Ponnam Prabhakar | మహిళల ఆర్థిక సాధికారతే.. సమాజ అభివృద్ధికి పునాది: మంత్రి పొన్నం ప్రభాకర్
Ponnam Prabhakar | మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. మహిళల ఆర్థిక సాధికారతే కుటుంబ సాధికారతకు, తద్వారా సమాజ అభివృద్ధికి పునాది అని చెప్పారు.
Ponnam Prabhakar | త్రినేత్ర న్యూస్: మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. మహిళల ఆర్థిక సాధికారతే కుటుంబ సాధికారతకు, తద్వారా సమాజ అభివృద్ధికి పునాది అని చెప్పారు. గత మూడేండ్లుగా వడ్డీలేని రుణాలపై వడ్డీని కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. మహిళా సంఘాల ద్వారా ఇందిరమ్మ క్యాంటీన్లు (Indiramma Canteen) నిర్వహించడంతో పాటు, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు, ఇతర ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కలిసి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆలోచనలకు అనుగుణంగా ఇందిరమ్మ క్యాంటీన్లను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగిస్తూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుందన్నారు. హైదరాబాద్ నగరంలో ప్రతిరోజూ కష్టపడి పనిచేసుకుంటూ జీవనం సాగించే పేద, సామాన్య ప్రజలకు కేవలం రూ.5కే నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
పట్టణ ప్రాంతాల్లోని మహిళలు కూడా..
మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం మహిళలకు ఆర్ధిక వృద్ధి సాధించడానికి వారితో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌లను (Mahila Shekthi Canteen) ఏర్పాటు చేస్తున్నదని వెల్లడించారు. ప్రభుత్వం తరఫున అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తూ శాశ్వత నిర్మాణాలతో, అన్ని సౌకర్యాలతో క్యాంటీన్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలన్నదే తెలంగాణ ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోని మహిళలు కూడా పెద్ద సంఖ్యలో స్వయం సహాయక సంఘాల్లో (SHG) సభ్యులుగా చేరాలని కోరారు. ప్రభుత్వం మహిళా సంఘాలకు గతంలో రూ.5 లక్షల వరకు అందించిన వడ్డీలేని రుణ పరిమితిని రూ.10 లక్షల వరకు పెంచిందని తెలిపారు.
వడ్డీ చెల్లిస్తున్న ప్రభుత్వం
గత మూడేండ్లుగా వడ్డీలేని రుణాలపై వడ్డీని కూడా ప్రభుత్వమే చెల్లిస్తున్నదని చెప్పారు. మహిళా సంఘాల ద్వారా ఇందిరమ్మ క్యాంటీన్లు నిర్వహించడంతో పాటు, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు, ఇతర ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులను (RTC Bus) కూడా అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. ఇప్పటికే 600 బస్సులకు మహిళలను యజమానులను చేసిందని వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లోనూ మహిళా సంఘాలకు ఈ అవకాశాలను విస్తరించాలనే ఆలోచన ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోని మహిళా సంఘాల ద్వారా బస్సులు కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించేందుకు అర్హత ఉన్న సంఘాలను గుర్తించాలని, 100 శాతం రీపేమెంట్ సామర్థ్యం ఉన్న మహిళా సంఘాలకు అవకాశం కల్పించే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ను కోరారు.
అదేవిధంగా బీసీ, మైనారిటీ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కుట్టు మిషన్లను అందించే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేపడుతున్నదని వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో మహిళలకు కుట్టు మిషన్లతో (Suing Mation) పాటు అవసరమైన శిక్షణ అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మంచి సాంకేతికత కలిగిన నాణ్యమైన కుట్టు మిషన్లను అందించేలా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అర్హత ఉన్న మహిళలు సెప్టెంబర్ 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
కుటుంబానికే పరిమితం కావొద్దు..
మహిళలు కేవలం కుటుంబానికి పరిమితం కాకుండా ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగాలన్నారు. కుటుంబాన్ని ఆర్థికంగా నడిపించే శక్తి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మహిళలకు రావాలని చెప్పారు. మహిళల ఆర్థిక సాధికారతే (Economic Empowerment) కుటుంబ సాధికారతకు, తద్వారా సమాజ అభివృద్ధికి పునాది అన్నారు. అందుకే మహిళా సంఘాలను మరింత బలోపేతం చేయడంతో పాటు వారికి వడ్డీలేని రుణాలు, ఉపాధి అవకాశాలు, శిక్షణ, కుట్టు మిషన్లు, క్యాంటీన్లు, బస్సులు వంటి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తున్నదని వెల్లడించారు. తెలంగాణలోని ప్రతి అక్కచెల్లెమ్మ ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలపడాలని, స్వయం సమృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని చెప్పారు.
తాజావార్తలు
- ●IPO | ఐపీఓల జాతర.. ఈ వారం 20 కొత్త ఇష్యూలు..
- ●Ujjain Mosque Removal | ఉజ్జయినిలో ఘర్షణ.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు
- ●Blue Star | గృహోపకరణాల ధరలకు రెక్కలు.. భారీగా పెరిగిన షేర్ల ధరలు..
- ●Balapur Ganesh | భారీగా పెరిగిన బాలాపూర్ గణేశుడి హుండీ ఆదాయం.. ఈ ఏడాది ఎంతంటే?
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.25వేలకు పైగా తగ్గిన పసిడి ధర.. పెట్టుబడిదారులకు నిపుణుల అలర్ట్..
- ●PB Fintech | పాలసీ బజార్ షేర్లకు ఊరట.. 4 శాతం జంప్.. కొనాలా.. వేచి చూడాలా..?

IPO | ఐపీఓల జాతర.. ఈ వారం 20 కొత్త ఇష్యూలు..

Ujjain Mosque Removal | ఉజ్జయినిలో ఘర్షణ.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు

Blue Star | గృహోపకరణాల ధరలకు రెక్కలు.. భారీగా పెరిగిన షేర్ల ధరలు..

Balapur Ganesh | భారీగా పెరిగిన బాలాపూర్ గణేశుడి హుండీ ఆదాయం.. ఈ ఏడాది ఎంతంటే?






