోయేవి, ఇప్పుడు అలా ఏం లేదని చెప్పారు.
సుమన్ వ్యాఖ్యలను కేటీఆర్ సమర్ధిస్తున్నారా?
చట్టాన్ని చేతుల్లో తీసుకొని షో చేయాలని బాల్క సుమన్ చూస్తున్నాడని మంత్రి వివేక్ విమర్శించారు. సింగరేణి భవన్‌ని కాల్చాలి, రైలు పట్టాలు కోయాలి అని చట్టాన్ని అతిక్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కావాలనే కార్యకర్తలను రెచ్చగొట్టి ఇక్కడ ఆందోళనలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే సహించేది లేదని, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
గత ఎన్నికల్లో 100 కేసులు రూ.100 కోట్లు ఖర్చు చేశాడని, అన్ని డబ్బులు బాల్క సుమన్‌కి ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. చట్టప్రకారం చేయాలి అని స్టేట్మెంట్‌లు ఇచే కేటీఆర్ (KTR).. బాల్క సుమన్ చేసిన చట్ట వ్యతిరేఖ వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అతడు అరెస్ట్ అయితే జైలుకు వెళ్లి పరామర్శించిన కేటీఆర్.. ఇప్పుడు చట్ట వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అంటే బాల్క సుమన్ వాక్యాలను కేటీఆర్ సమర్ధిస్తున్నాడా? అని నిలదీశారు. రాజకీయాల్లో ఎప్పుడూ ఆదర్శంగా నిలవాలి తప్ప రెచ్చగొట్టి విధ్వంసాలకు గురిచేసిలా ప్రజలు, నాయకులను తప్పుదోవ పట్టించొద్దని హితవు పలికారు. ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు.
సంబంధిత వార్తలు

Grey Jungle fowl | అరుదైన అడవి కోడి.. తిన్నారో జైలు పాలే.. ఇంతకి అదెక్కడుంటుందంటే..
మే 28, 2026

KCR Bakrid Wishes | బక్రీద్ శుభాకాంక్షలు: ముస్లింలకు కేసీఆర్ ఆత్మీయ సందేశం.. తెలంగాణ సంస్కృతికి ఇదే అసలైన ప్రతీక
మే 27, 2026

Balka Suman Arrest | తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత.. బాల్క సుమన్ అరెస్ట్‌కు స్కెచ్?
మే 27, 2026
తాజావార్తలు
- ●BSNL JTO Recruitment | బీఎస్ఎన్ఎల్లో జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టులు.. తెలంగాణలోనూ ఖాళీలు
- ●Ironing Prices | బెంగళూరులో ఇస్త్రీ ధరలు చూసి షాకైన నోయిడా వ్యాపారి
- ●Sridharbabu, Ponguleti | ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజిన్‌లా ఫ్యూచర్ సిటీ: మంత్రులు దుద్దిళ్ల, పొంగులేటి
- ●Suriya | సూర్య స్ట్రెయిట్ తెలుగు మూవీపై క్రేజీ అప్డేట్ - విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ డేట్ ఫిక్స్
- ●YouTube | యూట్యూబ్‌లో వీడియోలకు కొత్త లేబుల్స్.. ఏఐ కంటెంట్ అయితే వెంటనే చెప్పేస్తుంది..
- ●CUET UG | సీయూఈటీ యూజీ రీషెడ్యూల్.. వాయిదా పడిన పరీక్షలు ఈ తేదీల్లో..

BSNL JTO Recruitment | బీఎస్ఎన్ఎల్లో జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టులు.. తెలంగాణలోనూ ఖాళీలు

Ironing Prices | బెంగళూరులో ఇస్త్రీ ధరలు చూసి షాకైన నోయిడా వ్యాపారి

Sridharbabu, Ponguleti | ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజిన్‌లా ఫ్యూచర్ సిటీ: మంత్రులు దుద్దిళ్ల, పొంగులేటి

Suriya | సూర్య స్ట్రెయిట్ తెలుగు మూవీపై క్రేజీ అప్డేట్ - విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ డేట్ ఫిక్స్



