Sridhar babu | అనర్హత పిటిషన్లపై సభలో చర్చించలేం : మంత్రి శ్రీధర్ బాబు
Sridhar babu | అనర్హత పిటిషన్లపై సభలో చర్చించలేమని, ఈ విషయం సభ్యులందరికీ తెలుసు అని శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ ముగిసిన అనంతరం స్పీకర్ అనుమతితో శ్రీధర్ బాబు స్పష్టత ఇచ్చారు.
Sridhar babu | త్రినేత్ర.న్యూస్ : అనర్హత పిటిషన్లపై సభలో చర్చించలేమని, ఈ విషయం సభ్యులందరికీ తెలుసు అని శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ ముగిసిన అనంతరం స్పీకర్ అనుమతితో శ్రీధర్ బాబు స్పష్టత ఇచ్చారు.
శ్రీధర్ బాబు స్పష్టత ఇలా..
అనర్హతల పిటిషన్లకు సంబంధించి సభా పరిధిలోకి రాదన్న విషయం సభ్యులంరదికి తెలిసిందే. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయబడిన ట్రిబ్యునళ్లకు ఈ అంశంపై సంపూర్ణ అధికారం ఉంటుంది. నిన్న కూడా మీరు స్పష్టత ఇవ్వడం జరిగింది. పదేపదే ఆ విషయాన్ని ప్రస్తావన చేస్తున్న సందర్భంలో ఈ విషయం సభ పరిధిలోకి రాదని తెలియజేస్తున్నాం. ఈ విషయం సభ్యులందరికి తెలిసినప్పటికీ సభలో ప్రస్తావించారు. అనర్హత పిటిషన్లకు సంబంధించిన విషయం పరిష్కరించబడిందని మీ ద్వారా సభకు తెలియజేస్తున్నాం. ఇతర నిర్ణయాధికార సంస్థల మాదిరే 10వ షెడ్యూల్ కింద ఏర్పాటు చేయబడిన ఈ ట్రిబ్యునల్ నిర్ధారించిన పద్ధతులను పాటించి నిర్ణయానికి వస్తుందని ట్రిబ్యునల్ ముందుంచిన సాక్ష్యాలను పరిశీలించి నిర్ధారణకు వచ్చింది. నిర్దేశించబడ్డ న్యాయ సూత్రాలను అన్వయించుకుంటూ చట్టంలో గతంలో రూపొందించిన సూత్రాలను, సహజ న్యాయ సూత్రాలను పాటిస్తూ ఆ ట్రిబ్యునల్ సమస్యలను పరిష్కరిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో సంబంధిత ట్రిబ్యునల్ దురుద్దేశాలను అపాదించడం సరికాదు.. సమర్థనీయం కాదు. ట్రిబ్యునల్ తీర్పుతో ఏ పక్షమైన న్యాయం జరగలేదని భావిస్తే తగిన న్యాయం కోసం నిర్దిష్టమైన పద్ధతులను సూచించింది. దీనిపై సభ చర్చ చేపట్టదని స్పష్టం. సభలో ఈ అంశాన్ని లేవనెత్తడం అసంబద్ధం.. ఎవరి పేరు తీయలేదు.. పదేపదే ఈ ప్రస్తావన వస్తున్న తరుణంలో స్పష్టత ఇస్తున్నాం అని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026

CM Revanth Reddy | బండి భగీరథ్ సరెండర్ కాలేదు.. అరెస్టు చేశాం : సీఎం రేవంత్ రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



