Ponnam Prabhaker | నిర్వీర్యమైన ఆర్టీసీని లాభాల్లోకి తీసుకెళ్తున్నాం : మంత్రి పొన్నం ప్రభాకర్
Ponnam Prabhaker | బీఆర్ఎస్ హయాంలో నిర్వీర్యం చేసిన ఆర్టీసీని ప్రజా పాలనలో ఆపరేషనల్ ప్రాఫిట్‌లోకి తీసుకెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
Ponnam Prabhaker | త్రినేత్ర.న్యూస్ : బీఆర్ఎస్ హయాంలో నిర్వీర్యం చేసిన ఆర్టీసీని ప్రజా పాలనలో ఆపరేషనల్ ప్రాఫిట్‌లోకి తీసుకెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆర్టీసీ లాభాల్లో ఉందా..? నష్టాల్లో ఉందా..? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హరీశ్‌రావు ప్రశ్నకు మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం ఇచ్చారు.
ఆర్టీసీని మోయలేం మూసేస్తాం. 48 వేల ఉద్యోగులపై వేటు వేస్తున్నామని గత ప్రభుత్వం వివిధ రకాలుగా ప్రకటనలు చేసింది. ఒక్క కొత్త బస్సు కొనకుండా, నియామకాలు చేపట్టకుండా, ఆర్టీసీని పదేండ్ల పాటు నిర్వీర్యం చేశారు. ఆర్టీసీకి సంబంధించిన అనేక అంశాలపై ప్రజా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ వస్తుంది. గత పదేండ్లలో వివిధ కారణాలతో సస్పెండ్ అయిన ఉద్యోగుల విషయంలో త్రి మెన్ కమిటీ వేసి 250 మందికి ఉద్యోగాలు తిరిగి ఇచ్చాం. కొత్తగా నియామకాలు చేపట్టాం. 207 కొత్త బస్సులు కొన్నాం. పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను రిప్లేస్‌మెంట్ చేస్తున్నాం. మహిళ సంఘాల ద్వారా బస్సులు కొనుగోలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఉచిత బస్సు పథకంతో బస్సులకు కొంత డిమాండ్ ఉంది. ఇప్పటికే కొత్త బస్సులు తీసుకొచ్చాం. హైదరాబాద్‌లో కూడా కొత్త మార్గాల్లో బస్సులు వేస్తున్నాం. కొత్త బస్సులను కొనుగోలు చేయాలని మా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. ఇటీవల కేంద్రం తీసుకున్న పీఎం ఈ డ్రైవ్ కింద ఎలక్ట్రిక్ బస్సులను తీసుకునేందుకు సానుకూల నిర్ణయం తీసుకున్నాం. గుర్తింపు సంఘాలను పునరుద్ధరించే పనిలో ఉన్నాం. ఆర్టీసీని ఆపరేషనల్ ప్రాఫిట్‌లోకి తీసుకెళ్తున్నాం. అందుకు ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయం అందిస్తుంది. ప్రభుత్వ సహకారంతో ప్రగతి రథచక్రాలు ముందుకు కదులుతున్నాయి. రాష్ట్రంలో 80 శాతం ఆక్యుపెన్సీతో లైఫ్‌లైన్‌గా ఉంది అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






