త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sridhar Babu | కేసీఆర్ తీరు మార‌కుంటే.. బీఆర్‌ఎస్‌ మ‌రో ప‌దేండ్లు రోడ్ల‌పైనే: మంత్రి శ్రీధ‌ర్ బాబు

Sridhar Babu | పదేండ్లు ముఖ్య‌మంత్రిగా పనిచేసిన కేసీఆర్‌ (KCR) సభకు వచ్చి వారి అనుభవాన్ని పంచుకోవాలని మంత్రి శ్రీధర్‌బాబు (Sridhar Babu) కోరారు. బీఆర్‌ఎస్‌ నేతలతో రోడ్లపై మాట్లాడించడం కాదని, సభకు వస్తే సమాధానం చెప్తామన్నారు.

G

Telangana | Published On Sep 6, 2026, 1.32 pm IST

Sridhar Babu | కేసీఆర్ తీరు మార‌కుంటే.. బీఆర్‌ఎస్‌ మ‌రో ప‌దేండ్లు రోడ్ల‌పైనే: మంత్రి శ్రీధ‌ర్ బాబు
Advertisement

Sridhar Babu | త్రినేత్ర‌.న్యూస్‌: పదేండ్లు ముఖ్య‌మంత్రిగా పనిచేసిన కేసీఆర్‌ (KCR) సభకు వచ్చి వారి అనుభవాన్ని పంచుకోవాలని మంత్రి శ్రీధర్‌బాబు (Sridhar Babu) కోరారు. బీఆర్‌ఎస్‌ నేతలతో రోడ్లపై మాట్లాడించడం కాదని, సభకు వస్తే సమాధానం చెప్తామన్నారు. మీరు అసెంబ్లీలో లేవ‌నెత్తే అంశాల‌కు ధీటుగా జ‌వాబిస్తామ‌ని వెల్ల‌డించారు. కాంగ్రెస్‌ పార్టీ (Congress) జవాబుదారీతనంతో పని చేస్తున్న‌ద‌ని తెలిపారు. కేసీఆర్ తీరు మార‌కుంటే మ‌రో ప‌దేండ్లు కూడా వాళ్లు రోడ్ల మీద‌నే ఉంటార‌న్నారు. ప‌దేండ్లు అనేక ఇబ్బందులు ప‌డిన ప్ర‌జానీకం, మార్పు కావాల‌ని 2023లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చుకున్నార‌ని చెప్పారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన శాసనసభ సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద అధికార‌ కాంగ్రెస్ పార్టీ మ‌హాధ‌ర్నా నిర్వ‌హిస్తున్న‌ది. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మంత్రి శ్రీధ‌ర్ బాబు మాట్లాడుతూ.. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడి పాత్ర పోషించ‌ని కేసీఆర్ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. ప్ర‌జాపాల‌న‌పై సోషల్ మీడియాలో బీఆర్ఎస్‌ విష ప్రచారం చేస్తున్నద‌ని, కాంగ్రెస్ కార్య‌క‌ర్తలు దానిని తిప్పికొట్టాల‌ని పిలుపునిచ్చారు.

మ‌రో ప‌దేండ్లు రోడ్ల‌పైనే..

బీఆర్ఎస్, బీజేపీ కార్యక‌ర్త‌లారా పేద‌ల కోసం అనేక సంక్షే ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నాం. 2023, డిసెంబ‌ర్ 7న మ‌హిళ‌ల‌కు ఉచిత బస్ ప్ర‌యాణం క‌ల్పించాం. అందులో కాంగ్రెస్ వాళ్లు మాత్రమే ప్రయాణం చేస్తున్నారా?. ఉచిత బస్సు ప్రయాణం (Free Bus For Women) చేసే వాళ్లలో బీజేపీ, బీఆర్ఎస్ వాళ్లు లేరా?. మ‌హిళ‌ల‌కు ఉచిత ప్రయాణం క‌ల్పిస్తే దానిపై కూడా విమర్శలు చేయడానికి సిగ్గులేదా?. గ‌త ప్ర‌భుత్వంలో ప‌దేండ్ల‌లో ఒక్క రేష‌న్ కార్డు కూడా ఇవ్వ‌లేదు. కానీ ప్ర‌జా ప్ర‌భుత్వంలో అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ రేష‌న్ కార్డు ఇస్తున్నాం. మ‌రో పేండ్లు బీఆర్ఎస్ అధికారంలోకి రాదు.

మీ నాయకత్వం సరిగా లేకుంటే బీఆర్ఎస్‌ వాళ్లను మ‌రో పదేండ్లు రోడ్ల‌పైనే కూర్చోపెడుతారు. ఏం చేశారని రెండు పార్టీల నాయ‌కులు రోడ్ల‌పై ధర్నాలు చేస్తున్నారు. అన్ని వర్గాల ప్ర‌జ‌ల‌కు మేమున్నామంటూ కాంగ్రెస్ పార్టీ పథకాలు ఇస్తున్న‌ది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మీ మంత్రి వర్గం.. రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితిలో మీ పాలన కొనసాగింది. తాము రేష‌న్ కార్డు (Ration Cards) ఇవ్వ‌డానికి పార్టీలు చూడ‌లేద‌. మీ హయాంలో మేము ఎన్ని ధర్నాలు చేసినా రేషన్ కార్డులు ఇవ్వలేదు. దీనిపై రోడ్ల మీద మాట్లాడే వాళ్లు సమాధానం చెప్పాలి. మీ హయంలో ఇప్పుడు ఎత్తుకున్న అంశాల‌పై మీ ముఖ్య‌మంత్రిని ఎందుకు ప్ర‌శ్నించ‌లేద‌ని కేటీఆర్‌, హరీశ్‌ రావుని` నిల‌దీశారు.

గ్రూప్‌-1 ప‌రీక్ష‌లు ఎందుకు పెట్ట‌లేదు?

ఎక్కడా లేని సంక్షేమ పథకాలను ఇక్కడ తెచ్చాం. సన్న బియ్యం ఎక్కడైనా ఉందా?. పేద ప్రజలకు రేషన్ వస్తుందంటే మార్పు కాదా?. రైతులకు రూ.1 లక్ష 60 వేల కోట్లు పైగా ఖర్చు చేశాం. ఆరు గ్యారెంటీల‌ను (Six Guarentees) వంద శాతం అమలు చేసేలా ముందుకు పోతున్నాం. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ స్కూళ్ల‌ను తయారుచేస్తున్నాం. మీరు చేయలేని పని మేము చేసి చూపిస్తున్నాం. పరీక్షలు నిర్వహించలేని దౌర్భాగ్య పరిస్థితి బీఆర్ఎస్‌ హయాంలో ఉంది. గ్రూప్ 1 పరీక్షలు (Group 1 Exams) ఎందుకు నిర్వహించలేదో బీఆర్ఎస్ స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

పదేళ్ల కాలం వృథా చేసినందుకు విద్యార్థులకు క్షమాపణలు చెప్పాల‌న్నారు. పదివేల మంది టీచర్ల నియామకం చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేన‌ని స్ప‌ష్టం చేశారు. నిరుద్యోగ యువతను మోసం చేసినందుక మీరు ధర్నా చేస్తున్న‌ద‌ని మండిప‌డ్డారు. రైతుబందు ఇచ్చి అన్నీ బంద్ పెట్టారని విమ‌ర్శించారు. త‌మ‌ది 420 ప్ర‌భుత్వ‌మ‌ని విమ‌ర్శిస్తున్నార‌ని.. ప్ర‌జ‌ల‌కు రెండు సార్లు వాగ్దానాలు ఇచ్చి అమలు చేయని బీఆర్ఎస్ (BRS) పార్టీయే డబుల్ 420 అని మండిప‌డ్డారు. మీరు చేయలేదు, మేము చేస్తే ఒరుస్తలేర‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సుదీర్ఘ అనుభవం ఉన్న కేసీఆర్ సభకు రావాల‌ని కోరారు. కేసీఆర్‌ ఏం చెప్పినా వినడానికి తాము సిద్ధంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement