త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Sridhar Babu | ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఇవ్వ‌లేం.. మంత్రి శ్రీధ‌ర్ బాబు కీల‌క వ్యాఖ్య‌లు

Minister Sridhar Babu | రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ అభ్య‌ర్థులంద‌రికీ ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఇవ్వ‌లేమ‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి శ్రీధ‌ర్ బాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

S

Telangana | Published On Jan 6, 2026, 6.15 pm IST

Minister Sridhar Babu | ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఇవ్వ‌లేం.. మంత్రి శ్రీధ‌ర్ బాబు కీల‌క వ్యాఖ్య‌లు
Advertisement

Minister Sridhar Babu | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ అభ్య‌ర్థులంద‌రికీ ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఇవ్వ‌లేమ‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి శ్రీధ‌ర్ బాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ‌త రెండేండ్ల నుంచి ఉద్యోగ నోటిఫికేష‌న్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్య‌ర్థులు శ్రీధ‌ర్ బాబు వ్యాఖ్య‌ల‌తో తీవ్ర నిరాశ చెందారు. శాస‌న‌మండ‌లిలో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా తెలంగాణ కొత్త ప‌రిశ్ర‌మ‌లు అనే అంశంపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి శ్రీధ‌ర్ బాబు స‌మాధానం ఇస్తూ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

ప్ర‌భుత్వ రంగంలోనే ఎంప్లాయ్‌మెంట్ కుద‌ర‌దు. ఈ రోజు వేలాది మంది గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లుగా ఉండి ఉపాధి లేని వారికి ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించాం. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన అన‌తి కాలంలోనే 70 వేల ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘ‌న‌త మాదే. ఈ ఉద్యోగాల్లో అత్య‌ధికులు బ‌డుగు, బ‌ల‌హీన‌, మైనార్టీ వ‌ర్గాల‌కు చెందిన అభ్య‌ర్థులే ఉన్నారు. గ్రూప్-1, గ్రూప్ -2, గ్రూప్ -4 ప‌రీక్ష‌లు నిర్వ‌హించాం. జాబ్ క్యాలెండ‌ర్‌పై డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క స‌భ‌లో, మండ‌లిలో ప్ర‌క‌ట‌న చేశారు. ఎస్సీ, బీసీ రిజ‌ర్వేష‌న్ల అంశాన్ని దృష్టిలో ఉంచుకుని జాబ్ క్యాలెండ‌ర్‌ను విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నామ‌ని మంత్రి శ్రీధ‌ర్ బాబు పేర్కొన్నారు.

https://x.com/i/status/2008416838234030112

Advertisement

తాజావార్తలు

Advertisement