త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Ponnam Prabhakar | ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్క‌రించిన మంత్రి పొన్నం

P

Telangana | Published On Jan 13, 2026, 4.42 pm IST

Minister Ponnam Prabhakar | ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్క‌రించిన మంత్రి పొన్నం
Advertisement

Minister Ponnam Prabhakar | ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం డైరీని రాష్ట్ర ర‌వాణాశాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ మంగ‌ళ‌వారం ఆవిష్క‌రించారు. రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు ముద్దగోని రాంమోహన్ గౌడ్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ, ఇతర సమస్యలను విశ్రాంత ఉద్యోగులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. 2025 వరకు రిటైర్డ్ కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేయించాలని విజ్ఞ‌ప్తి చేశారు. ఇంద‌కు మంత్రి సానుకూలంగా స్పందించార‌ని నేత‌లు తెలిపారు. కార్య‌క్ర‌మంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బుచ్చిరెడ్డి, ఉపాధ్యక్షుడు యాదగిరి గారు, రాష్ట్ర కార్యదర్శులు కేఎన్ రెడ్డి, కే సంత్యం, ఎన్ఆర్ స్వామి పాల్గొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement