త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Seethakka | మ‌హిళా జ‌ర్న‌లిస్టుల‌పై దాడులు స‌రికావు : మంత్రి సీత‌క్క‌

Minister Seethakka | సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామాపై జరుగుతున్న నిరసనలను కవర్ చేస్తున్న మహిళా జర్నలిస్టులపై దాడులు, వేధింపులు జరుగుతున్నాయనే నివేదికలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని మంత్రి సీత‌క్క పేర్కొన్నారు.

S

Telangana | Published On Oct 24, 2026, 5.05 pm IST

Minister Seethakka | మ‌హిళా జ‌ర్న‌లిస్టుల‌పై దాడులు స‌రికావు : మంత్రి సీత‌క్క‌
Advertisement

Minister Seethakka | త్రినేత్ర న్యూస్ : సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామాపై జరుగుతున్న నిరసనలను కవర్ చేస్తున్న మహిళా జర్నలిస్టులపై దాడులు, వేధింపులు జరుగుతున్నాయనే నివేదికలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని మంత్రి సీత‌క్క పేర్కొన్నారు. హైద‌రాబాద్‌లోని బేగంపేట్ టూరిజం ప్లాజాలో ఇండియ‌న్ జ‌ర్న‌లిస్ట్స్ యూనియ‌న్ నిర్వ‌హించిన జాతీయ జ‌ర్న‌లిస్టు స‌ద‌స్సును మంత్రి సీత‌క్క ప్రారంభించి ప్ర‌సంగించారు.

పత్రికా స్వేచ్ఛ అనేది బలమైన ప్రజాస్వామ్యానికి పునాది. మహిళా జర్నలిస్టుల స్వేచ్ఛను రక్షించడం మనందరి ఉమ్మడి బాధ్యత. ప్రజాస్వామ్యం యొక్క బలం ప్రశ్నలను అణచివేయడంలో లేదు, వాటికి సమాధానం చెప్పే ధైర్యం కలిగి ఉండటంలో ఉంది. బీజేపీ, ఆరెస్సెస్ పాలనలో మహిళల స్వేచ్ఛ, భద్రతపై దాడులు పెరిగాయి. మనం మనుస్మృతి భావజాలాన్ని తిరస్కరించాలి. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అందించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే రాజ్యాంగ విలువలను కాపాడాల‌ని సీత‌క్క పేర్కొన్నారు.

Advertisement
Advertisement