Taj Banjara | మరో నాలుగు నెలల్లో నేలమట్టం.. చరిత్రలో కలిసిపోనున్న తాజ్ బంజారా..
Taj Banjara | హైదరాబాద్ (Hyderabad) నగరంలో మొద్దమొదటి విలావంతమైన హోటళ్లలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన తాజ్ బంజారా (Taj Banjara) ఇక చరిత్రగానే మిగిలిపోనుంది. సుమారు 47 ఏండ్లపాటు అద్భుతమైన ఆతిథ్యాన్ని అందించిన ఈ హోటల్ నేలమట్టమవుతున్నది.
Taj Banjara | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ (Hyderabad) నగరంలో మొద్దమొదటి విలావంతమైన హోటళ్లలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన తాజ్ బంజారా (Taj Banjara) ఇక చరిత్రగానే మిగిలిపోనుంది. సుమారు 47 ఏండ్లపాటు అద్భుతమైన ఆతిథ్యాన్ని అందించిన ఈ హోటల్ నేలమట్టమవుతున్నది. జంజారాహిల్స్ రోడ్ నంబర్ 1లో ఉన్న 5 స్టాట్ హోటల్ కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. బంజారా చెరువు (Banjara Lake) ఒడ్డున 3.4 ఎకరాల్లో విస్తరించిన ఈ ఐకానిక్ బిల్డింగ్ స్థానంలో 40 అంతస్తుల టవర్ రానుంది.
1979లో తాజ్ బంజారా హోటల్ ప్రారంభమైంది. 1986 వరకు దీనిని ఐటీసీ గ్రూప్ (ITC Group) నిర్వహించింది. ఆ తర్వాత సుమారు నాలుగు దశాబ్దాల పాటు తాజ్ జీవీకే హోటల్స్ (Taj GVK Hotels) ఆధ్వర్యంలో కార్యకలాపాలు కొనసాగించింది. అయితే గడువు ముగియడంతో 2023లో తాజ్ జీవీకే కూడా తప్పుకున్నది. అయితే ఒకప్పుడు ఎంతోమంది ప్రముఖులకు అద్భుత ఆతిథ్యంతో ఇవ్వడంతో వార్తల్లో నిలిచిన ఈ హోటల్ బిల్డింగ్‌ను ఆస్తి పన్ను బకాయిలు చెల్లించకపోవడంతో మున్సిపల్ (GHMC) అధికారులు 2025లో సీజ్ చేశారు. ఆ తర్వాత కొంత కాలానికి రూ.1.43 చెల్లించడంతో తిరిగి ఓపెన్ చేశారు.

కాగా, ఈ బిల్డింగ్‌ను ఔరో రియాల్టీ (Auro Realty) అనే సంస్థ రూ.315 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ స్థలంలో 40 అంతస్తుల భారీ భవనం నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న బిల్డింగ్‌ను కూల్చివేస్తున్నారు. ఏప్రిల్ నెలాఖరులోనే ఈ పనులు ప్రారంభమైనప్పటికీ.. హోటల్ బయట గోడలను తొలగిస్తుండటంతో విషయం అందరికీ తెలిసిందే. అంతకుముందే తలుపులు, కిటీకీలు, విద్యుత్ వైరింగ్, ఐరన్ ఫిక్చర్‌లను తొలగించారు. మరో నాలుగు నెలల్లో కూల్చివేతలు మొత్తం పూర్తవుతాయని, బిల్డింగ్ నేలమట్టమవుతుందని కాంట్రాక్టర్ వెల్లడించారు.
తాజావార్తలు
- ●Sonam Wangchuk | ప్రతి పౌరుడి ప్రాణం ఎంతో విలువైనది.. వాంగ్చుక్కు వైద్యం అందించండి : ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు
- ●Jagannath Rath Yatra | జగన్నాథుని రథాలు.. భక్తి వైభవానికి ప్రతీకలు.. ! నందిఘోష్, తాళధ్వజం, దేవదళన విశేషాలు ఇవే..!
- ●NSE | ఎన్ఎస్ఈ నుంచి కొత్త డెరివేటివ్స్.. ఆగస్టు 12 నుంచి నిఫ్టీ ఇండియా ఎఫ్‌పీఐ 150 ఇండెక్స్‌పై ట్రేడింగ్..
- ●Jagannath Rath Yatra | ఘనంగా జగన్నాథుడి రథయాత్ర.. భక్తులతో కిక్కిరిసిన పూరీ క్షేత్రం
- ●Prabhas Fauzi | అఫీషియల్ - ఫౌజీ రిలీజ్ డేట్ ఫిక్స్ - యుద్ధభూమిలో వీరుడిగా ప్రభాస్ - పోస్టర్ వైరల్
- ●IRCTC | ఐఆర్సీటీసీ కొత్త వెబ్సైట్ బీట్ వెర్షన్ లాంచ్.. ఫీడ్ బ్యాక్ కోరుతున్న రైల్వే మంత్రిత్వ శాఖ..

Sonam Wangchuk | ప్రతి పౌరుడి ప్రాణం ఎంతో విలువైనది.. వాంగ్చుక్కు వైద్యం అందించండి : ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

Jagannath Rath Yatra | జగన్నాథుని రథాలు.. భక్తి వైభవానికి ప్రతీకలు.. ! నందిఘోష్, తాళధ్వజం, దేవదళన విశేషాలు ఇవే..!

NSE | ఎన్ఎస్ఈ నుంచి కొత్త డెరివేటివ్స్.. ఆగస్టు 12 నుంచి నిఫ్టీ ఇండియా ఎఫ్‌పీఐ 150 ఇండెక్స్‌పై ట్రేడింగ్..

Jagannath Rath Yatra | ఘనంగా జగన్నాథుడి రథయాత్ర.. భక్తులతో కిక్కిరిసిన పూరీ క్షేత్రం



