త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Electricity Consumption | రాష్ట్రంలో రికార్డు స్థాయికి విద్యుత్ వినియోగం..

Electricity Consumption | వ‌ర‌ణుడు ముఖం (Rainy Season) చాటేశాడు. మ‌బ్బులు మ‌చ్చుకైనా క‌నిపంచిడం లేదు. సూర్యుడు ప్ర‌తాపం చూపిస్తున్నాడు. ఉష్ణోగ్ర‌త‌లు (Temperatures) పెర‌గ‌డంతోపాటు ఉక్క‌పోత తీవ్ర‌మ‌యింది.

G

Telangana | Published On Jul 16, 2026, 7.14 am IST

Electricity Consumption | రాష్ట్రంలో రికార్డు స్థాయికి విద్యుత్ వినియోగం..
Advertisement

Electricity Consumption | త్రినేత్ర‌.న్యూస్‌: వ‌ర‌ణుడు ముఖం (Rainy Season) చాటేశాడు. మ‌బ్బులు మ‌చ్చుకైనా క‌నిపంచిడం లేదు. సూర్యుడు ప్ర‌తాపం చూపిస్తున్నాడు. ఉష్ణోగ్ర‌త‌లు (Temperatures) పెర‌గ‌డంతోపాటు ఉక్క‌పోత తీవ్ర‌మ‌యింది. దీంతో ప్ర‌జ‌లు మూల‌కుప‌డేసిన కూల‌ర్ల‌ను మ‌ళ్లీ తీస్తున్నారు. నెత్తిమీద ఫ్యాన్ తిర‌గ‌నిదే నిమిషం కూడా ఉండ‌లేక‌పోతున్నారు. ఏసీల‌కు ప‌నిచెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో విద్యుత్ వినియోగం (Electricity Consumption) ఒక్క‌సారిగా పెరిగడంతో రికార్డు స్థాయికి చేరింది. నెల రోజుల వ్యవధిలోనే రోజువారీ విద్యుత్ వినియోగం ఏకంగా 10 కోట్ల యూనిట్లు పెరిగింది.

గత నెల 14న రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ వినియోగం (Power Demand) 20.35 కోట్ల యూనిట్లుగా ఉండగా, సరిగ్గా నెల తిరిగేసరికి అంటే జూలై 14 నాటికి అది 30.90 కోట్ల యూనిట్లకు చేరుకుంది. ఏడాది క్రితం ఇదే స‌మ‌యానికి (2025 జూలై 14న) 28.60 కోట్ల యూనిట్లు న‌మోద‌యింది. దానితో పోల్చినా ఈసారి వినియోగం చాలా ఎక్కువగా ఉంది.

బోర్లపైనే ఆధారం..

సాధారణంగా వర్షాకాలంలో వ్యవసాయానికి విద్యుత్ డిమాండ్ తగ్గుతుంది. కానీ వ‌న‌లు క‌నుచూపు మేర‌లో కూడా క‌నిపించ‌క‌పోవ‌డంతో రైతులు పంటలను కాపాడుకోవడానికి పూర్తిగా బోరు బావులపైనే ఆధారపడుతున్నారు. మ‌రోవైపు హైదరాబాద్ (Hyderabad) లోనూ విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. జూలై 1 నుంచి 14 వరకు గత ఏడాది 95.77 కోట్ల యూనిట్ల విద్యుత్ వినియోగం కాగా, ఈ ఏడాది అదే సమయానికి 107.84 కోట్ల యూనిట్లకు చేరుకుంది.

 

Advertisement
Advertisement